మహాబోధి ఆలయం
మహాబోధి విహారం గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన ప్రధాన నాలుగు క్షేత్రాలలో బుద్దగయ చాలా ముఖ్యమైనది. మిగిలిన మూడు కుశీనగర్, లుంబినీ, సారనాథ్ . బుద్ధగయ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో పాట్నాకు దక్షిణాన 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశం కాదు.ఇది బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. 2600సంవత్సరాల కిందట నేటి బుద్ధగయను ఉరువేల అని పిలిచేవారు. ఇది ఫాల్గు నది ఒడ్డున ఉంది . బుద్ధుని బోధనలు తెలుసుకొని అశోక చక్రవర్తి అశోక బౌద్ధునిగా మారాడు.చక్రవర్తి అశోకుడు బుద్ధగయలో 288 BCE లో ఒక స్థూపాన్ని, మహాబోధి విహారాన్ని నిర్మించాడు. ఈ విహారం కుషానుల కాలంలో క్రీ.శ.2వ శతాబ్దంలో తిరిగి నిర్మించబడింది. ఒక శిలాఫలకాన్ని నిర్మించారు. మహాబోధి విహారం భారతదేశంలో కనిపించే పురాతన ఇటుక నిర్మాణాలలో ఒకటి. బోధివృక్షం కింద జ్ఞానోదయం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానిక...