నైతిక ఆక్సిజన్
నైతిక ఆక్సిజన్
బుద్ధుడు చెప్పిన పంచశీలలో కామవాంఛ పై నియంత్రణ కూడా ఒకటి ఉంది. ఈ విషయంలో ఈ సృష్టిలో ఏ జీవికీ లేని నియంత్రణ మనిషికే ఎందుకు? ఈ భూమ్మీది జీవరాశిలో ముఖ్యంగా క్షీరదాలలో చాలా వాటికి కామవాంఛలు ఏదో ఒక రుతువుల్లోనే కలుగుతాయి. కానీ, పాములు, బల్లులు వంటి సరీసృృపాలకి నిరంతరం వుంటాయి. కామోద్రేకం వాటి సహజాతాల్లోఒకటి.
జీవ పరిణామక్రమంలో సరీసృపాల నుండి క్షీరదాలు, వాటి నుండి కోతులు, వాటి నుండి మనిషి ఉద్భవించాడు. నాటి
సరీసృపాల మెదడు (రెక్టీలియన్ ట్రెయిన్) తిరిగి కోతులలో నిద్ర మేల్కొంది. అది మనిషికీ సంక్రమించింది. కోపం, కామోద్రేకం,అనాలోచితంగా ప్రవర్తించటం, భయం, దాడి చేయటం, టెర్రరిజం, మూఢభక్తి, క్షణికావేశం ఈ మెదడు క్రియలు. అలాగే... నాలుగుకాళ్ళ పశువులకు (క్షీరదాలకు) చెందిన మమ్మేలియన్ (బెయిన్ కూడా మనిషికి సంక్రమించింది.
నియమాలు పాటించకపోవడం,వావి వరుసలు చూడక పోవడం, హింసాప్రవృత్తి ఈ మెదడు చేసే క్రియలు. మానవ మెదడులో 4 శాతం వున్న రెప్టీలియన్ మెదడు, 36 శాతం వున్న మమ్మేలియన్ మెదళ్ళు కలిసి 40 శాతం ఆక్రమించాయి. ఇక మిగిలింది 60 శాతంగా వుంది.
వైజ్ఞానిక మెదడు లేదా హ్యుమన్ బ్రెయిన్. మనలో కోపం, ద్వేషం, ఆవేశం, మోహం, రాగం...లాంటి అమానవీయ కర్మలకి(పనులకు)
మొదటి రెండు మెదళ్ళు కారణం అయితే, శాంతం, ఆలోచన, విచక్షణ, నైతిక నియమాలు, జాలి, దయ, కరుణల్లాంటి మానవీయ కర్మలకి 'హ్యుమన్ బ్రెయిన్” కారణం.
ఇటీవల స్త్రీల మీద ముక్కుపచ్చలారని పసికందుల మీద కూడా లైంగిక అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సామూహిక
అత్యాచారాలు చేయడం, చంపడం సర్వసాధారణమైపోయింది. నిర్భయచట్టం వచ్చినా, ఈ అకృత్యాలు పెరిగాయే తప్ప
తగ్గలేదు. దీనికి ప్రధాన కారణం...ఒకటి-నైతిక విద్య, నైతిక భావజాల వ్యాప్తి పూర్తిగా అడుగంటి పోవడమే! కార్పొరేట్
సంస్థలు వచ్చాక అనైతిక కామ సమాచారం ఇంటింటికీ చేరాక మనిషిలోని రెప్టీలియన్ స్వభావం నిద్రలేవడమే.!
మెదడు మధ్యలో వుండే హైపోథాలమస్, పిట్యుటరీ గ్రంథులను చుట్టి వుంటుంది రెప్టీలియన్ బ్రెయిన్. ఈ (గ్రంథులవల్ల ఎడ్రినల్ గ్రంథులు ట్రేరేపించబడతాయి. వాటి (ప్రేరణ వల్ల ఈస్ట్రోజన్, టెస్టోరిరాన్ లాంటి సెక్స్ హార్మోన్లు స్రవిస్తాయి.వాటి వల్ల కామకోరికలు నిద్రలేస్తాయి.
హ్యుమన్ బ్రెయిన్ బలంగా వుంటే ఈ కోర్కెలకి కళ్ళెం పడుతుంది. అదే, రె్ప్టీలియన్ బ్రెయిన్ బలంగా వుంటే కోర్కెలు కట్లుతెంచుకుంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ పైశాచిక కామ వికృతాలకి ప్రధాన కారణం ఇదే! మనిషిలో
మానవీయ విలువల కేంద్రమైన 'హ్యుమన్ బ్రెయిన్”ని నిరంతరం బ్రతికించుకోలేక పోవడమే! అందుకే పిల్లలు టీనేజ్ కంటే ముందే కామోద్రేకాలకి లోనవుతున్నారు. 18-14 ఏళ్ళలో రావలసిన శారీరక మార్పులు (సెకండరీ సెక్సువల్ కారెక్టర్స్) తొమ్మిది, పదేళ్ళకే మొదలవుతున్నాయి. ఈ విశృంఖల సంస్కృతి వల్ల కామ వికారాలు ఏ స్థాయిలో పెచ్చరిల్లిపోయాయంటే.. వృద్ధస్త్రీల దగ్గర నుండి
పసికందుల వరకూ అందరూ బలైపోతున్నారు. అడవులు, కొండలు, గుట్టలే కాదు, నగరం నడిబొడ్డులో, గ్రామ సరిహద్దుల్లో, చివరకు
దేవుని గుడిలో కూడా కామాంధులు స్వైరవిహారం చేస్తున్నారు.
ఇక ఆధ్యాత్మిక, ధార్మిక ముసుగు వేసుకున్న నిత్యానంద, డేరా బాబాల్లాంటి వారు ఎందరెందరో... ధార్మిక సేవ పేరుతో చిన్నపిల్లల్ని
తమ గదులకు రప్పించుకుని, తమ పన్నాగం పారాక, వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి స్త్రీలని హింసించే ధార్మిక పండితులకూ కొదవ
లేదు. దేవాలయాలు, విద్యాలయాలూ, రక్షణ వ్యవస్థలూ...ఇలా అన్ని వ్యవస్థల్స్ స్త్రీల మాన ప్రాణాల్ని కబళిస్తున్న 'కామ కబందులు”
పుట్టుకొస్తూనే వున్నారు.
బౌద్ధం చెప్పిన నైతిక సూత్రాలన్నింటినీ వైజ్ఞానిక శాస్త్ర పరిధిలోకి తెచ్చి ఆలోచిస్తే ముఖ్యంగా ఈ దేశం ఏం కోల్పోయిందో అర్థమవుతుంది. మనిషిలోని అమానవీయ (రెప్టీలియన్, మమ్మేలియన్) భావాల్ని అణచి, మానవీయ (హ్యుమానిటీ) భావాల్ని మేల్కొల్బడమే బౌద్ధ ప్రబోధాలు చేసే అతి ముఖ్యమైన పని. బౌద్ధం ఈ సమాజానికి నైతిక ఆక్సిజన్ , మనువాద మతాల వల్ల, కార్పోరేట్ భావకాలుష్యం వల్ల దాన్ని మనం కోల్పోయాం. దాని పర్యవసానమే ఈ విపరీతాలు. ఈ దోషాల్ని, నేరాల్ని చట్టం మాత్రమే నియంత్రించలేదు.
భావజాలం మాత్రమే ఆ పని చేయగలదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ....“బౌద్ధాన్ని తరిమి కొట్టి ఈ దేశం తనకు తాను ఆత్మహత్య
చేసుకుంది” అని గురజాడ చెప్పిన మాటలు మనకు గుర్తుకురాక మానవు.
అవును.... నైతిక భావజాల రక్షణకు బౌద్ధమే శరణ్యం!అది....మనిషిని పశుత్వం నుండి మానవత్వం వైపుకు నడిపించే ఒకే ఒక్క ధమ్మమార్గం!నిజం...ఇది మాత్రమే అక్షర సత్యం !
(బుద్ధభూమిసంపాదకీయం)

Comments
Post a Comment