నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి..!!!
నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి..!!! --Dr. Devaraju Maharaju ——————————————————————— దీపావళి అంటే దీపాల వరుస. చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలి వెలుగు నింపడానికి సంకేతంగా ఆ పండగ చేస్తున్నామని చెపుతారు. చెడు మీద మంచి సాధించిన విజయం అని కూడా చెపుతారు. అయితే, దాని చుట్టూ అల్లుకున్న పౌరాణిక గాథలు చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడు, నరకాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో సొమ్మసిల్లి పోయాడనీ, పక్కనే ఉన్న సత్యభామ ఉగ్రరూపం దాల్చి, బాణాల వర్షం కురిపించి నరకాసురుణ్ణి సంహరించిందనీ – ఒక పౌరాణిక గాథ ఉంది. మహకాళి రాక్షస సంహారం చేసినందుకు దేవీనవరాత్రులు జరుపుకున్నట్టు – మరో కథనం ఉంది. ఇవి కాక, దశ-హర (దసరా)కు, దీపావళికి దగ్గరి సంబంధం ఉంది. ఆ రెండు పండుగలు వెంటవెంటనే వస్తాయి. రాముడు లంకాధీశుడైన పదితలల రావణుణ్ణి చంపినందువల్ల దసరా జరుపుకుంటున్నామని చెపుతారు. దశ-హరా అంటే పది తలలు నరికేయడం. రావణుడి పది తలలు నరికి సంహరించిన తర్వాత, రాముడు సీతాలక్ష్మణులతో సహా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటున్నామని కథ చెపుతారు. ప...