మనిషికి మనసే ముఖ్యమైనది
మనోపుబ్బజ్జమా ధమ్మా, మనోసేట్టా మనోమయా; మనసా చే పసన్నేన, భాసతి వా కరోతి వా తతో నం సుఖమన్వేతి, ఛాయావ అనపాయినీ.
అన్ని విషయాలను మనసే ముందుండి నడిపిస్తుంది
అన్ని విషయాలు ముందుగా మనసులోనే
మొదలవుతాయి
అన్ని విషయాలు మనసులోనే ఉత్పన్నమౌతాయి
ఆ విధంగా అంతా మనోమయం, అంతా మనోనిర్మితం.
కనుక, మనసు అత్యంత శ్రేష్టమైనది
కనుక, మనిషికి మనసే ముఖ్యమైనది
ప్రసన్నచిత్తంతో, నిర్మలమైన మనస్సుతో మాట్లాడినా, వ్యవహరించినా, ఏ పనిచేసినా
వీడని నీడవలే అట్టివాని వెన్నంటే సుఖం ఉండును
____ధమ్మపదం(యమకవర్ర: గాథ-2)
Comments
Post a Comment