అజంతా గుహలు
అజంతా గుహలు అజంతా గుహలు భారతీయ బౌద్ధ శిల్పకళకు, బౌద్ధ చిత్రకళకు,బౌద్ధ ధర్మానికి చిరస్మరణీయమైన వారసత్వం. ఈ గుహలు మనకు బౌద్ధ జీవన విధానంపై విలువైన సమాచారాన్ని అందిస్తాయి.ఈ గుహలు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో వేరూలా నదికి సమీపంలో ఉన్న ఒక పర్వత శ్రేణిలో ఉన్నాయి. అజంతా గుహలను UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. అజంతా గుహల ముఖ్య విశేషాలు: ఈ గుహలు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 6వ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి. ఇవి రెండు ప్రధాన దశలలో నిర్మించబడినాయి 1.తొలిదశ: థేరవాద బౌద్ధం (హీనయాన) ప్రభావంతో గుహలు 9 నుండి 12 వరకు నిర్మించబడినాయి. ఈ గుహలు బౌద్ధ భిక్షువులు, వ్యాపారులు, మద్దతుదారుల విరాళాల ఆధారంగా నిర్మించబడ్డాయని తెలుస్తోంది. 2. ద్వితీయ దశ: మహాయాన బౌద్ధ ప్రభావం తో గుహలు 1 నుండి 8 మరియు 13 నుండి 30 వరకు నిర్మించారు.హరిషేణుడు అనే వాకాటక రాజు (సుమారు క్రీస్తుశకం 460–478) ఆధ్వర్యంలో ఈ ద్వితీయ దశ గుహలు నిర్మించబడ్డాయి. గుహ 16, 17, 19, 26 మొదలైనవి అతని కాలంలో లేదా అతని అనుయాయుల కాలంలో న...