బుద్దుని బోధనలు : నెహ్రూ.
pc: thewire.in బుద్దుని బోధనలు : నెహ్రూ. "సముద్రంలో చేరిన నదులు తమ పేరు కోల్పోయినట్లు బౌద్దంలో చేరిన వారు తమ వర్ణం (కుల) స్వభావం కోల్పోతారు." "ద్వేషం ద్వేషంచేత తొలగపోదు. ప్రేమ చేతనే ద్వేషం తొలగిపోతుంది. " "యుద్ధంలో వేయి మందిని జయించిన వాడు కాదు నిజమైన వీరుడు. తనను తాను జయించిన వాడు నిజమైన వీరుడు." "పుట్టుక చేత ఎవరైనను అత్యున్నతుడు కాలేడు. సత్ప్రవర్తన ద్వారా మాత్రమే ఒకడు అత్యున్నతుడు అవుతాడు. "భగవంతునితో నిమిత్తం లేకుండా, మరొక ప్రపంచం ప్రసక్తి లేకుండా, మతం పేరు లేకుండా బుద్ధుడు తన ధమ్మం విస్తరింప చేశాడు. " హేతువాదం మీద, తర్కం మీద, అనుభవం మీద ఆధారపడి ఎవరికి వారు తమ బుద్దితో సత్యాన్వేషణ చేయాలి." "అజ్ఞానం అన్ని దుఖాలకు కారణం. ఆ రోజులలో భారతీయ మేధాసంపన్నులు ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ పదార్ధం గురించి విచారిస్తుంటే బుద్ధుడు ఈ తత్వం జోలికి పోలేదు." "వాస్తవికత అంటే ఏవిధమైన మార్పులు చెందని శాశ్వత స్థితి కాదు. నిరంతరం మారుతుండే ఒక చైతన్య ప్రవాహం." "బుద్దుని సిద్దాంతాలకు, నేటి భౌతిక శాస్త్రానికి ఎంతో సాన్నిహ...