జైన ధర్మం క్రీ.పూ నాలుగో శతాబ్దానికే ఆంధ్రదేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. కళింగ రాజైన ఖారవేలుడి ఆదరణ వల్ల కృష్ణా నదికి ఉత్తరంగా తీరప్రాంతంలో ముందంజ వేసింది. అశోకుడి పుత్రుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ దేశాల్లో జైన వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతి సమీపంలోని వడ్డమాను కొండపై సంప్రతి విహారం ఏర్పడింది. అక్కడే ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీస్తు శకారంభంలో సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలోని కొనకుండ్లలో ఆశ్రమం నిర్మించుకుని మతప్రచారం చేస్తూ సిద్ధాంత గ్రంథాలు రచించాడు. వాటిలో సమయసార అనే గ్రంథం శ్వేతాంబర, దిగంభర శాఖలకు ఆదరణీయమైంది. గుంటుపల్లి (కామవరపుకోట) లోని గుహలు జైనులకు సంబందించిన గుహలుగానే భావిస్తున్నారు. ఇవికాక రామతీర్థం (నెల్లిమర్ల) , శాలిహుండం మొదలగుచోట చిన్న స్తూపాలు, జైన స్వస్తిక చిహ్నాలు ఇక్కడ జైన మతం విస్తరించిందని తెలుస్తోంది. అయితే ఇది బౌద్ధం లాగా సామాన్య ప్రజల్లోకి చొచ్చుకొని పోలేదు. అనంతపురం జిల్లా లోని వజ్రకరూరు మండలంలోని కొ...