బుద్ద సౌరభాలు

దేవుడు ప్రకృతిలో ఒక వస్తువుగా ఉండడు. ఒక సామాజిక అవసరం సృష్టించిన ఆదర్శ మనోనిర్మితి దేవుడు. సృష్టిలో అసలు దేవుడు లేడు
  _అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి


ప్రతి ఒక్కరికి  ఎవరికి కావలసింది వారికి అందించగల స్థితిలో ఉంది సమాజం. దేవుడు, మతం అవసరం లేకుండానే ఈ పని చేయవచ్చు కనుక ఇవ్వాళ మతం దేవుడు సామాజిక అవసరాలు కావు. మతం లేకుండానే సమాజం మనుగడ సాగించ వచ్చు
__ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (బుద్ధిష్ట్)


ఈ ప్రపంచంలో నేను సమ్యక్సంబద్దుడను 
ప్రశాంతుడను స్వాంతుడను
ధర్మచక్ర సంస్థాపనార్థం నేను  బయలుదేరుతున్నాను 
ఈ అంధకార ప్రపంచంలో  మరణరహిత మృదంగ ధ్వానం  వినిపిస్తాను
కొత్త వెలుగుల్ని ప్రపంచమంతా నింపుతాను.
                    __ బుద్ధుడు

ఈ ప్రపంచానికి వెలుపల దీనికి ఆధారమైంది, ఆశ్రయం అయింది ,మరొకటి ఏదీ లేదు. ఈ ప్రపంచం సర్వ సమృద్ధం. సర్వ స్వతంత్రం .తనకు తానే ఆధారమైంది. 
                   ___బుద్ధుడు


మనచుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ప్రతిదీ తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. బాలుడు యువకుడు అవుతున్నాడు. యువకుడు వృద్ధుడవుతాడు. ప్రతిదీ ఒక ప్రవాహం. నది  ప్రవహిస్తున్నట్లు ఈ విశ్వం విశాలమవుతుంది.
                  __ బుద్ధుడు

మానవ జీవిత సరళిని ఏదైనా నిర్దిష్ట ప్రణాళిక లో మార్చాలంటే ఏదో కొంత మోతాదులో అరాచకత్వం చొప్పించక తప్పదు.
                  __ రస్సెల్

మనిషికి వెల్తురు తెచ్చే పరికరం మనసు మాత్రమే
      ___ బుద్ధుడు



బుద్ధి కర్మానుసారిణీ(ఏ ఆలోచన వచ్చినా అది కర్మ(పని) ఫలితమే)
                     __ హైందవం

కర్మ బుద్ధ్యాను సారిణీ(ఏ కర్మ (పని)చేసినా అది మన ఆలోచనల ఫలితమే)
                       ___బౌద్ధం

శరీరానికి మరణం ఒక్కసారి
                మాత్రమే....!
                కానీ!
   మనసుకు తప్పు చేసిన ప్రతి
            సారీ మరణమే....!!
                 - గౌతమ బుద్దుడు!

ధార్మిక నాం శుభే జాతే ఆనందో జాయతే పురే 
కింతు పాతకి లోకానాం వినాశే స్వాజ్జయ ధ్వనిః
 (ధర్మాత్ములకు శుభం కలిగితే ఊర్లో అందరూ సంతోషిస్తారు. అయితే లోకానికి కీడు చేసే వాడు మరణిస్తే జయధ్వనులు మిన్నుముట్టుతాయి )
              ____  సి.పి.బ్రౌను
When death puts out our flame,the snuff (charred part) will tell if we were wax(substance secreted by honeebee) or tallow(animal fat) by the smell.
                   __ CP Brown



అవిశ్రాంత జీవన గమనంలో కాసేపు ఆగి అటు వైపు చూడాలి
బతుకు తోటలో విచ్చుకుని పరిమళ భాషతో పిలుస్తున్న పువ్వును పలకరించాలి ఉరుకులు పరుగులతో పోతున్న మనం 
కాస్త విశ్రాంతిని కాస్త విరామాన్ని  ఏర్పరుచుకోవాలి 
అర్థం లేని జీవితానికి అర్ధాన్ని వెతుక్కోవాలి 

విలియంహెన్రీడేవిస్ (1870_1940)

కవిత్వం ఆనందంలో మొదలై వివేకంలో అంతమవుతుంది
 __రాబర్ట్ ఫ్రాస్ట్ (1874_1963)

నేను కొన్ని ప్రమాణాలు చేశాను నేను నిద్ర పోయే ముందు ఎన్నో మైల్లు నడవాలి 
నేను నిద్ర పోవడానికి ముందు ఎంతో దూరం వెళ్ళాలి
___రాబర్ట్ ఫ్రాస్ట్ (1874 _1963)

అదృశ్య 
హింసకు వ్యతిరేకంగా  ఊహలకందని నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 
అన్ని రకాల
నిర్బంధానికి వ్యతిరేకంగా ఉపన్యసించండి.
డబ్బు కోసం చచ్చేవాడిని అసహ్యించుకోండి. 
పొలాలలో, నగర పొలిమేరల్లో ఇక్కట్లు పడే మహిళల దగ్గరికి 
కనబడని వైఫల్యాలతో కరిగిపోతున్న వాళ్ల దగ్గరకి
వెళ్ళాలి.
దురదృష్టవంతులైన సహచరులను పరామర్శించాలి. 
ప్రపంచంలోని నైరాశ్యం పై ప్రళయంలా విరుచుకు పడాలి.
స్నేహంతో సమీపించి
మనసు విప్పి మాట్లాడాలి.
అన్ని రకాల నిర్బంధాలను అసహ్యించుకోవాలి.
     __ఎజ్రా పౌండ్( 1885_ _1972)

ప్రేమకు స్థలంతో కాలంతో నిమిత్తం లేదు
ప్రేమ ఒక జీవనవిధానం మనుషుల్ని కలిపేది ప్రేమ ఒక్కటే 
మనుషులకు అవసరమైంది ప్రేమ ఒక్కటే 
_డబ్ల్యూ హెచ్ ఆడెన్ (1907- 1973)_

ఓటమిని హృదయపూర్వకంగా ఆహ్వానించాలి అంగీకరించాలి 

బాధను మనస్ఫూర్తిగా స్వాగతించాలి 
అప్పుడు దుఃఖం వస్తుంది దుఃఖం లొంగిపోతుంది 

జీవితం కంటే ఏది గొప్పది కాదని
అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎదుర్కొనే జీవితం అన్యాయాలపై చేసే పోరాటం  
  అన్నిటి కన్నా ఉన్నతమైనవని నమ్ముతాను 

_డబ్ల్యూ హెచ్ ఆడెన్ (1907 _1973)_



*To conquer oneself is a greater task than conquering others.”*

*“Believe nothing, no matter where you read it, or who said it,  unless it agrees with your own reason and your own common sense.”*

Gautum Buddha


పలుకే బంగారం

గొప్ప సాహిత్యం ఆసాంతం అత్యంత ఉపయోగకరమైన భాషతో నిండినదే 
                                      __ఎజ్రాపౌండ్ 
మతం కంటే భాష మానవుల్ని దగ్గరి వాళ్లను చేస్తుంది
                             __లిట్టన్ స్ట్రాచీ 
మానవుడు సృష్టించిన అన్నిటిలోకీ భాషే
అద్భుతమైంది 
                            ___ఎజ్రాపౌండ్
               
 ఏ భాషకూ ఎప్పటికీ ఇలలో మరణం లేదు   
                 __ చక్రవర్తుల రాజగాపాలాచారి

మెదడు ప్రసరించే అద్భుత ఊహాతీత కాంతి వలయమే.. భాష 
                                     ___జాన్ మిల్

ఉచ్ఛారణే భాషకు ఆత్మ అది మన భావాలకు దర్పణం  
                                          ___జాన్ రూసో
















Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు