సంఘం ఎందుకు ?
కొందరికి సందేహం కలగవచ్చు.సాధారణ గృహస్త జీవితం గడుపుతూ బౌద్ధ ధర్మం ఆచరించవచ్చు అన్నప్పుడు ,బుధ్ధుడు భిక్షు సంఘాన్ని ఎందుకు స్థాపించాడు ? అని ఎవరైనా అడగ వచ్చు.
కేవలం తమ ధార్మిక బౌధ్ధిక వికాసం కోసమే గాక యితరుల సేవకు , ధర్మ ప్రభోదానికీ జీవితం పూర్తిగా అంకితం చెయ్యాలని సంకల్పం కలవారికి 'సంఘం ' అవకాశం కల్పిస్తుంది.
గృహస్తుగా జీవించే సామాన్యులు ఇతరుల సేవకు తమ జీవితాలను పూర్తిగా అంకితం చెయ్యగలరని ఆశించలేం.
కాని కుటుంబ బాధ్యతలు , ఇతర ప్రాపంచిక బంధాలూ లేని భిక్షువులు " బహుజన హితాయ బహుజన సుఖాయ " అనే బుద్ధుని ఉపదేశానుసారం తమ జీవితాన్ని అంకితం చెయ్యగల స్థితిలో ఉంటారు.
ఈ కారణంగానే చరిత్ర క్రమంలో. బౌద్ధ విహారాలు ధార్మిక కేంద్రాలుగా మాత్రమే గాక , విద్యా మరియు సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి.
____వల్పోల రాహుల బుద్ధుని బోధనలు
( డి. చంద్ర శేఖర్ అనువాదం)
Comments
Post a Comment