Posts

Showing posts from June, 2025

బౌద్ధ ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన *కొడవలి*

Image
బౌద్ధ ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన *కొడవలి*       కొడవలి అనగానే పంటకోసే పనిముట్టు గుర్తుకొస్తుంది. కానీ ఈ కొడవలి ఒక పురాతన బౌద్ధ క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండల కేంద్రానికి 15 కి. మీ. దూరంలో, పిఠాపురం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.            కొడవలి బౌద్ధ స్థూపం ప్రాచీన భారత బౌద్ధ సంస్కృతి, చరిత్రకు ఒక అపూర్వ ఉదాహరణ. ఈ స్థూపం సామ్రాట్ అశోకుని కాలమైన క్రీ.పూ. 3-2 శతాబ్దాలకు చెందింది. ఇది బౌద్ధ ధర్మ ప్రచారానికి, ప్రాచీన భారత పురావస్తు సంపదకు అద్భుతమైన సాక్ష్యంగా ఉంది.        కత్తిపూడి-రాజమండ్రి జాతీయ రహదారి సమీపంలో, కొడవలి జంక్షన్ నుండి 3 కి.మీ. దూరంలో ఇది ఉంది. ఇదొక మహాస్థూపం. దీని చుట్టుకొలత 12 మీ. దీన్ని తెల్లని సున్నపు రాయితో నిర్మించారు.1880లో పురావస్తు శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఈ స్థూపంలోని రాతి కట్టడాల్లో బ్రాహ్మి లిపిలో శాసనాలు ఉన్నాయి. ఇందులో శాతవాహన రాజు వశిష్టపుత్ర శిరి చందసాత గురించి ప్రస్తావన ఉంది. ఈ శాసనం బౌద్ధ ధర్మానికి ఆ రాజు చేసిన ప్రోత్సాహాన్ని సూచిస్తోంది. 2008-2011...