పర్యావరణ హిత, హరిత దీపావళిని జరుపుకుందామా
*బాణా సంచా కాల్పు వినోదమా, విపత్కరమా ?* *పర్యావరణ హిత, హరిత దీపావళిని జరుపుకుందామా !* _పండుగలు సాధించిన ప్రగతికి సంకేతాలు._ _ఆనందంగా సేద తీరే సావకాసాలు._ ఆ ఆనందకర సమయాలు నష్టాలు కలుగకుండా, విషాదం కాకుండా చూడడం మన చేతుల్లోనే వుంది. మనం ఎంతో ఉత్సాహంగా దీపావళి రోజు కాల్చే బాణాసంచా పేలుడు పదార్ధాలతో తయారవుతాయి. అవి పొగ, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ అనే గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణం లోకి విడుదల చేసి కాలుష్యా న్ని ఏర్పరుస్తాయి. బాణాసంచా కాల్పువల్ల జరిగే ఫలితాలను చర్చిద్దాం. *వినోదం నుంచి విషాదం :* బాణాసంచా ప్రేలుడు వలన పొగ, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ వంటి విషవాయువులతో కూడిన మేఘం ఏర్పడుతుంది. అది పార్కుల, అడవుల దృశ్య రమణీయతను మసక బారుస్తుంది. బాణాసంచా కాల్చినప్పుడు, పొగ మరియు వాయువులు గాలిలోకి విడుదల అవుతాయి. అందులో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ ఈ మూడు గ్రీన్హౌస్ వాయువులు దురదృష్టవశాత్తు వాతావరణ మార్పులకు కారణమవుతున్న...