Posts

Showing posts from February, 2021

బోధిసత్త్వుడు

Image
పాళీ భాషలోని పదం బోధిసత్త్వ.  బోధి అంటే బుద్ధత్వం లేదా గొప్ప జ్ఞానం అని అర్థం. థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను "బోధి" అంటారు సత్త్వం అంటే ప్రాణి అని అర్థం.బుద్ధత్వం పొందడానికి ముందు సిద్ధార్థ గౌతమునికి ఈ పేరునే ఉపయోగించారు. భవిష్యత్ లో బుద్ధుడు లేదా మహాజ్ఞాని అవగలిగే ప్రాణి అంటే బుద్ధత్వం పొందడం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళని  బోధిసత్త్వుడు అని అంటారు. బోధిసత్త్వుడు ఎల్లప్పుడూ తనకు జ్ఞానోదయం కావడం  మాత్రమే కాకుండా ఇతరులు కూడా జ్ఞానోదయం పొందాలని పాటుపడతారు. ముఖ్యంగా పరుల హితం కోసం తపిస్తూ పరుల కోసం పనులు చేసే వాళ్ళని బోధిసత్త్వుడు అంటారు. ఇతరులు బోధిని పొందడం కోసం పనులు చేసేవారిని బోధిసత్త్వుడు అంటారు. బోధిసత్త్వుడు రెండు పనులు చేస్తారు. 1.తనను తాను పరిపూర్ణుడుగా చేసుకోవడానికి కృషి చేయడం. 2.పరులకు లాభం చేసే పనులు చేయడం. మహాయాన బౌద్ధం ప్రకారం బోధిసత్త్వుడు ఎప్పుడు ఏం అనుకుంటారు అంటే ఎవరైనా తనకు చెడు చేస్తే ఆ చెడు తనకు మంచి చేయడానికి చేసిన సేవగా భావిస్తారు. అలా భావించడం అంటే తాను బుద్ధుల మార్గంలో ఉన్నారని అనుకుంటారు. డా.బాబాసాహెబ్ అంబేద...

ఆనందమంటే తృప్తిగా తినడమేనా?

Image
          మనిషి ఆనందంగా ఉండటానికి ఏమి చేయాలో తెలీక రోజూ కామెడీ సినిమాలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కొంత మందైతే గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ క్రుంగిపోతూ వుంటారు. సంతోషమనేది ఇతరులతో పంచుకుంటే వస్తుంది. ఒక దీపంతో వేల దీపాలను వెలిగించవచ్చు. అలాగే ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే ఏ మాత్రం తగ్గిపోదని బుద్ధుడు చెప్పినాడు. తనకున్న దాంట్లో సంతృప్తి చెందనివాడు ఏనాడూ సంతోషంగా ఉండలేడన్నాడు.      ఆనందమంటే పుష్కలంగా ఉండటం కాదని పుష్కలంగా ఇవ్వటమని ఆయన బోధించాడు. బుద్ధుడు మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చాడు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకుండా మనస్సును పరిశుభ్రంగా దృఢంగా ఉంచుకోవడం సాధ్యం కాదన్నాడు. గతాన్ని తలపోస్తూ భవిష్యత్తుపై బెంగ పెట్టుకొని కష్టాలొస్తాయోమోనని భయపడుతూ ఉంటే మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉండలేమన్నాడు. వర్తమానం పై దృష్టి పెట్టి, ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని ఆయన బోధించాడు. బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గాలన్ని మన ఆలోచనల్ని సరైనదారిలో ఉంచేందుకు తోడ్పడేవే. బుద్ధుడు కేవలం విజ్ఞానాన్ని బోధించే వ్యక్తికాదు. ఆయన ఆచ...

మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలన్న బుద్ధుడు

Image
మనిషి తన జీవిత కాలంలో ఉన్నతుడు కావాలంటే తన చరిత్రను, తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి.ఇతరులపై ఆధారపడ కూడదంటాడు బుద్ధుడు, ఒక పువ్వు ఎలా తానే వికసించి, పరిమళిస్తుందో, అందరికిఅందాన్ని, సువాసనను వెదజల్లుతుందో అలాగా మనిషి కూడా తన్నుతాను మార్చుకుంటూ పదిమంది మార్పుకు దోహదం చేయగలగాలని బుద్ధుడు బోధించాడు.        బౌద్ధంలో విశిష్టమైన లక్షణం " ఎవ్వరో చెప్పినారని గ్రుడ్డిగా నమ్మకుండా తనంత తాముగా సత్యాన్నితెలుసుకోమని చెప్పడం" బుద్ధుడు 'నీకెవరో చెప్పినారని నమ్మకు, నీ గురువు చెప్పినాడని నీ గురువుపై ఉన్న గౌరవం కారణంగా నమ్మవద్దు. అయితే నీ పరిశీలన, విశ్లేషనతో దానిని పది మందికి ఉపయోగపడతుంటే అప్పుడు దానిని స్వీకరించు. నీకు దారి చూపే మార్గంగా భావించు" అంటూ స్వీయ సాధనకు పెద్దపీట వేసాడు. అలాగే పురాణాల్లో, మత గ్రంథాల్లోనూ రాశారని గ్రుడ్డిగా నమ్మవద్దని కూడా చెప్పినాడు. పూర్వీకులు చెప్పినారని,గురువులు చెప్పినారని నమ్మవద్దు. స్వీయపరిశీనలతో, విశ్లేషణతో అవి సమ్మతమనిపిస్తే, వాటిని స్వీకరించవచ్చని, ఆచరించవచ్చని చెప్పినాడు. కాని నేడు సమాజంలో సంప్రదాయవాదులే ఎక్కువ.వీరు మారరు.ఇతరులన...

కోపగించు కోకుండా ఉండాలంటే ఏంచేయాలో చెప్పిన బుద్ధుడు

Image
            వ్యక్తిత్వ వికాసంలోనూ, మనిషి తన ప్రవర్తనను నియంత్రించుకోవడంలోనూ కీలకమైనది 'కోపం'.           కోపం గురించి బుద్ధుడు చెప్పినంతగా మరెవరూ చెప్పలేదు. నీవు కోపంతో ఉండటమంటే ఇతరులు చేసే తప్పులు నిన్నుకాల్చేస్తున్నాయని అన్నాడు. నీ కోపాన్ని చూసి ఎవరూ నిన్ను శిక్షించరు. అది నిన్ను శిక్షిస్తుందన్నాడు. నీవు కోపగించు  కుంటున్నావంటే నిప్పును చేతిలో పట్టుకొని దాన్ని ఇతరులపైకి వేయాలనుకోవడం వంటిదన్నారు. ఎందుకంటే అది నిన్ను కాల్చేస్తుందన్నాడు.          కోపగించు కోకుండా ఉండాలంటే ఒక చక్కని మార్గాన్ని సూచించాడు బుద్ధుడు. కోపం ఎప్పుడు వస్తుందంటే ఒక విషయంపై మనలో వ్యతిరేకతా భావం ఏర్పడినప్పుడే. అందువల్ల వ్యతిరేక భావాల్ని మన మనసులో లేకపోతే, లేదా మరచిపోతే కోపం దానంతట అదే మాయమవుతుంది. కోపం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు.        ఇతరులను జయించాలన్న ఆలోచనకన్నా తన్నుతాను జయించుకోవడమే గొప్పదన్నాడు. ఈ పని కోపాన్ని నిగ్రహించుకోవడంతోనే మొదలవుతుంది.        సుమతి  శతకం ప...

నీకు నువ్వే సరైన జీవన మార్గాన్ని ఎన్నుకోవాలి.

Image
నీకు నువ్వే సరైన జీవన మార్గాన్ని ఎన్నుకోవాలి.         ప్రపంచంలో శాశ్వతంగా నిలిచేదేదైనా ఉంటుందంటే అది వాక్కు ఒక్కటే. ఒకసారి ప్రపంచంలోకి వచ్చిన వాక్కు వెనక్కు  తీసుకోవడానికి వీలుకాదు. బుద్ధునికి వాక్కు విలువ తెలుసు కాబట్టే ఆయన ఎంతో సహనంతో, సంయమనంతో ప్రతి విషయాన్ని విడమరచి చెప్పినాడు. అవసరం లేనిచోట మౌనం పాటించారు.        భూమిపై మానవుని కర్తవ్యమేమిలో బుద్ధుడు చెప్పినంతగా మరెవరూ చెప్పలేదు. కారణం మనిషి కేంద్రంగా చేసుకొని మానవ జీవితాన్ని గురించి ఆలోచించడం వల్లనే. సమాజంపై బుద్ధుని కున్న ప్రేమ ఆపారమైనది. మనిషి జీవిత లక్ష్యం ఏమంటే దానిని గుర్తించడమేనని చెప్పినాడు. తరువాత ఆ లక్ష్యానికి తన హృదయాన్ని అంకితం చేయమన్నాడు. ప్రతి ఒక్కరికి ఎవరో వచ్చి మార్గాన్ని సూచించరు. తనే స్వయంగా తెలుసుకోవాలన్నారు. నీకు నువ్వే సరైన జీవన మార్గాన్ని ఎన్నుకోవాలన్నారు. దీనినే మహా కవి శ్రీశ్రీ ' ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ! నిజం మరచి నిదురపోకుమా" అని ఒక పాట రాసినాడు.       ఎవరైతే తన మార్గాన్ని కనుగొంటాడో అతడు ఇ...

అచ్చయిన మొదటి పురాతన పుస్తకం 'వజ్రసూత్ర' first printed oldest book vajrasutra

Image
చైనా గుహలో అమరావతి వజ్రసూత్ర యూరోప్ కు పుస్తకం గురించి తెలియని రోజుల్లో జోహన్ గూటెన్ బర్గ్ 1456లో తొలిసారిగా బైబిల్ ను తాను అభివృద్ధి చేసిన అచ్చుయంత్రంపై ముద్రించారు. కానీ, అచ్చు ప్రతి అనే పుస్తక నిర్వచనం ప్రకారం, గూబెన్ బర్గ్ అచ్చుయంత్రాన్ని కనుగొనడానికి ఐదు శతాబ్దాలకు పూర్వమే చైనాలో 'వజ్రసూత్ర' అచ్చయ్యింది.      మనకు లభ్యమవుతోన్న పురాతన పుస్తకం  క్రీ.శ 868వ సంవత్సరం మే 11వ తేదీన అచ్చయిన 'వజ్రసూత్ర' అని బ్రిటిష్ లైబ్రరీ ప్రకటించింది.          అమరావతి (ధరణికోట, శ్రీపర్వతం ,నాగార్జునకొండ) బౌద్ధ ధర్మంలో వజ్రసూత్రను ప్రవేశపెట్టాయి. ఆచార్య నాగార్జునుడు - అసంగుడు వజ్రసూత్ర ప్రతిపాదకులని, ప్రబోధకులని  చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.         యూరోప్ కు బయట ఒక  పుస్తకం ఉందన్న విషయం చాలామందికి తెలీదు. గూటెన్ బర్గ్ విప్లవీకరించిన రీతిలో సీసపు పోతలలో అక్షరాలను అచ్చువత్తదానికి పూర్వమే ఆసియాలో అద్దకపు కళ ఉన్నది. అక్షరాలను, చిత్రాలను, చెక్కలపై చెక్కి అచ్చులుగా తయారు చేసేవారు. ఆ అచ్చులకు సహజ వర్ణాలను లేపనం చ...

ఆచార్య నాగార్జున Professor Nagarjuna

Image
          Professor Buddhist Nagarjuna  ఆచార్య నాగార్జున టిబెట్ బౌద్ధ మత గ్రంథాలలో లభించిన చిత్రానికి అనుకరణే ఈ చిత్రం. దీనిని టోంపే చిత్రీకరించారు. ఆంధ్ర దేశాన్ని ఏలిన రాజవంశాలలో ఇక్ష్వాకులు ఒకరు. వీరి పరిపాలనాకాలంలో ఆనాడు విజయపురిగా పిలవబడిన ఈనాటి నాగార్జునసాగర్ ప్రాంతంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఉండేది. దానికి బౌద్ధ ధర్మ తాత్వికునిగా పేరుగాంచిన ఆచార్య నాగార్జున కులపతిగా ఉండేవాడు.ఇతను క్రీ. శ. 150-250 కాలానికి చెందినవాడు.బౌద్ధం అధ్యయనం కోసం  ఈ విద్యాసంస్థలో చదువుకోడానికి దేశవిదేశాల నుంచి ఎందరో విద్యార్థులు వచ్చేవారు. నాగార్జునుడు  విదర్భకు చెందినవాడని మరియొక అభిప్రాయం ఉందిిి. వేదశాస్త్రాలలో పాండిత్యం సంపాదించి హిమాలయాలలో విస్తృతంగా పర్యటించి బౌద్ధం  పట్ల ఆకర్షితుడై నలందా చేరాడు. అచట ప్రఖ్యాత ఆచార్యుడు రాహులభద్ర వద్ద శిష్యరికం చేసి నలందాలోనే అచార్యునిగా పలు సంవత్సరాలు బోధించాడు. తరువాత కృష్ణానదీ లోయలోని శ్రీపర్వతం చేరి బౌద్ధ సంఘాన్ని, ఆరామాన్ని స్థాపించాడు. శ్రీపర్వతానికి దగ్గరలో ఉన్న ధాన్యకటకంలోని విశ్వవిద్యాలయం లో  మ...

బ్రహ్మ విహారాలు

Image
మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఈ నాలుగింటిని బ్రహ్మ విహారాలు అంటారు. Maitri Kindness and the willingness to make someone happy. To do something for them. Think and wish good for others. మైత్రి: సాధారణంగా మానవులకు ఉండే సహజ గుణం ఓర్వలేనితనం మరియు ద్వేషం. మైత్రీ గుణాన్ని  అభ్యాసం చెయ్యటం ద్వారా మనిషి లో మైత్రీ భావన నిండుతుంది. అతనికి ఈ భూమ్మీదే కాదు ఇతర ఏ లోకంలోనూ శత్రువులు అంటూ ఉండరు. క్రూర జంతువులు సైతం అతని సమక్షంలో తమ సహజ స్వభావాన్ని వదలి సాదుజంతువులుగా మారతాయి. ఇక మనుషుల మాట చెప్పేదేమి? మనసులో మైత్రీ భావనతో ఉన్న మనిషి ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండటం ద్వారా ముందు సాధకునికే ఎంతో మంచి జరుగుతుంది. అనవసర ఆదుర్దాలు ఆందోళనలు లేకపోవటం వల్ల శారీరిక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఈ భావన వల్ల సాధకుడు మనో ప్రశాంతతను పొందగలడు.  ద్వేష భావం నుంచి విముక్తుడవుతాడు. ఎవరిని చూచినా అతనికి ద్వేష భావం కలుగదు.  అతని మనసు ఎల్లప్పుడూ తేలికగా సంతోషంగా ఉంటుంది.  మనిషి ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండట...

మనిషే మహనీయుడన్న మహా మానవవాది

Image
         pic courtesy: suchitra arts భారతీయ సమాజంలో బౌద్ధం ఒక నిశ్శబ్ద విప్లవం. అది హింసలేకుండా సామాజిక పరివర్తనకు దోహద పడిన విప్లవం. అందరినీ అక్కున చేర్చుకునే విధంగా బుద్ధుడు కుల వ్యతిరేక సమాజాన్ని దర్శించాడు. ఆయన బోధనలు ఎంతో వాస్తవికమైనవి కాబట్టి, శతాబ్దాల తరువాత కూడా మన సమాజానికి ఆ ఆలోచనలు సమకాలీనంగా అనిపిస్తున్నాయి. వైదిక సమాజం ఏర్పరిచిన కులవ్యవస్థను బౌద్ధం విమర్శించడమే కాక, నైతిక విలువలపై ఆధారపడ్డ బౌద్ధ ధర్మాన్ని నిర్మించింది. ఆసియా కంతటికీ దాన్ని వ్యాపింజేసింది. బౌద్దం సమ సమాజాన్ని, మానవ సమానత్వాన్ని కోరింది. పుట్టుకతో వచ్చే హౌదా, ప్రత్యేక అవకాశాల్ని అది నిరాకరించింది. అందుకే బౌద్ధ - బ్రాహ్మణ సామాజిక భావనలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. అందరికీ ఒకే నైతిక విలువను బౌద్ధం ప్రభోదించింది. బ్రాహ్మణులు ముక్తిమార్గం చూపుతారన్న వాదాన్ని బుద్ధుడు అంగీకరించలేదు. ఎందుకంటే వారు గానీ, వారి పూర్వీకులుగానీ బ్రాహ్మను చూడలేదు. క్రతువుల్లో దేవుళ్ళను ఉద్దేశించి బ్రాహ్మణులుచేసే ప్రార్థనలు పనికిరానివని, బుద్ధుడు ధిఘనికాయం, తేవిజ్జ సుత్తంలో వ్యాఖ్యానించాడు. అవి-ఒక నది ఒ...