Evils
పది పాపాలు (Evils) *బుద్ధుడు చెప్పాడు.జీవులు చేసే అన్ని కర్మలు పది కారణాల వలన చెడ్డవి అవుతాయి. ఇంక పది కారణాలను పరిహరించడం వలన అవి మంచివి అవుతాయి. శరీరం చేసే మూడు(3) చెడులున్నాయి; నాలుకవి నాలుగు(4), మనస్సువి మూడు(3) చెడులు ఉన్నాయి. శరీరం చేసే మూడు చెడులు : హత్య, దొంగతనం, వ్యభిచారాలు. నాలుక చేసే నాలుగు చెడులు : అబద్ధాలాడడం, అపవాదులు వేయడం(చాడీలు చెప్పడం), దూషణం, ఎలాంటి ఉపయోగం లేని సంభాషణలు. మనస్సు చేసే చెడులు : లోభత్వం, ద్వేషం, భ్రమలు కలిగి ఉండటం. నేను మిమ్మల్ని పది(10) పాపాలకు దూరంగా ఉండమని చెపుతున్నాను. 1 ఏ ప్రాణిని చంపొద్దు. వాటి ప్రాణం పట్ల గౌరవం చూపించు. 2. దొంగతనం చేయొద్దు.మీరు దోచుకోవద్దు; కాని ప్రతి ఒక్కరికీ, తన శ్రమకు తగినంత ఫలం పొందేటట్లు చేయండి. 3.అపరిశుభ్రతకు దూరంగా ఉండండి. పరిశుభ్ర జీవితాన్ని గడపండి. 4. అబద్ధం ఆడొద్దు, సత్యం పలుకు. విచక్షణతో నిర్భయంగా సత్యమే చెప్పు. అదీ ప్రేమైక హృదయంతో చెప్పు. 5. చెడు వార్తలు పోగుచేయకు. వాటిని తిరిగి చెప్పకు. 6.ఎవరినీ అభిశంసించకు(విమర్శించకు). తోటి వారిలో మంచిని చూడు. వారిని శ...