Posts

Showing posts from June, 2020

అంబేద్కర్ అడుగుజాడల్లో

Image
అంబేద్కర్ అడుగుజాడల్లో.. (తేదీ:14/4/2020 అంబేద్కర్ జయంతి సందర్భంగా)        రాజ్యాంగ సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన ఉపన్యాసంలో "నాయకుడిని గుడ్డిగా నమ్మి పూజించడమనే చెడు మనస్తత్వం భారతీయుల్లో అనాదిగా జీర్ణించుకుని ఉంది. దేశానికి,  ప్రజానీకానికి నిస్వార్ధంగా సేవ చేసిన నాయకుని గౌరవించడంలో తప్పులేదు. కానీ ఆ నాయకున్ని సర్వశక్తి సంపన్నుడుగా ఎంచి  సమస్తమైన బాధ్యతలు ఆయనపైనే ఉంచి,  అన్యధా శరణం నాస్తి అనే ధోరణిలో ప్రజానీకం వ్యవహరించడం   అత్యంత విషాదకర పరిణామాలకు దారి తీస్తుంది. ఈ వ్యక్తి పూజ విధానం దేశానికి,  ప్రజానీకానికి అత్యంత నిమ్నదశగా దిగజారుస్తుంది. దేశ స్వాతంత్రంను   పరిరక్షించుకునే విషయంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మడం అనేది ప్రమాదకరం" అని అన్నారు.      మన భారతదేశంలో భక్తి తత్వం అనేది అత్యంత దారుణమైన విధంగా ఉంటోంది. ఈ భక్తితత్వం నింపాదిగా రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించింది.  వ్యక్తి పూజ దేశాన్ని కృంగదీసి సర్వ  ఆధిపత్యానికి దారితీస్తోంది. అదేవిధంగా రాజకీయాల్లో భక్తి తత్వానికి వ్యక్తిపూజకు ఏ మాత్రం ...

నగరాన్ని జయించబోయిన నక్క

Image
                   వారణాసి నగరంలో ఒక గొప్ప పండిత కుటుంబంలో బోధిసత్వుడు జన్మించాడు. అతడు యుక్త వయస్కుడయ్యేనాటికి సర్వ శాస్త్రాలూ అభ్యసించి, పండితులందరితోనూ గొప్పవాడనిపించుకున్నాడు. ఆ కారణంగా ఆ దేశరాజు  చిన్న వయసైనప్పటికీ బోధిసత్వుని తన ఆస్థానంలో ప్రధాన పురోహితునిగా నియమించాడు.         బోధిసత్వుడు తాను శాస్త్రగ్రంథాలు చదివే సమయంలో, ఒక అద్భుతమైన వశీకరణ మంత్రాన్ని కనుగొన్నాడు. దాని ప్రభావంతో ఇతరుల మీద సర్వాధికారాలు చలాయించవచ్చు. ఆ మంత్రం ఒక్కసారి చదివితే, ఎంతటి వాళ్ళయినా దాసోహం అనాలసిందే! ఆ మంత్ర ప్రభావంతో ఎవరిపైనా అధికారం నెరపాలని బోధిసత్వుడికి ఆశలేదు కాని, దాన్ని మరిచిపోకుండా జాగ్రత్తపడాలన్న ఆలోచన కలిగింది. అరణ్యంలో ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకుని,అక్కడ వున్న ఒక ఎత్తయిన రాతిపై కూర్చుని, ఆయన పరిసరాలను ఒకసారి చూశాడు. ఎక్కడా మనిషిగానీ, జంతువుగానీ ఆయన కంటబడలేదు. బోధిసత్వుడు ఆ అద్భుత మంత్రాన్ని గొంతెత్తి చాలాసార్లు చదివి, సూర్యాస్తమయం అవుతూండగా, రాతి మీది నుంచి లేచి నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో ర...

అంబేద్కర్ చెప్పిన సూక్తులు

Image
◆ People who have not decided their objective they can't get any sucess. When they dont get any success, they can't make any impact in the history of the time.  ◆ ఏ ప్రజలైతే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోరో వారు ఎటువంటి విజయాన్ని పొందలేరు ఎపుడైతే వారు విజయాన్ని పొందలేరో, వారు చరిత్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేరు.                 ◆ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు. ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం. ◆ నా దేశ సమస్యలకు-నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణలు వస్తే ముందు నా జాతి కి ప్రాముఖ్యత ఇస్తాను.కానీ నేను - నా దేశం ఈ రెండింటిలో నా దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ◆దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.ప్రతిపౌరుని నైతికాభివృద్దే దేశాభివృద్ధి. ◆జీవించేందుకు తినాలి.సమాజ సంక్షేమానికై జీవించాలి. ◆నీ కోసం జీవిస్తే.. నీ లోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే... జనం లో నిలిచి పోతావు. ◆ఓటుహక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో, అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ◆ కులం పునాదుల మీద ఒక జాతిని గాని, నీతినిగాన...

ప్రపంచంలో ప్రతిదీ పరస్పర సంబంధంతో ఉంటుంది.

Image
           ప్రపంచంలో ప్రతిదీ పరస్పర సంబంధంతో ఉంటుంది.       ప్రపంచంలో ప్రతిదీ పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుంది. నీవు ధర్మప్రవర్తనను ఆచరిస్తే,ఇతరులు కూడా మెల్లగా వాటిని ఆచరిస్తారు. ఇవన్నీ పరస్పర సంబంధం కలిగి ఉన్న విషయాలు. ప్రతిరోజూ ఇతరుల నుండి లభించేది ఎంత స్వల్పమైనా ధన్యవాదాలు తెలుపమన్నాడు. మనసులో మలినాలనుఉంచుకోకుండా నిర్మలంగా ఉంటే అది ఆనందానికి దగ్గర దారవుతుంది. ప్రతి రోజు ప్రకృతికి ధన్యవాదాలు తెలపాలన్నారు. ప్రతి దినం మనం ఎంతో నేర్చుకున్నాం కదా ! అందుకు. పోనీ నేర్చుకోకపోయినా కొంచెమైనా   తెలుసుకున్నాం కదా ! అందుకు. పోనీ ఏమి తెలుసుకోకపోయినా అనారోగ్యానికి గురికాలేదు కదా! అందుకు. పోనీ అనారోగ్యం గురికాకపోయినా కనీసం మనం మరణిచలేదు కదా ! అందుకు ప్రకృతికి ధన్యవాదాలుతెలపాలని బోధించాడు. బుద్ధుడు. నేటి బాలలు, యువకులు బౌద్ధ ధర్మసారాన్ని అర్థం చేసుకొని బుద్ధుని ప్రవచనాలను పాటించగలిగితే మంచి వ్యక్తిత్వ వికాసం తో సమాజంలో రాణిస్తారు. - పిళ్లా కుమారస్వామి

నేటి సమాజానికి అవసరమైన బౌద్ధం

Image
నేటి సమాజానికి అవసరమైన బౌద్ధం బౌద్ధం ఒక మతం కాదు. అది ఒక జీవన విధానం. వాస్తవానికి బౌద్ధం అనే పదం లేదు. ధర్మం మాత్రమే వుంది. బుద్ధుడు శీలాన్ని ఆధారంగా చేసుకొని ధర్మం బోధించాడు. ఇది మనసును శాంతంగా వుంచుతుంది. మూడు వేల సంవత్సరాల క్రితం (క్రీ.పూ. 500) యజ్ఞయాగాదులు విపరీతంగా జరుగుతుండేవి. ఆ యజ్ఞయాగాదుల్లో జంతుబలి తప్పనిసరిగా వుండేది. భగవంతుని సేవించటానికి భక్తిని ప్రదర్శించటానికి, కోరికలు నెరవేర్చుకోవటానికి వేలాది జంతువులను బలిచ్చేవారు. ఇప్పటిలాగా పూలు, పండ్లు, తియ్యని తినుబండారాలు పెట్టేవారు కాదు. ఆ సందర్భంలో జరిగే హింసాత్మకతో కూడిన ప్రార్ధనలను, కర్మకాండలను బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. బుద్దుడు హింసకు బదులుగా మానవీయ లక్షణాలను ప్రతిపాదించాడు. ఇతరుల పట్ల దయ, కరుణ, ప్రేమవుండాలని చెప్పాడు. మనిషి మనిషిగా మనుగడ సాగించడానికి పంచశీల బోధించాడు. ఆయన బోధనలు సమాజం సజావుగా నడవడానికి, మనిషి తన ఔన్నత్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. బుద్ధుడు బోధించిన పంచశీల : 1 జీవహింస చేయకపోవడం  2. దొంగతనము చేయకపోవడం  3. వ్యభిచరించక పోవడం  4. అసత్యం చెప్పకపోవడం  5. మత్తు పదార్థాలను...

బౌద్ధధర్మం bouddha dhamma

Image
బౌద్ధధర్మం       బౌద్ధం హేతువాద భావనలపై నిర్మించబడింది. బౌద్ధం పూర్తిగా భౌతికవాదం పై నిలబడింది. మాయలను,అతీంద్రియ శక్తులను పూర్తిగా నిరాకరించింది. మానవతీతమైన దైవశక్తిని తిరస్కరించింది. మానవుని కేంద్రంగా చేసుకొని సమాజం సజావుగా నడవడానికి మనిషి ఆనందంగా జీవించడానికి ఒక ప్రాపంచిక దృక్పథాన్ని అందించింది బౌద్ధం. ఆత్మ, పరమాత్మ మోక్షం లాంటి విషయాలను పక్కన పెట్టింది. బహుజనుల హితం కోసం, బహుజనుల సుఖం కోసం ధర్మాన్ని బోధంచాలని బుద్ధుడు తన శిష్యులను కోరాడు. బౌద్ధంలో మరొక సుగుణం సమతాభావం. సమతా వాదం ఇరవై శతాబ్దంలో వచ్చిన భావన.కానీ బుద్ధుడు 3500 సంవత్సరాల క్రిందటే సమతావాద భావాలను ప్రవేశపెట్టాడు. స్త్రీ పురుషుల మధ్య తారతమ్యాలను గాని, పేదరికాన్ని గాని, అగ్రవర్ణ నిమ్నవర్గ మనే అంతరాలుగాని చూడలేదు. అలాంటి బేధభావాలు లేకుండా తన సంఘంలో చేరేవాందరిని సమానంగా చూశాడు. అందరిని చూడమన్నాడు. అందువల్లనే తొలి బౌద్ధాన్ని ఆదిమకమ్యూనిజమని చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రపంచం శాశ్వతం కాదని, ప్రపంచంలో ప్రతిదీ మార్పు చెందుతుందని బుద్ధుడు చెప్పాడు. ఈ విషయాన్నే మార్క్స్ ప్రపంచంలో మారనిదల్లా మార్పేనని చెప్పిన...

బుద్ద సౌరభాలు

Image
దేవుడు ప్రకృతిలో ఒక వస్తువుగా ఉండడు. ఒక సామాజిక అవసరం సృష్టించిన ఆదర్శ మనోనిర్మితి దేవుడు. సృష్టిలో అసలు దేవుడు లేడు   _అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ప్రతి ఒక్కరికి  ఎవరికి కావలసింది వారికి అందించగల స్థితిలో ఉంది సమాజం. దేవుడు, మతం అవసరం లేకుండానే ఈ పని చేయవచ్చు కనుక ఇవ్వాళ మతం దేవుడు సామాజిక అవసరాలు కావు. మతం లేకుండానే సమాజం మనుగడ సాగించ వచ్చు __ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (బుద్ధిష్ట్) ఈ ప్రపంచంలో నేను సమ్యక్సంబద్దుడను  ప్రశాంతుడను స్వాంతుడను ధర్మచక్ర సంస్థాపనార్థం నేను  బయలుదేరుతున్నాను  ఈ అంధకార ప్రపంచంలో  మరణరహిత మృదంగ ధ్వానం  వినిపిస్తాను కొత్త వెలుగుల్ని ప్రపంచమంతా నింపుతాను.                     __ బుద్ధుడు ఈ ప్రపంచానికి వెలుపల దీనికి ఆధారమైంది, ఆశ్రయం అయింది ,మరొకటి ఏదీ లేదు. ఈ ప్రపంచం సర్వ సమృద్ధం. సర్వ స్వతంత్రం .తనకు తానే ఆధారమైంది.                     ___బుద్ధుడు మనచుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ప్రతిదీ తన రూపాన్ని పోగొట్టుక...

బుద్ద ధమ్మ

Image
బుద్ధుడు మనిషి జీవనానికి కావలసిన  విధానం ధర్మాల రూపంలో చెప్పాడు. బుద్ద ధర్మం"మతం కాదు" జీవనవిధానం.ఇది సనాతన ధర్మం. బుద్ధ ధమ్మ అంటే ఏమిటి? త్రిశరణాలు 1) బుద్ధం శరణం గచ్చామి 2) ధమ్మం ( ధర్మం కాదు ) శరణం గచ్ఛామి 3) సంఘం శరణం గచ్ఛామి. అంటే 1) నా బుద్ధిని ఉపయోగించి జ్ఞానానికి లోబడి ఉంటాను. 2) మంచి జీవన విధానానికి ధమ్మానికి లోబడి ఉంటాను. 3) సంఘానికి లోబడి సంఘ వ్యతిరేక పనులు చేయకుండా ఉంటాను. అలాగే పంచశీల(5) అష్టాంగమార్గాలు(8) దశపారమితాలు10) పంచశీల అనగా... 1) అహింస (మనుషులను జంతువులను హింసించరాదు) 2) మద్యం తాగకూడదు 3) దొంగతనం చెయకూడదు 4)వ్వభిచరించకూడదు 5) అబద్ధం చెప్పకూడదు. 1) యజ్ఞం లో జంతువులను బలిస్తారు, దీనికి వ్యతిరేకం "అహింస " 2) సురాపానం చేస్తారు దీనికి వ్యతిరేకం "మద్యం తాగకుండా " ఉండటం 3) మూలనివాసి ప్రజల పశుసంపదను దోచుకునేవారు, దీనికి వ్యతిరేకం " దొంగతనం చేయకుండా " ఉండటం 4) "వ్యభిచారం చేయకుండా " ఉండటం 5) "అబద్ధం ఆడకుండాఉండటం ". అన్నాడు ఆయన దగ్గర చేరిన మగవారిని " బౌద్ధ భిక్కు " అనే వారు . అసలు అంత వరకు స్త్రీ లకు చదువు...

గౌతమ బుద్ధుడు చెప్పిన సూక్తులు Buddha preachings

Image
"ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు. ప్రతి పనినీ ఒక ధ్యానంగా చెయ్యి." "కాలాన్ని వృధా చేయడమంటే, నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే." "మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనను భయపెట్టలేడు." "మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల్లోనే." "ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే, మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి." "మీరు వెయ్యి యుద్ధాల్లో వెయ్యి మందిపై విజయం సాధించి ఉండొచ్చు. కానీ, తనపై తాను విజయం సాధించినవారే అసలైన విజేత." "నిజం మాట్లాడండి. కోపాన్ని దరిచేరనీయకండి. ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చేయండి." "చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి. మనసును శుద్ధి చేసుకోండి." "ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు." "మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి."

బౌద్ధమత భవిష్యత్తుFuture of Buddhism

Image
                                                బుద్ధుని బోధనలను ఆమోదించినప్పుడే హిందువులు బాగుపడతారని భావించేవాళ్లు నిరాశతో కూరుకుపోతున్నారు . భారతదేశంలో బౌద్ధమతం తిరిగి పునరుద్ధరించబడే అవకాశాలు కనిపించడం లేదనేదే వారి నిరాశకు కారణం . అయితే నేను ఆ  నిరాశలో  పాలుపంచుకో  దలచుకో లేదు .                   ― బోధిసత్వ డా౹౹ బి.ఆర్.అంబేద్కర్.     ప్రతిమతం లోనూ రెండు రకాల వైఖరులతో రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నారు. ఈ వైఖరి హిందువుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.తమ మతం పట్ల అనుసరించే వైఖరిని బట్టి హిందువుల్లో రెండు వర్గాల వాళ్లున్నారు. వారిలో అన్నిమతాలు నిజమైనవే అని భావించేవాళ్లు ఒకరకం.         హిందువులతో పాటు ఇతర మతపెద్దలు కూడా ఈ నినాదంతో గొంతు కలుపు తుంటారు . అయితే అన్ని మతాలూ నిజమైనవే అన్న సిద్ధాంతం కంటే తప్పుడు సిద్ధాంతం మరొకటి లేదు. ఇతర మతస్థులకు మద్ధతుగా కొందరు హిందువులు ఈ సిద్ధా...

నైతిక ఆక్సిజన్‌

Image
. నైతిక ఆక్సిజన్‌                బుద్ధుడు చెప్పిన పంచశీలలో కామవాంఛ పై నియంత్రణ కూడా ఒకటి ఉంది. ఈ విషయంలో ఈ సృష్టిలో ఏ జీవికీ లేని నియంత్రణ మనిషికే ఎందుకు? ఈ భూమ్మీది జీవరాశిలో ముఖ్యంగా క్షీరదాలలో చాలా వాటికి కామవాంఛలు ఏదో ఒక రుతువుల్లోనే కలుగుతాయి. కానీ, పాములు, బల్లులు వంటి సరీసృృపాలకి నిరంతరం వుంటాయి. కామోద్రేకం వాటి సహజాతాల్లోఒకటి. జీవ పరిణామక్రమంలో సరీసృపాల నుండి క్షీరదాలు, వాటి నుండి కోతులు, వాటి నుండి మనిషి ఉద్భవించాడు. నాటి సరీసృపాల మెదడు (రెక్టీలియన్‌ ట్రెయిన్‌) తిరిగి కోతులలో నిద్ర మేల్కొంది. అది మనిషికీ సంక్రమించింది. కోపం, కామోద్రేకం,అనాలోచితంగా ప్రవర్తించటం, భయం, దాడి చేయటం, టెర్రరిజం, మూఢభక్తి, క్షణికావేశం ఈ మెదడు క్రియలు. అలాగే... నాలుగుకాళ్ళ పశువులకు (క్షీరదాలకు) చెందిన మమ్మేలియన్‌ (బెయిన్‌ కూడా మనిషికి సంక్రమించింది.                నియమాలు పాటించకపోవడం,వావి వరుసలు చూడక పోవడం, హింసాప్రవృత్తి ఈ మెదడు చేసే క్రియలు. మానవ మెదడులో 4 శాతం వున్న రెప్టీలియన్‌ మెదడు, 36 శాతం వున్న మమ్మేలియన్‌ మెదళ్ళు క...

బౌద్ధధర్మ సారం

Image
లక్ష్మీనరసు రాసిన "బౌద్ధధర్మ సారం" పుస్తకం ఆధారంగా బౌద్ధం హేతువాద భావనలపై నిర్మించబడింది. బౌద్ధం పూర్తిగా భౌతికవాదం పై నిలబడింది. మాయలను, అతీంద్రియ శక్తులను పూర్తిగా నిరాకరించింది. మానవతీతమైన దైవశక్తిని తిరస్కరించింది. మానవుని కేంద్రంగా చేసుకొని సమాజం సజావుగా నడవడానికి మనిషి ఆనందంగా జీవించడానికి ఒక ప్రాపంచిక దృక్పథాన్ని అందించింది బౌద్ధం. ఆత్మ, పరమాత్మ మోక్షం లాంటి విషయాలను పక్కన పెట్టింది. బహుజనుల హితం కోసం, బహుజనుల సుఖం కోసం ధర్మాన్ని బోధంచాలని బుద్ధుడు తన శిష్యులను కోరాడు. బౌద్ధంలో మరొక సుగుణం సమతాభావం. సమతా వాదం ఇరవై శతాబ్దంలో వచ్చిన భావన, బుద్ధుడు 3500 సంవత్సరాల క్రిందటే సమతావాద భావాలను ప్రవేశపెట్టాడు. స్త్రీ పురుషుల మధ్య తారతమ్యాలను గాని, పేదరికాన్ని గాని, అగ్రవర్ణ నిమ్నవర్గ మనే అంతరాలుగాని చూడలేదు. అలాంటి బేధభావాలు లేకుండా తన సంఘంలో చేరేవాందరిని సమానంగా చూశాడు. అందరిని చూడమన్నాడు. అందువల్లనే తాలి బౌద్ధాన్ని ఆదిమ కమ్యూనిజమని చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రపంచం శాశ్వతం కాదని, ప్రపంచంలో ప్రతిదీ మార్పు చెందుతుందని బుద్ధుడు చెప్పాడు. ఈ విషయాన్నే మార్క్స్ ప్రపంచంలో మారనిదల్లా...