అంబేద్కర్ చెప్పిన సూక్తులు



◆ People who have not decided their objective they can't get any sucess. When they dont get any success, they can't make any impact in the history of the time. 

◆ ఏ ప్రజలైతే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోరో వారు ఎటువంటి విజయాన్ని పొందలేరు ఎపుడైతే వారు విజయాన్ని పొందలేరో, వారు చరిత్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేరు. 
              
◆ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు. ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం.

◆ నా దేశ సమస్యలకు-నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణలు వస్తే ముందు నా జాతి కి ప్రాముఖ్యత ఇస్తాను.కానీ నేను - నా దేశం ఈ రెండింటిలో నా దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను.

◆దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.ప్రతిపౌరుని నైతికాభివృద్దే దేశాభివృద్ధి.

◆జీవించేందుకు తినాలి.సమాజ సంక్షేమానికై జీవించాలి.

◆నీ కోసం జీవిస్తే.. నీ లోనే నిలిచిపోతావు.
జనం కోసం జీవిస్తే... జనం లో నిలిచి పోతావు.

◆ఓటుహక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో,
అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.

◆ కులం పునాదుల మీద ఒక జాతిని గాని, నీతినిగాని నిర్ములించలేము.

◆ వినయం,శీలం లేని విద్యావంతుడు మృగం కంటే హీనుడు.

◆ఆశయాలను ఆచరణలోపెడితేమహానీయులవుతారు.

◆ నీ బానిసత్వాన్ని నీవే పోగొట్టుకోవాలి. దేవుడి మీదకాని,మహానుభావుల మీద కానీ ఆధార పడకు.

◆ ఏ కారణము లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నీవు చేసే పనిలో విజయం సాధిస్తావని అర్థం.

◆రాజ్యాంగాన్ని నమ్ముకుంటే చెప్రాసి నుండి రాష్ట్రపతి ని చేస్తుంది.మతాన్ని నమ్ముకుంటే....మళ్ళీ నిన్ను బానిసగా తయారు చేస్తుంది.

◆నేను హిందుమతంలో పుట్టాను.కానీ నేను హిందువుగా చావను.ఎందుకంటే కులవ్యవస్థ లేని,అంటరాని తనంలేని హిందూమతాన్ని నేను స్వాగతిస్తాను.

◆ఈ కుల వ్యవస్థ వల్ల నేను నా జాతి ఎన్ని అవమానాలు భరించాయో భారతీయులకే కాదు ప్రపంచానికి కూడా తెలుసు.కాబట్టి కులవ్యవస్థను రూపు మాపాలి.సమ సమాజ నిర్మాణానికి తోడ్పడాలి.

◆ తల్లి దండ్రులకు నలుగురు సంతానం ఉంటే నలుగురిని సమానంగా పెంచి,పెద్ద చేసి ఆస్తులను సమబాగాలుగా ఇస్తారు.కానీ దేవుడు పుట్టించిన బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర(బీసీ,ఎస్సి, ఎస్టీ) లలో శూద్రులను గుళ్ళోకి రానివ్వద్దని,ఊళ్ళోకి రావద్దని,చెరువు నీళ్లు ముట్ట వద్దని,అగ్ర కులాలు వీరిని తాక రాదని చెప్పిన మనువాద శాస్త్రాన్ని తగుల బెట్టండి తప్పులేదు.ఎందుకంటే అన్నివర్ణాల వారికి సమన్యాయం చేయలేదు కాబట్టి.

   

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు