బుద్ద ధమ్మ


బుద్ధుడు మనిషి జీవనానికి కావలసిన  విధానం
ధర్మాల రూపంలో చెప్పాడు.
బుద్ద ధర్మం"మతం కాదు" జీవనవిధానం.ఇది సనాతన ధర్మం.

బుద్ధ ధమ్మ అంటే ఏమిటి?

త్రిశరణాలు

1) బుద్ధం శరణం గచ్చామి
2) ధమ్మం ( ధర్మం కాదు ) శరణం గచ్ఛామి
3) సంఘం శరణం గచ్ఛామి.

అంటే

1) నా బుద్ధిని ఉపయోగించి జ్ఞానానికి లోబడి ఉంటాను.

2) మంచి జీవన విధానానికి ధమ్మానికి లోబడి ఉంటాను.

3) సంఘానికి లోబడి సంఘ వ్యతిరేక పనులు చేయకుండా ఉంటాను.

అలాగే

పంచశీల(5)
అష్టాంగమార్గాలు(8)
దశపారమితాలు10)

పంచశీల అనగా...

1) అహింస (మనుషులను జంతువులను హింసించరాదు)
2) మద్యం తాగకూడదు
3) దొంగతనం చెయకూడదు
4)వ్వభిచరించకూడదు
5) అబద్ధం చెప్పకూడదు.



1) యజ్ఞం లో జంతువులను బలిస్తారు, దీనికి వ్యతిరేకం "అహింస "
2) సురాపానం చేస్తారు దీనికి వ్యతిరేకం "మద్యం తాగకుండా " ఉండటం
3) మూలనివాసి ప్రజల పశుసంపదను దోచుకునేవారు, దీనికి వ్యతిరేకం " దొంగతనం చేయకుండా " ఉండటం
4) "వ్యభిచారం చేయకుండా " ఉండటం
5) "అబద్ధం ఆడకుండాఉండటం ".

అన్నాడు

ఆయన దగ్గర చేరిన మగవారిని " బౌద్ధ భిక్కు " అనే వారు .
అసలు అంత వరకు స్త్రీ లకు చదువుకునే హక్కు లేదు, మొట్ట మొదటి సారిగా " బుద్ధుడు తన సంఘంలోకి " స్త్రీలను కూడా చేర్చుకుని , వారికి కూడా చదువు చెప్పటం మొదలు పెట్టి , వారిని కూడా తను ఏర్పాటు చేసిన " బౌద్ధ సంఘం " లోకి సభ్యులుగా ఆహ్వానించాడు , ఆ  స్త్రీలను " బౌద్ధ భిక్కని "  అనేవారు .

బుద్ధుని అతని యొక్క శిష్యుల జీవన విధానం చూసి  ప్రజలందరు బుద్ధుని వెంట నడవటం , ఆయన చెప్పిన మార్గంలో నడవటం మొదలుపెట్టారు.

బ్రాహ్మణ సిద్ధాంతం సృష్టించిన అసమానతలు పోయి అందరూ "స్వేచ్ఛ ,స్వాతంత్ర్యం సమానత్వం, సోదరభావం తో జీవించటం మొదలు పెట్టారు." నెమ్మదిగా శూద్రులు అందరూ ఒక పెద్ద సంఘంలాగా , ఒకే లక్షం కోసం పని చేసే శక్తిలాగా తయారయ్యారు " .
దీంతో నెమ్మదిగా బ్రాహ్మణీయ ధర్మాలు పతనం చెందాయి.

బుద్ధ తన శిష్యులను అతి " సాధారణ జీవితం " గడపమన్నాడు.

రెండు జతల బట్టలు (ఒకటి వేసుకోవడానికి , ఇంకొకటి వారి సంచిలో ),

సూది దారం (చినిగితే కుట్టు కోవటానికి)

ఒక గిన్నె (ఆహారం కోసం)_
ఇవన్నీ పెట్టుకోవటానికి ఒక సంచి,
సమాజంలోని ప్రజలకు " జ్ఞానాన్ని ఇవ్వకుండా / బుద్ధుడు చెప్పిన జీవన విధానం బోధించకుండా , ఒక్క మెతుకు ఆహారం కూడా తీసుకోవద్దని తన శిష్యులకు హితోపదేశం చేశాడు.

పైన వివరించిన విషయాలే కాకుండా_
"తల మీద వెంట్రుకలు తీసెయ్యమని చెప్పాడు, తల మీద జుట్టు తీసివేయటం వలన ఉపయోగాలు చెప్పాడు" .

సొంత ఆస్తి ఉంచుకోవద్దని చెప్పాడు, ఉన్న ఆస్తి "సంఘం పేరు మీద" ఉండాలని తన శిష్యులకు చెప్పాడు.

ఇలా చేయటం వలన "అందరూ అభివృద్ధి చెందుతారని" చెప్పాడు.

అంటే ఇది ఇప్పటి గవర్నమెంట్ వ్యవస్థ లాగ పని చేస్తుంది.



బుద్ధుని సంఘాలన్నీ "విహారాలు" అనే వారు, " విహార్ అంటే స్కూల్ " అని అర్థం , వాటినే మనం " విద్యాలయాలు" అని చెప్పుకుంటున్నాం.

అందరు ఆ విద్యాలయాల్లో కి ప్రవేశించే ముందు_
పరిశుభ్రంగా స్నానం చేసి_
తల వెంట్రుకలు_ _తీయించుకుని_
లోపల చెప్పే విద్యా బుద్ధులను పొంది
అటు తరువాత వారికి తోచినంత డబ్బు ఆ యొక్క విహారానికి / సంఘానికి దానం ఇచ్చేవారు, ఆ డబ్బును తిరిగి సమాజ హితం కోసం , కొత్త సంఘాల / విహారాలు నిర్మాణం కోసం ఉపయోగించే వారు తప్ప, సొంత కర్చులకు వాడేవారు కాదు , అంత నియమ నిబంధనలు , నిబద్దతతో కూడిన జీవన విధానం పాటించేవారు , ఆనాటి " బౌద్ధ భిక్కులు , భిక్కునిలు"

అందరూ తమకు ఉదారంగా ఇచ్చిన డబ్బుని ఎలా ఉపయోగించారో,ఇప్పుడు
మనం కట్టే పన్నులు _గవర్నమెంట్ మనకి సంక్షేమ పథకాలు కింద ఎలా ఉపయోగిస్తుందో అలాగే, 
క్రీ. పూ. బుద్ధ ప్రవేశ పెట్టాడు.

ఇంకో విషయం విద్యాలయాల్లోకి ప్రవేశించే ముందు తరువాత చెసే పనులు

ప్రవేశించే ముందు శుభ్రంగా స్నానం చేసి, "తల నీలాలు తీసివేయడం"

బయటకు వచ్చే ముందు తమకు తోచిన విధంగా డబ్బులు దానం ఇవ్వటం "

బ్రాహ్మణీయ ధర్మాల ప్రకారం స్త్రీ కి చదువు కునేందుకు అర్హత లేదు.ఎందుకంటే స్త్రీ మనుధర్మం
ప్రకారం మగవాడి బానిస.

కాని బుద్ద ,స్త్రీలకు కూడా మగవారితో సమానం అని చెప్పాడు. వారికి కూడా తన జ్ఞానాన్ని పంచాడు.

తన జ్ఞానాన్ని దేశం మొత్తం కాలి నడకన వెళ్ళి అందరికి బోధించాడు.

ఇలా బహుజనులందరిని ఏకం చేసి ,ఆనాటి బ్రాహ్మణీయ సమాజానికి వ్యతిరేకంగా ఒక విప్లవం సృష్టించాడు బుద్ధుడు .

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు