మతము - ధర్మము
మతంతో ధర్మం ఎలా భిన్నమైనది? మతం - ధర్మం 1. బుద్ధుడు బోధించిన ధర్మం మతంతో మౌలికంగా విభేదిస్తుంది. 2. ఐరోపాతాత్వికులు మతానికి చెప్పే అర్ధానికీ బుద్ధుని ధర్మానికి తేడా ఉంది. 3. అయితే ఈ రెండిటి మధ్య చెప్పుకోదగ్గ సమా నత్వం ఏది లేదు. అంతేకాక సిద్ధాంత పరంగా ఈ రెండిటి మధ్య గల వ్యత్యాసం చాలా ఎక్కువ. 4. ఆ కారణంగానే ఐరోపాత్వికులు బౌద్ధ ధర్మాన్ని ఒక మతంగా అంగీకరించేందుకు నిరాకరించారు. 5. అందుకు మనం బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అలా నిరాకరించినందువల్ల నష్టం వారికే, అంతేగాని బౌద్ధ ధర్మానికి ఏర్పడే హాని అంటూ ఏదీ లేదు, కాకుంటే వారు చెప్పే మతంలో ఉన్న లోపాలు దీనివల్ల స్పష్టంగా తెలుస్తున్నాయి. 6. ఈ వివాదంలో పడకుండా బౌద్ధ ధర్మం మతంతో ఎలా భిన్నమైందో పరిశీలిద్దాం. 7. మతం అనేది కేవలం వ్యక్తిగతమైనదని, దానిని ఎవరికి వారు ఆచరించుకోవాలే గాని సామాజికంగా దానిని ఉపయోగించాల్సిన అవసరం లేదని చెపుతున్నారు. 8. కానీ ధర్మం అనేది ఈ భావనకు పూర్తిగా విరుద్ధమైనది, ధర్మం సామాజిక ప్రయోజనం కోసమేననేది చాలా మౌలికమైన విషయం. 8. ధర్మమంటే మంచి ఆచరణ, అనగా మానవ జీవన విధానంలో మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన సంబంధాలను నిర్దేశించ...