అనుభవంతో వచ్చిన సత్యమే జ్ఞానం
అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే జ్ఞానం (పిళ్లా కుమారస్వామి) బుద్ధుని కాలంలో కాలములనే తెగ ఉండేది.వారితో బుద్ధుడు ఒకసారి సంభాషిస్తారు. ఆ సందర్భంలో బుద్ధుడు వారికి జ్ఞానానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. వాటిని ‘కాలామ సుత్తం’ పేరుతో పీకాక్ క్లాసిక్ వారు డి.చంద్రశేఖర్ రాసిన చిన్నపుస్తకాన్ని ప్రచురించారు. ఈ కాలామ సుత్తం అంగుత్తనికాయంలో ఉంది. బుద్ధుడు కాలాములతో చెప్పిన విషయాలను బౌద్ధంలో జ్ఞానసిద్ధాంతంగా పరిగణిస్తారు. వైదికమతం వేదాన్ని జ్ఞానానికి ప్రమాణంగా భావిస్తుంది. దేవునిపై వుండే భయభక్తులే జ్ఞానానికి తొలి అడుగని బైబిలు చెపుతుంది. అలాగే అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే సరైన జ్ఞానమని కాలాములతో బుద్ధుడు చెప్పిన ఉపదేశాలే బౌద్ధంలో జ్ఞాన సిద్ధాంతమని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మహాభారతంలో యక్ష ప్రశ్నలున్నాయి. అందులో యక్షుడు ధర్మరాజుతో జ్ఞానమెలా వస్తుందని అడుగుతాడు.పండితుల సాంగత్యంతో జ్ఞానమొస్తుందని ధర్మరాజు చెపుతాడు. దీన్నే ఇప్పటికీ చాలా మంది ఆచరణయోగ్యంగా, సరైందిగా భావిస్తుంటారు. మరికొంత మందైతే ...