ప్రపంచంలో ప్రతిదీ పరస్పర సంబంధంతో ఉంటుంది.


      

   

ప్రపంచంలో ప్రతిదీ పరస్పర సంబంధంతో ఉంటుంది.

      ప్రపంచంలో ప్రతిదీ పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుంది. నీవు ధర్మప్రవర్తనను ఆచరిస్తే,ఇతరులు కూడా మెల్లగా వాటిని ఆచరిస్తారు. ఇవన్నీ పరస్పర సంబంధం కలిగి ఉన్న విషయాలు. ప్రతిరోజూ ఇతరుల నుండి లభించేది ఎంత స్వల్పమైనా ధన్యవాదాలు తెలుపమన్నాడు. మనసులో మలినాలనుఉంచుకోకుండా నిర్మలంగా ఉంటే అది ఆనందానికి దగ్గర దారవుతుంది. ప్రతి రోజు ప్రకృతికి ధన్యవాదాలు తెలపాలన్నారు. ప్రతి దినం మనం ఎంతో నేర్చుకున్నాం కదా ! అందుకు. పోనీ నేర్చుకోకపోయినా కొంచెమైనా   తెలుసుకున్నాం కదా ! అందుకు. పోనీ ఏమి తెలుసుకోకపోయినా అనారోగ్యానికి గురికాలేదు కదా! అందుకు. పోనీ అనారోగ్యం గురికాకపోయినా కనీసం మనం మరణిచలేదు కదా ! అందుకు ప్రకృతికి ధన్యవాదాలుతెలపాలని బోధించాడు. బుద్ధుడు.

నేటి బాలలు, యువకులు బౌద్ధ ధర్మసారాన్ని అర్థం చేసుకొని బుద్ధుని ప్రవచనాలను పాటించగలిగితే
మంచి వ్యక్తిత్వ వికాసం తో సమాజంలో రాణిస్తారు.

- పిళ్లా కుమారస్వామి






Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు