బోధిసత్త్వుడు


పాళీ భాషలోని పదం బోధిసత్త్వ. 
బోధి అంటే బుద్ధత్వం లేదా గొప్ప జ్ఞానం అని అర్థం. థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను "బోధి" అంటారు
సత్త్వం అంటే ప్రాణి అని అర్థం.బుద్ధత్వం పొందడానికి ముందు సిద్ధార్థ గౌతమునికి ఈ పేరునే ఉపయోగించారు.

భవిష్యత్ లో బుద్ధుడు లేదా మహాజ్ఞాని అవగలిగే ప్రాణి అంటే బుద్ధత్వం పొందడం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళని  బోధిసత్త్వుడు అని అంటారు.

బోధిసత్త్వుడు ఎల్లప్పుడూ తనకు జ్ఞానోదయం కావడం  మాత్రమే కాకుండా ఇతరులు కూడా జ్ఞానోదయం పొందాలని పాటుపడతారు. ముఖ్యంగా పరుల హితం కోసం తపిస్తూ పరుల కోసం పనులు చేసే వాళ్ళని బోధిసత్త్వుడు అంటారు.

ఇతరులు బోధిని పొందడం కోసం పనులు చేసేవారిని బోధిసత్త్వుడు అంటారు.

బోధిసత్త్వుడు రెండు పనులు చేస్తారు.

1.తనను తాను పరిపూర్ణుడుగా చేసుకోవడానికి కృషి చేయడం.

2.పరులకు లాభం చేసే పనులు చేయడం.

మహాయాన బౌద్ధం ప్రకారం బోధిసత్త్వుడు ఎప్పుడు ఏం అనుకుంటారు అంటే ఎవరైనా తనకు చెడు చేస్తే ఆ చెడు తనకు మంచి చేయడానికి చేసిన సేవగా భావిస్తారు. అలా భావించడం అంటే తాను బుద్ధుల మార్గంలో ఉన్నారని అనుకుంటారు.

డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ను బోధిసత్త్వుడు అని బౌద్ధ భిక్షువులు ,ప్రపంచ దేశాల బౌద్ధులు భావిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ నవబుద్ధుడు.

అరియ నాగసేన బోధి

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు