బ్రహ్మ విహారాలు

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఈ నాలుగింటిని
బ్రహ్మ విహారాలు అంటారు.

Maitri

Kindness and the willingness to make someone happy. To do something for them. Think and wish good for others.

మైత్రి:

సాధారణంగా మానవులకు ఉండే సహజ గుణం ఓర్వలేనితనం మరియు ద్వేషం. మైత్రీ గుణాన్ని  అభ్యాసం చెయ్యటం ద్వారా మనిషి లో మైత్రీ భావన నిండుతుంది. అతనికి ఈ భూమ్మీదే కాదు ఇతర ఏ లోకంలోనూ శత్రువులు అంటూ ఉండరు. క్రూర జంతువులు సైతం అతని సమక్షంలో తమ సహజ స్వభావాన్ని వదలి సాదుజంతువులుగా మారతాయి. ఇక మనుషుల మాట చెప్పేదేమి?

మనసులో మైత్రీ భావనతో ఉన్న మనిషి ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండటం ద్వారా ముందు సాధకునికే ఎంతో మంచి జరుగుతుంది. అనవసర ఆదుర్దాలు ఆందోళనలు లేకపోవటం వల్ల శారీరిక మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

ఈ భావన వల్ల సాధకుడు మనో ప్రశాంతతను పొందగలడు. 
ద్వేష భావం నుంచి విముక్తుడవుతాడు. ఎవరిని చూచినా అతనికి ద్వేష భావం కలుగదు. 
అతని మనసు ఎల్లప్పుడూ తేలికగా సంతోషంగా ఉంటుంది. 
మనిషి ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండటం ద్వారా సాధకునికి  ఎంతో మంచి జరుగుతుంది. 

Karuna

Compassion - When you truly have and show compassion in your relationships, you will get to know the other person better.

కరుణ

ఈ ధ్యానాన్ని చక్కగా అభ్యాసం చేసి కరుణ అనేభావనను ధారణ చెయ్యటం వల్ల మనిషి కరుణా పూరితుడు అవుతాడు. తప్పులు చేసిన వారిమీద అతనికి కోపం రాదు. కరుణ పెల్లుబుకుతుంది.  ఈ భావనా బలం వల్ల ఇతరుల చెడు కర్మను, రోగాలను పోగొట్టగల సంకల్ప బలం  సాధకునికి కలుగుతాయి.


Mudita

Happiness - As Buddha has said "There is no path to happiness. Happiness is the path".

If there is no joy or happiness in your love, then it's not love in the first place!

Do the things together that makes you happy.

Do things individually that makes you happy. Take time just with you, to know yourself more and come back and discuss with each other on what makes you happy.


ముదిత   

అసూయ, ద్వేషం, ఈర్ష్య మొదలైన చీకటి గుణాలు ఈ ముదితా భావన తో పారదోల బడతాయి. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారిని చూచి వారి సంతోషాన్ని తన సంతోషం గా భావించి అంతకంటే ఆనందాన్ని సంతోషాన్నిసాధకుడు ఈ భావనా బలంతో పొందగలడు. తన వద్ద ఏమీ లేకున్నాఇతరులను వారి పుణ్య బలాన్ని చూచి సంతోషంగా ఆనందం గా ఉండ గలగ టాన్ని ఈ భావనా ధ్యానం ఇస్తుంది. 

ఉపేక్ష:

ఇక దుర్మార్గులను, తనను ఎగతాళి చేసేవారిని, హాని చేసేవారిని ఈ ఉపేక్షా భావనతో విస్మరించి ఊరుకోవాలి. దీని సాధన వల్ల మనసులో ఉక్రోషం, ఏడుపు, నిస్సహాయత, కుంగిపోవటం, కోపం, కసి వంటి నిమ్న స్తాయికి చెందిన భావనలు మాయం అవుతాయి. మనసు ఆకాశం వలె నిర్మలంగా ఉండగలుగుతుంది. అన్నిటి కంటే ఈ ఉపేక్షా భావన అభ్యాసం కష్టం.

Upeksha

Freedom - If you do not feel free with the person you love, then it's not love after all.

Love can never flourish on bondage or conditions. Freedom to share ideas and thoughts with each other. Freedom to be who you are completely.

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు