Posts

Showing posts from May, 2022

బౌద్ధం - వాస్తవాలు

  బుద్ధుని గురించి, బౌద్ధం గురించి  అవగాహన కోసం ఈ క్రింది వాస్తవాలను  గమనించగలరు: ★బుద్ధుడు పుట్టేనాటికి (క్రీస్తు పూర్వం 563 సంవత్సరం నాటికి) భరత ఖండం లోనే కాదు అప్పటి ప్రాచీన నాగరికతలైన ఇండియాతో సహా, చైనా, ఈజిప్టు, మెసపటోమియా లలో ఎక్కడా కూడా 'హిందూ మతం' అనేది లేనే లేదు. 【శ్రుతులలో (వేదాలలో), స్మ్రుతులలో (ధర్మశాస్త్రాలు), ఇతిహాసాలు, పురాణాలలో ఎక్కడా హిందూ అనే శబ్దం కనిపించదు】. ★భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా జయించిన విదేశీ రాజులు - పర్షియన్ (ఇరాన్) రాజులు అయిన 'సైరస్' మరయూ అతని మనుమడు 'డేరియస్' (6౦౦ B.C.). ★అప్పటి భరత ఖండం లో 'షోడస మహాజనపదములు' అనే16 రాజ్యాలు మాత్రమే (అంగ మహాజనపదం లేదా రాజ్యం, వజ్జి లేదా లిచ్ఛవి రాజ్యము, కోసల రాజ్యము, మల్ల రాజ్యము, etc.,) ఉనికిలో ఉన్నాయి. వాటిలో ఈ పర్షియన్లు జయించింది వాయవ్య భారతం - సింధు ప్రాంతంలోని 'కాంబోజ' (ఇది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది), మరియూ 'గాంధార' (ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లోని కాందార ప్రాంతం) రాజ్యాలను జయించారు(బింబిసారుని కాలంలో). వీరు ఈ ప్రాంతాన్ని (సింధు) క్రీ.పూ. 600 నుండి 334 ...