Posts

బౌద్ధ సాహిత్యం

భారతదేశంలో  ప్రాచీన కాలం నుండి రాయబడిన బౌద్ధ సాహిత్యం వాటి రచయితలు 1. వినయ పిటక (Vinaya Piṭaka) రచయిత: బౌద్ధ సంఘంలోని శ్రావకులు (శిష్యులు)  కాలం: క్రీ.పూ. 5వ శతాబ్దం – బుద్ధుని మరణానంతరం 100 సంవత్సరాల్లో వివరణ: బౌద్ధ సన్యాసులకు నియమాలు, ఆచారాలు, విహార జీవన విధానాలు తెలిపే గ్రంథం. ఇది బౌద్ధ ధర్మసంఘానికి “నైతిక రాజ్యాంగం” లాంటిది. 👉 మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి: మహావగ్గా, చుల్లవగ్గా, పరివార. 2. సుత్త పిటక (Sutta Piṭaka) రచయిత: బుద్ధుని శిష్యులు (ఆనంద, ఉపాలి మొదలైన వారు) కాలం: క్రీ.పూ. 5వ శతాబ్దం వివరణ: బుద్ధుని ఉపదేశాలు, బోధనలు, సూత్రరూప వచనాలు. ఇందులో పంచ నికాయాలు : 1. దీఘ నికాయ 2. మజ్ఝిమ నికాయ 3. సంయుత్త నికాయ 4. అంగుత్తర నికాయ 5. ఖుద్దక నికాయ 👉 ఇవే బౌద్ధ సూత్ర సాహిత్యానికి పునాది. 3. అభిధమ్మ పిటక (Abhidhamma Piṭaka)  రచయిత: బుద్ధుని అనుచరులు (మహా కచ్చాయన, శారిపుత్త వంటి పండితులు) కాలం: క్రీ.పూ. 3–2వ శతాబ్దం (మౌర్య కాలం) వివరణ: ఇది బౌద్ధ తత్త్వశాస్త్రానికి మూల గ్రంథం. మనస్సు, భావాలు, గుణాలు, చైతన్యం గురించి లోతైన విశ్లేషణ ఇస్తుంది. 👉 ఇందులో “Alobho, Adoso, Amoho” వంటి గు...

అజంతా చిత్రాలు — బౌద్ధ ధర్మానికి ప్రతిబింబాలు

అజంతా చిత్రాలు — బౌద్ధ ధర్మానికి ప్రతిబింబాలు      అజంతా గుహలు భారతీయ బౌద్ధ శిల్పకళకు, బౌద్ధ చిత్రకళకు,బౌద్ధ ధర్మానికి చిరస్మరణీయమైన వారసత్వం. ఈ గుహలు మనకు బౌద్ధ జీవన విధానంపై విలువైన సమాచారాన్ని అందిస్తాయి.ఈ గుహలు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో వేరూలా నదికి సమీపంలో ఉన్న ఒక పర్వత శ్రేణిలో ఉన్నాయి. అజంతా గుహలను UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది.భారతీయ కళా చరిత్రలోనే కాక, ప్రపంచ కళా చరిత్రలోనూ అజంతా గుహలు ఒక అపూర్వ అద్భుతం. ఇవి బౌద్ధ ధర్మంలోని కరుణ, త్యాగం, జ్ఞానం, అనిత్యత వంటి శాశ్వత విలువలకు ప్రతిబింబాలు.    ‌‌ అజంతా గుహలను మొదట క్రీస్తుపూర్వ 2వ శతాబ్దంలో థేరవాద (హీనయాన) సంప్రదాయంలో 9 నుండి 12 వరకు ఉన్న గుహలు నిర్మించబడినాయి. ఈ గుహలు బౌద్ధ భిక్షువులు, వ్యాపారులు, మద్దతుదారుల విరాళాల ఆధారంగా నిర్మించబడ్డాయని తెలుస్తోంది.. ఆ కాలంలో సన్యాసులు ధ్యాన–విద్యా కేంద్రాలుగా, ప్రార్థన మందిరాలుగా వీటిని ఉపయోగించారు. తర్వాత మహాయాన కాలంలో, క్రీస్తుశకం 5వ–6వ శతాబ్దాలలో, 1 నుండి 8 గుహలను 13 నుండి 30 వరకు ఉన్న గుహలను హరిషేణుడు అనే వాకాటక రాజు (సుమారు క్రీస...
         అజంతా గుహలు భారతీయ బౌద్ధ శిల్పకళకు, బౌద్ధ చిత్రకళకు,బౌద్ధ ధర్మానికి చిరస్మరణీయమైన వారసత్వం. ఈ గుహలు మనకు బౌద్ధ జీవన విధానంపై విలువైన సమాచారాన్ని అందిస్తాయి.ఈ గుహలు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో వేరూలా నదికి సమీపంలో ఉన్న ఒక పర్వత శ్రేణిలో ఉన్నాయి. అజంతా గుహలను UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. అజంతా గుహల ముఖ్య విశేషాలు:          ఈ గుహలు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 6వ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి. ఇవి రెండు ప్రధాన దశలలో నిర్మించబడినాయి 1.తొలిదశ: థేరవాద బౌద్ధం (హీనయాన) ప్రభావంతో గుహలు 9 నుండి 12 వరకు నిర్మించబడినాయి. ఈ గుహలు బౌద్ధ భిక్షువులు, వ్యాపారులు, మద్దతుదారుల విరాళాల ఆధారంగా నిర్మించబడ్డాయని తెలుస్తోంది. 2. ద్వితీయ దశ: మహాయాన బౌద్ధ ప్రభావం తో గుహలు 1 నుండి 8 మరియు 13 నుండి 30 వరకు నిర్మించారు.హరిషేణుడు అనే వాకాటక రాజు (సుమారు క్రీస్తుశకం 460–478) ఆధ్వర్యంలో ఈ ద్వితీయ దశ గుహలు నిర్మించబడ్డాయి.          గుహ 16, 17, 19, 26 మొదలైనవి అతని కాలంలో లేదా అతని అనుయాయు...
1. గౌతమ బుద్ధుడు వేదాలను తిరస్కరించాడా? సరైన సమాధానం: గౌతమ బుద్ధుడు వేదాలను "తప్పు" అనీ, "చెడ్డవి" అనీ తిరస్కరించలేదు. ఆయన తిరస్కరించినది — వేద మంత్ర పఠనం, యజ్ఞాలు, హోమాలు, బ్రాహ్మణుల పుట్టుపూర్వీకుల ఆధారంగా మోక్షానికి దారితీస్తాయని చెప్పే ధారణ మాత్రమే. సూత్రాలలో (పాలి కానన్) — ఉదాహరణకి దీర్ఘ నికాయ (Digha Nikaya) లో — బుద్ధుడు వేద మంత్ర పఠనం ద్వారా నిర్వాణం సాధ్యమవదని స్పష్టంగా చెప్పారు. అయితే పురాతన ఋషులు (ఇసి) చేసిన తపస్సు, సాధనను ఆయన గౌరవించారు. 2. బుద్ధుడు వేద రుషులను గౌరవంగా ప్రస్తావించాడా? సరైన సమాధానం: అవును. బుద్ధుడు ఆత్రి (అత్తకో), వామదేవుడు (వామకో), విశ్వామిత్రుడు (వెస్సామిట్టో), జమదగ్ని (యమటగ్గి), అంగిరస (అంగిరసో), భరద్వాజ (భారద్వాజో), వశిష్ఠుడు (వాసేత్థో), కశ్యపుడు (కస్సపో), భృగు (భగు) వంటి వేద ఋషులను గౌరవంగా పేర్కొన్నారు. ఇవి వేదాల్లో ప్రసిద్ధమైన ఋషులే. --- 3. బుద్ధుడు వేదసంహితల సాధన మోక్షానికి దారి చూపదని చెప్పాడా? సరైన సమాధానం: అవును. మోక్షం (నిర్వాణం) సాధించేందుకు నీతి (శీలం), ధ్యానం (సమాధి), జ్ఞానం (ప్రజ్ఞా) అవసరమని బుద్ధుడు బోధించారు. వేద మంత్రాల ప...
Asmaka (IAST: Aśmaka) or Assaka (Pali) was a Mahajanapada in ancient India which existed between 700 BCE and 425 or 345 BCE according to the Buddhist text Anguttara Nikaya and Puranas. It was located around and between the Godavari river[1] in present-day Andhra Pradesh, Telangana, and Maharashtra. Its capital is variously called Potali or Podana, and is identified as present-day Bodhan in Telangana. Asmaka was located around and between the river Godavari.[1] It included areas in present-day Telangana, and Maharashtra.[3] It was one of the shodasa (sixteen) Mahajanapadas in the 6th century BCE, mentioned in the Buddhist text Anguttara Nikaya.[4] Puranas mention Asmaka as one of the conquered territories of the Nandas in the 5th or 4th century BCE. The capital is variously called Potali or Podana, which is identified as present-day Bodhan in Telangana.[2] The Buddhist text Mahagovinda Suttanta mentions about a ruler of Asmaka, Brahmadatta who ruled from Potali.[5] The Matsya Purana (ch...
అజంతా–ఎల్లోరా చిత్రకళ: బౌద్ధ ధర్మం ప్రతిబింబం భారతీయ కళా చరిత్రలో అజంతా–ఎల్లోరా గుహలు సాంస్కృతిక వైభవానికి, బౌద్ధ తాత్త్విక చింతనకు ప్రతీకలు. మహారాష్ట్రలోని వాఘూరా నది ఒడ్డున గుర్రం పాదములా వంపు తిరిగిన కొండలో చెక్కబడిన ఈ గుహలు క్రీస్తుపూర్వ 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 6వ శతాబ్దం వరకు బౌద్ధ సన్యాసుల ధ్యానకేంద్రాలు, విద్యాలయాలు, ఆరాధన మందిరాలుగా వెలసాయి. ఇవి హీనయాన (థెరవాద) మరియు మహాయాన సంప్రదాయాల రెండింటికి సంబంధించిన కట్టడాలు, శిల్పాలు, చిత్రాలను కలిగి ఉన్నాయి. 1819లో యాదృచ్ఛికంగా తిరిగి కనుగొనబడిన ఈ గుహలు నేడు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకున్నాయి. అజంతా చిత్రకళ పద్ధతి యూరోపియన్ ఫ్రెస్కో టెక్నిక్‌కు సమానమైనది, కానీ ప్రధాన తేడా ఏమిటంటే యూరోపియన్ కళాకారులు తడి ప్లాస్టర్ మీదనే రంగులు వేస్తే, అజంతా చిత్రకారులు ప్లాస్టర్ పొడిగా ఉన్న తర్వాత వర్ణచిత్రాలను రూపొందించారు. మొదట గుహల గోడలపై బంకమట్టి, ఆవు పేడ, బియ్యంపొట్టు కలిపి పూసి, దాని మీద సున్నపు తేట పూతతో మృదువైన ఉపరితలం సృష్టించేవారు. అనంతరం పించు తంతితో ఆకారాలు గీసి, ఖనిజ వర్ణాలతో రంగులు నింపేవారు. చిత్రాల్లో ఉపయోగించిన ప్రధ...
 అజంతా గుహలు  మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ జిల్లాలో  జల్పగావ్  రైల్వే స్టేషన్ నుండి కేవలం 59 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.  ఈ గుహలు ఔరంగాబాద్ నుండి 104 కిలోమీటర్ల దూరంలో, ఎల్లోరా నుండి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.వీటిని క్రీ.పూ. 2 వ శతాబ్దం నుండి క్రీ.పూ 480 వరకు నాటి 30 రాతి గుహలుగా చెక్కబడిన బౌద్ధ  స్మారక చిహ్నాలు .ఇవి గుబురుగా పైకి ఎగసిన వృక్షాల నడుమ గుర్రపు నాడా ఆకారంలో    250 అడుగుల ఎత్తుతో ఉన్న లోతైన లోయ పక్కన ఈ గుహలు ఉన్నాయి. దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు  పశ్చిమ కనుమల  మధ్య అడవిలో వెన్నెలగా ఉండిపోయిన ఈ గుహలను 1819లో యాదృచ్ఛికంగా   పునరావిష్కృతమైనాయి.         ఈ గుహల్లోని మందిరాల్లోని శిల్పకళ ,  చిత్రకళ, వాస్తుశిల్పం  ఈ మూడు   అజంతాను ప్రపంచ ప్రఖ్యాతి పొందేలా చేశాయి.       బుద్ధుని జీవితంలోని ఘట్టాలు, జాతక కథలు అత్యంత సున్నితంగా శ్రద్ధతో చిత్రీకరించారు ఆనాటి చిత్రకారులు. మానవ జీవితంలోని నీతి, ధర్మ విలువలు అందులో వ్యక్తమవుతాయి.చిత్రాల్లోని ము...