తెలంగాణలో బౌద్ధం
👉తెలంగాణలో బౌద్ధమతం వ్యాప్తి..!!! ——————————————————— ప్రపంచంలోని మత స్థాపకులు, బోధకులు కనిపించే మనిషికన్నా, కనిపించని దేవునికీ, ఇహలోక సులభజీవనం కన్నా, లేని పరలోక సౌఖ్యాలకు ఎక్కువ ప్రాధానమిచ్చారు. ఒక్క గౌతమ బుద్ధుడు మాత్రమే మనిషిని కేంద్రంగా చేసుకొని తన ధర్మాన్ని బోధించాడు. మానవత్వానికి ప్రధాన పీట వేశాడు.సకల జీవకోటి సుఖంగా జీవించుగాక, సర్వ ప్రాణులూ నిర్భీతితో మనుగడ సాగించుగాక, సమస్త ప్రజలూ అన్ని రకాల కష్టాలు, దుఃఖాల నుంచి విముక్తులై ప్రశాంతంగా, ఆనందంగా జీవించుగాక అని కోరింది బౌద్ధం. సుమారు 2560 ఏండ్ల కిందటి ఈ సామ్యవాద భావజాలం, భారతదేశంలో కన్నా విదేశాల్లో బాగా ఉంది. శాంతి, అహింస, ప్రజ్ఞ, కరుణ, శీల, సమత, మైత్రి, సానుభూతులకు వేదిక బౌద్ధం. క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే కుల వ్యవస్థని, అస్పృశ్యతని నిరసించి, సమసమాజ నిర్మాణానికి శాశ్వతమైన పునాదులు వేసిన విప్లవకారుడు బుద్ధుడు. విశ్వంలో ప్రతి ఒక్కరి హృదయంలో ప్రజ్వలించే ధర్మజ్యోతి, ఆసియా జ్యోతి గౌతమ బుద్ధుడు. క్రీ.పూ. 8వ శతాబ్దంలో జన్మించి సుమారు 1000 ఏండ్లపాటు భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన బౌద్ధమతం నేటికీ జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మయన్మార్ దేశాల్లో ...