అచ్చయిన మొదటి పురాతన పుస్తకం 'వజ్రసూత్ర' first printed oldest book vajrasutra

చైనా గుహలో అమరావతి వజ్రసూత్ర


యూరోప్ కు పుస్తకం గురించి తెలియని రోజుల్లో
జోహన్ గూటెన్ బర్గ్ 1456లో తొలిసారిగా బైబిల్ ను తాను అభివృద్ధి చేసిన అచ్చుయంత్రంపై ముద్రించారు. కానీ, అచ్చు ప్రతి అనే పుస్తక నిర్వచనం ప్రకారం, గూబెన్ బర్గ్ అచ్చుయంత్రాన్ని కనుగొనడానికి ఐదు శతాబ్దాలకు పూర్వమే చైనాలో 'వజ్రసూత్ర' అచ్చయ్యింది. 
    మనకు లభ్యమవుతోన్న పురాతన పుస్తకం 
క్రీ.శ 868వ సంవత్సరం మే 11వ తేదీన అచ్చయిన 'వజ్రసూత్ర' అని బ్రిటిష్ లైబ్రరీ ప్రకటించింది.

         అమరావతి (ధరణికోట, శ్రీపర్వతం ,నాగార్జునకొండ) బౌద్ధ ధర్మంలో వజ్రసూత్రను ప్రవేశపెట్టాయి. ఆచార్య నాగార్జునుడు - అసంగుడు వజ్రసూత్ర ప్రతిపాదకులని, ప్రబోధకులని  చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. 

       యూరోప్ కు బయట ఒక  పుస్తకం ఉందన్న విషయం చాలామందికి తెలీదు. గూటెన్ బర్గ్ విప్లవీకరించిన రీతిలో సీసపు పోతలలో అక్షరాలను అచ్చువత్తదానికి పూర్వమే ఆసియాలో అద్దకపు కళ ఉన్నది. అక్షరాలను, చిత్రాలను, చెక్కలపై చెక్కి అచ్చులుగా తయారు చేసేవారు. ఆ అచ్చులకు సహజ వర్ణాలను లేపనం చేసి వస్త్రంపై లేదా వెదురుతో చేసిన పలుచని పొరలపై అద్దేవారు. ఈ ప్రక్రియలో రూపొందిన అచ్చు ప్రతులను నున్నని గుండ్రని దృఢమైన రెండు కర్రలను చుట్టేవారు. ఒక వైపు కర్రను విప్పుతూ మరొక వైపు కర్రను చుడుతూ తగినంత దూరంలో వృత్తాకారపు పుస్తకాన్ని చదివేవారు.

వాంగ్లీ అనే వ్యక్తి తన తల్లి తండ్రుల పట్ల ప్రేమతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు ఆయన తల్లి తండ్రులకు వజ్రసూత్ర పవిత్ర గ్రంథం. బుద్ధ భగవానుని బోధనలను పొందుపరచిన ఈ పుస్తకం విశ్వశాంతికి దోహదపడుతుందని అమూల్యమైన ఈ పుస్తకాన్ని తాను ఉచితంగా అందజేస్తున్నానని, పఠితలు సైతం చదివిన తరువాత ఉచితంగా పంచాలని వాంగ్లీ పుస్తకంలో సూచించారు.

      పాలి భాష నుంచి చైనా భాషలోకి క్రీ.శ 4వ శతాబ్దిలో అనువాదమైన వజ్రసూత్రలోని అంశాలతో, వాంగ్జీ 40,000 కాపీలు ప్రచురించారు. బుద్దునికి ఆయన శిష్యుడు సుభూతికి మధ్య జరిగిన సంభాషణ ఈ పుస్తక సారాంశం.

ఎలా వెలుగులోకి వచ్చింది?

ఈ పుస్తకం గురించి ఇటీవలి కాలం వరకూ తెలియదు. వ్రాయవ్యచైనాలో మొగానో కేవ్స్ ఉన్నాయి. సిల్క్ రూట్లో సహజసిద్ధమైన ఒయాసిస్సు కలిగిన ప్రాంతంలో 4న శతాబ్దిలో ఈ గుహలను తొలచారు. "వేయి బుద్ధుల గుహగా మొగావో కేవ్స్ ను చైనా సాహిత్యంలో ప్రస్తావించారు. దున్ హాంగ్ నగరానికి 25కి.మీ దూరంలో 492 తొలచిన గుహల సమూహం అక్కడ ఉండేది. మారిన రాజకీయ పరిస్థితుల్లో బౌద్ధంపై పెచ్చరిల్లిన దాడుల నేపథ్యంలో 11వ శతాబ్దంలో ఈ గుహాలను మూసివేస్తారు. ఇక్కడి శీతల వాయువులు గుహల్లోని చిత్తరువులను, సాహిత్యాన్ని పరిరక్షించాయి.
దుహాంగ్ గుహలలో 1900వ సంవత్సరంలో యూరోపు దేశాల సమన్వయంతో చైనా పురావస్తు విభాగం ఇక్కడ తప్పుకాలు జరిపింది. ఒక విస్తృత ఆధ్యాత్మిక కేంద్రం అలా వెలుగులోకి వచ్చింది, యునెస్కో గుర్తింపు పొందింది, ఇంటర్నేషల్ దు హాంగ్ ప్రాజెక్ట్ అనే పేరుతో ఇక్కడి మానవాళి వారసత్వ సంపదను వెలుగులోకి తెస్తున్నారు. ఇక్కడ అభించిన గ్రంధాలను "దు హంగ్ మాన్యుస్క్రిప్ట్ గా డిజిటైజేషన్ చేస్తూ, వివిధ భాషలలోకి తర్జుమా చేస్తున్నారు దునహాంగ్లోని దాతప్రశులు లభించిన గుహను 'లైబ్రీ కేవ్'గా వ్యవహరిస్తున్నారు, చైనాలోని    గుహా గ్రంధాలయం లో అనేక పుస్తకాల మధ్యన ప్రకాశిస్తోంది వజ్రసూత్ర! 

ఈ పుస్తకం ఒరిజినల్ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది. డిజిటైజ్ చేసిన ఒక కాపీని 20 నుంచి 60 పౌండ్ల వరకూ మూల్యాన్ని నిర్ణయించి అమ్ముతున్నారు వాంగ్లీ కోరికకు భిన్నంగా !

పున్నా కృష్ణమూర్తి 7680950863

(ఏప్రిల్ 2017 ANDHRAPRADESHMAGAZINE.ORG)


Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు