ఆచార్య నాగార్జున Professor Nagarjuna


          Professor Buddhist Nagarjuna 
ఆచార్య నాగార్జున

టిబెట్ బౌద్ధ మత గ్రంథాలలో లభించిన చిత్రానికి అనుకరణే ఈ చిత్రం. దీనిని టోంపే చిత్రీకరించారు.

ఆంధ్ర దేశాన్ని ఏలిన రాజవంశాలలో ఇక్ష్వాకులు ఒకరు. వీరి పరిపాలనాకాలంలో ఆనాడు విజయపురిగా పిలవబడిన ఈనాటి నాగార్జునసాగర్ ప్రాంతంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఉండేది. దానికి బౌద్ధ ధర్మ తాత్వికునిగా పేరుగాంచిన ఆచార్య నాగార్జున కులపతిగా ఉండేవాడు.ఇతను క్రీ. శ. 150-250 కాలానికి చెందినవాడు.బౌద్ధం అధ్యయనం కోసం  ఈ విద్యాసంస్థలో చదువుకోడానికి దేశవిదేశాల నుంచి ఎందరో విద్యార్థులు వచ్చేవారు.

నాగార్జునుడు  విదర్భకు చెందినవాడని మరియొక అభిప్రాయం ఉందిిి. వేదశాస్త్రాలలో పాండిత్యం సంపాదించి హిమాలయాలలో విస్తృతంగా పర్యటించి బౌద్ధం  పట్ల ఆకర్షితుడై నలందా చేరాడు. అచట ప్రఖ్యాత ఆచార్యుడు రాహులభద్ర వద్ద శిష్యరికం చేసి నలందాలోనే అచార్యునిగా పలు సంవత్సరాలు బోధించాడు. తరువాత కృష్ణానదీ లోయలోని శ్రీపర్వతం చేరి బౌద్ధ సంఘాన్ని, ఆరామాన్ని స్థాపించాడు. శ్రీపర్వతానికి దగ్గరలో ఉన్న ధాన్యకటకంలోని విశ్వవిద్యాలయం లో  ముఖ్య ఆచార్యునిగా బోధనలు చేశాడు.ఇతనే  మాధ్యమిక వాదానికి సంబంధించిన 'సుహృల్లేఖ' నొకదాని  శాతవాహన చక్రవర్తికి పంపినాడని చరిత్రకారులు భావిస్తున్నారు. 

        కనిష్క చక్రవర్తి సమకాలికుడైన అశ్వఘోషుడు మహాయాన బౌద్ధాన్ని ప్రవచించాడు. దానిలో ఉన్న మాధ్యమిక సూత్రాలను నాగార్జునుడు రచించాడు.
అందువల్ల ఇతడు కనిష్కుని సమకాలికుడని భావిస్తున్నారు. ఈ మాధ్యమిక తత్వం చైనా దేశానికి మూడు గ్రంథాలు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. 
     ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రాలు కూడా నాగార్జునుడే రచించాడని చెపుతారు. ఇతను నలందా విశ్వవిద్యాలయంలో కూడా బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగానికి అధిపతిగా ఉన్నారు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.
                గుంటూరులో  నాగార్జునుడుు

 ఇతని పేరు మీద గుంటూరు లో నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.


Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు