Posts

Showing posts from April, 2023

అశోకుడు ప్రచారం చేసిన ధమ్మగుణాలు :

అశోకుడు  ప్రచారం చేసిన ధమ్మగుణాలు :  1. ప్రతివ్యక్తి తల్లి దండ్రులపట్ల విధేయత , బంధు మిత్రుల పట్ల అప్యాయత , నౌఖర్లు బానిసలపట్ల సౌజన్యత , శ్రమణులు(భిక్షువులు) పట్ల ఔదార్యం , మహిళలపట్ల గౌరవభావం కల్గియుండాలి .  2. విద్యార్థులు గురువులను గౌరవించాలి ..  3. చిన్న పెద్ద అన్ని ప్రాణుల పట్ల దయకలిగి యుండాలి.  ఏ  ప్రాణికి ఏ విధమైన హాని చేయకూడదు .  4. పవిత్రమైన శీలం , పటిష్టమైన మనోనిగ్రహం , పరిశుద్ధమైన ఆలోచన , హార్ధికమైన కృతజ్ఞతాభావం , శ్రద్ధాపూర్వక విశ్వాసం మొదలగు సద్గుణాలను అలవర్చుకొని ఆదర్శంగా జీవించాలి .  5. ఖర్చుచేయుటలో పొదుపును పాటించాలి .  6. అహంకారము , ద్వేషభావము మొదలగు దుర్గుణాలకు బదులు నిరాడంబరత , ఉదారత , సౌజన్యతలను అలవర్చుకోవాలి .  7. జననం , అనారోగ్యం , పరిణయం , ప్రయాణం వంటి సందర్భాలలో స్త్రీలు అనుసరించే మూఢాచారాలకు బదులు మంగళసుత్తను పఠించాలి. 8. పరిశుద్ధమైన , శ్రేష్టమైన మనస్సు కల్గి యుండాలి  9. ఎట్టి పరిస్థితులలోను జీవితాన్ని ఛిద్రం చేసుకోరాదు .  ఈ విధంగా అశోకుడు ప్రజలకు ధమ్మాచరణ పరంగా సరియైన దృష్టిని , దృక్పధాన్ని , సమున్నత వి...