కోపగించు కోకుండా ఉండాలంటే ఏంచేయాలో చెప్పిన బుద్ధుడు



            వ్యక్తిత్వ వికాసంలోనూ, మనిషి తన ప్రవర్తనను నియంత్రించుకోవడంలోనూ కీలకమైనది 'కోపం'. 

         కోపం గురించి బుద్ధుడు చెప్పినంతగా మరెవరూ చెప్పలేదు. నీవు కోపంతో ఉండటమంటే ఇతరులు చేసే తప్పులు నిన్నుకాల్చేస్తున్నాయని అన్నాడు. నీ కోపాన్ని చూసి ఎవరూ నిన్ను శిక్షించరు. అది నిన్ను శిక్షిస్తుందన్నాడు. నీవు కోపగించు  కుంటున్నావంటే నిప్పును చేతిలో పట్టుకొని దాన్ని ఇతరులపైకి వేయాలనుకోవడం వంటిదన్నారు. ఎందుకంటే అది నిన్ను కాల్చేస్తుందన్నాడు.

         కోపగించు కోకుండా ఉండాలంటే ఒక చక్కని మార్గాన్ని సూచించాడు బుద్ధుడు. కోపం ఎప్పుడు వస్తుందంటే ఒక విషయంపై మనలో వ్యతిరేకతా భావం ఏర్పడినప్పుడే. అందువల్ల వ్యతిరేక భావాల్ని మన మనసులో లేకపోతే, లేదా మరచిపోతే కోపం దానంతట అదే మాయమవుతుంది. కోపం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. 

      ఇతరులను జయించాలన్న ఆలోచనకన్నా తన్నుతాను జయించుకోవడమే గొప్పదన్నాడు. ఈ పని కోపాన్ని నిగ్రహించుకోవడంతోనే మొదలవుతుంది. 

      సుమతి  శతకం పద్యకారుడు కూడా ఈ విషయాన్నే తన పద్యంలో ఇలా చెపుతాడు.

'తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దు:ఖమే నరకమండ్రు తధ్యము సుమతీ".

      మనిషి ఆలోచనలకు, భావాలకు మనస్సే మూలమైంది. ఎద్దు వెంబడి చక్రాలు ఎలా వస్తాయో, మన మనస్సులో ఏవిచల్లుకుంటే అవే మనల్ని వెంటపడి వస్తాయని బుద్ధుడు చెప్పినాడు. నీ మనస్సును మంచి భావాలతో నింపుకుంటే నీ మాటలు, చేష్టలతో మంచి పొంగి పొరలి ఆనందం ఎల్లప్పుడూ నీడలా అంటిపెట్టుకొని ఉంటుందని బుద్ధుడు నొక్కి
వక్కాణించాడు. 

        మనసనేది ఒక పూలతోటలాంటిదన్నారు. అందులో ప్రేమ, ద్వేషం, భయం, తిరస్కారం, సహృదయత అనే విత్తనాలు పెరుగుతాయి. మరి, ఆ పూదోటలో ఎలాంటి విత్తనాలు చల్లాలనుకున్నావో తెలుసుకోమన్నాడా మహానుభావుడు.

      తోటి మనిషిని ప్రేమించడం ద్వారా కోపాన్ని తగ్గించుకోవచ్చు. ప్రేమ, కరుణ, మైత్రి గుణాలను
పెంపొందించుకున్న మనిషి తప్పకుండా మనిషి అవుతాడు. ప్రేమను గురించి బుద్ధుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటే నేడు సమాజంలో యువతీయువకులు సరైన ప్రేమను గుర్తించగలుగుతారు.  

        నీకొక పుష్పం నచ్చినప్పుడుదానిని పీకితే దానిని ఇష్టపడినట్లు. అదే ఆ పూల చెట్టును శ్రద్ధగా నీళ్ళుపోసి పెంచితే ఆ పువ్వును ప్రేమించినట్లు, అదే ప్రేమకు, ఇష్టానికి గల తేడా అని ప్రేమకు గొప్ప నిర్వచనాన్ని ఇచ్చాడు బుద్ధుడు. ప్రేమికుల రోజు పేరిట జరిగే కార్యక్రమాన్ని నిజమైన ప్రేమలను ప్రతిబింబించడం లేదు. కారణం తోటి మనుషుల పట్ల ప్రేమానురాగాలు చూపించక కేవలం తన ఇష్టసఖిపట్ల ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారంతే.

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు