Posts

బుద్ధిమయం అయింది బౌద్ధం

Image
       బుద్ధుని ధర్మం మనుషుల్ని మనిషిగా ఉంచుతుంది.మనిషి ఆనందంగా జీవించా లంటే,విజయవంతంగా ,ఫలవంతగా జీవించాలను కుంటే  బుద్ధుని  ఉపదేశాలు పాటించడం చాలా అవసరం.సామాన్య ప్రజలు బుద్ధ భగవానుని బోధనలు అర్థం చేసుకోవడం కష్టం.కాబట్టి అవి అర్థం చేసుకొని ఆచరించేవారు బుద్ధ భగవానుని  బోధనలు గురించి తెలియజేయాలి. ఇక్కడ భగవాన్ అనేది గౌరవ వాచకం. భగవాన్ బుద్ధ అని గౌరవంగా పిలుస్తారు.     ధర్మం ఈ సమాజాన్ని రక్షిస్తుంది.మనం ధర్మాన్ని రక్షించాలి.      "ఈ లోకంలో దుక్ఖం  ఉంది. దానికి కారణం ఉంది.నివారణ ఉంది" అని  బుద్ధుడు అంటారు. నూటికి 90 శాతం మంది ఏదో ఒక బాధ తో దుక్ఖిస్తున్నారు.దుక్ఖంతో బాధపడుతున్న వారిని విముక్తులను చేయాలని బౌద్ధం చెబుతుంది.      బౌద్ధ ధర్మానికి హేతువు పునాది.మానవులు ప్రగతి మార్గం లో నడిచేందుకు తగిన ఉత్సాహాన్ని కలిగించే అంశాలు బౌద్ధం లో ఉన్నాయి. బుద్ధుని సూత్రాలు, బోధనలు శాశ్వతంగా నిలిచాయి.2500 సంవత్సరాలకు పైగా బౌద్ధం నిలిచి ఉంది.ప్రపంచ దేశాల మేధావులందరూ బౌద్ధాన్ని అభిమానిస్తూ అనుసరిస్తున్నారు. "బుద్...

బౌద్ధ ధర్మాలు

Image
త్రిశరణములు 1. బుద్ధం శరణం గచ్చామి బుద్ధుని శరణు వేడుచున్నాము 2 ధమ్మం శరణం గచ్ఛామి బుద్ధ ధర్మాన్ని శరణు వేడుచున్నాము 3. సంఘం శరణం గచ్చామి బుద్ధ సంఘాన్ని శరణు వేడుచున్నాము. చతురార్య సత్యములు 1.దుఖం 2. దుఖకారణం 3. దుఖనివారణ 4 దుఖ నివారణ మార్గం అష్టాంగ మార్గం 1. సమ్యక్ వాక్కు - సరైన మాట 2. సమ్యక్ కర్మాన్తం - సరైన ఆచరణ   శీలం 3. సమ్యక్ ఆజీవ - సరైన జీవనోపాధి 4 సమ్యక్ వ్యాయామం - సరైన కృషి 5. సమ్యక్ స్మృతి - సరైన జాగరూకత  సమాధి 6. సమ్యక్ సమాధి - సరైన ఏకాగ్రత 7.సమ్యక్ దృష్టి - సరైన అవగాహన     ప్రజ్ఞ 8. సమ్యక్ సంకల్పం - సరైన సంకల్పం పంచశీల 1. పాణాతిపాతా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి ప్రాణములు తీయను అను నియమాన్ని పాటిస్తాను 2. అదిన్నాదానా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి చౌర్యానికి పాల్పడను అనే నియమాన్ని పాటిస్తాను 3. కామేసు మిచ్ఛాచారా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి లైంగిక దురాచారాలకు పాల్పడను అనే నియమాన్ని పాటిస్తాను 4. ముసావాదా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి అబద్ధములు చెప్పకూడదు అనే నియమాన్ని పాటిస్తాను 5. సురామేరయమజ్జన మాదట్ఠానా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి మత్...

బౌద్ధ మతతత్వం

Image
ఫోటో: ప్రశీక కాంబ్లే, హవిష్క్ కాంబ్లే బౌద్ధ సంఘానికి వందనం  బౌద్ధ మతతత్వం: -బౌద్ధ మతానుసారం మానవ శరీరం పంచఖండాలతో తయారైనది. అవి.. 1. రూపం 2. వేదన 3. సంజ్ఞ 4. సంస్కారం 5. విజ్ఞానం ఈ పంచఖండ సిద్ధాంతం నుంచే కొన్ని ముఖ్యమైన అంశాలను గ్రహించి వైభాసిక, సౌతాంతిక, యోగాచార, మాధ్యమికశాఖలను స్థాపించారు.

ధమ్మచక్కప్పవత్తన(Wheel of the Law)

Image
                    pc: metmuseum.com   బుద్ధుడు సారనాథ్ లోని హరిణవనం (జింకలవనం)లో తొలిసారిగా ఐదుగురు భిక్ఖువులకు చేసిన ఉపన్యాసాన్ని ధమ్మచక్కప్పవత్తన సూత్రం అన్నారు. ఈ ఉపన్యాసంలోనే భగవాన్ బుద్ధుడు "మధ్యేమార్గాన్ని",అరియ సత్యాలను బోధించారు. పాళీ భాషలో "ధమ్మచక్కప్పవత్తన"ను తెలుగులో ధర్మచక్రప్రవర్తన"గా పిలుస్తారు. అనగా సదాచార మార్గం,సత్య మార్గం అని కూడా భావించవచ్చు. బౌద్ధంలో ధమ్మచక్కప్పవత్తనం అనగా జ్ఞాన సంస్థాపనాన్ని వివరించుట అని అర్థం. ధమ్మచక్కప్పవత్తన అనగా ధమ్మ చక్రాన్ని తిప్పడం లేదా స్థాపించుట అని చెప్పొచ్చు. ధమ్మచక్కప్పవత్తననే ఇంగ్లీష్ లో Wheel of Law అని అంటారు.          భగవాన్ బుద్ధుడు బోధించిన ధర్మానికి  చక్రం ఒక చిహ్నంగా భావిస్తారు. ఈ ధమ్మచక్రానికి ఎనిమిది ఆకులు(Spokes)ఉంటాయి.బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గానికి ఈ ఆకులు కూడా చిహ్నాలే. ధమ్మచక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది.              సిద్ధార్థుడు తన 29వ సంవత్సరాల వయస్సులో ఇల్లు విడిచి ఆషాఢ పౌర్ణ...

పది పారమితలు

Image
             ఒక వ్యక్తి అనేకమందిని దుఃఖ విముక్తులను చేయటానికి తాను బుద్ధుడు కావాలని సంకల్పించినప్పటి నుండి అతన్ని బోధిసత్వుడు అంటారు. అంటే బోధిని, బుద్ధత్వాన్ని పొందటానికి తగిన వాడని అర్థం. అందుకోసం అతడు పది పారమితలను సాధించాలి. వీటిని ధమ్మానుపస్సనలో చెప్పినాడు. బౌద్ధం ఆరంభ దశలో "పారమిత"ను ప్రస్తావన లేదు. అయితే తరువాత వచ్చిన థేరవాద, మహాయాన బౌద్ధ సాహిత్యంలో "పారమితలు"   వచ్చి చేరాయి. అవి:   1. దానం  2. శీలం  3. ముదిత (ఉన్న దానితో సంతోషం) 4. ప్రజ్ఞ  5. ధృఢచిత్తం(సంకల్ప బలం)  6. ఖంతి (ఓపిక)  7. సమాధి  8. మైత్రి   9. మెత్త  10. ఉపేక్ష (సమతాభావన) ____ ధమ్మరఖిత భంతే

ఉండవల్లి గుహలు... వాస్తవాలు

Image
    ఉండవల్లి గుహలు...anantapadmanabhudu .. వాస్తవాలు            కృష్ణాజిల్లా విజయవాడ నగరానికి 15కిమీ దూరంలో,గుంటూరుజిల్లా మంగళగిరికి 4 కిమీ దూరంలో,అమరావతికి10 కీమీ దూరంలో గలబౌద్ధగుహలు  కార్లే గుహలను పోలిన ప్రసిద్ధ బౌద్ధ గుహాలరమం. ఆరామం అనేది గాని గుహలు గాని హిందువుల చరిత్ర లో ఎక్కడా కానరాదు.              క్రీ. శ.2-3 శ తాబ్ద కాలంలో ఇక్ష్వా కుల పాలనలో ఈ గుహలను ఏక శిలా పర్వతా న్ని నాలుగు అంతస్తులుగా తొలిచారు.రెండవ అంతస్తు విశాలంగా వుండి ఎత్తయిన పీఠంపై 12 అడుగుల బుద్ధుని మహాపరినిర్వాన శిల్పాన్ని చెక్కారు.తల క్రింద దిండు కుడిచేయి పైన ఏడమచేయి వుంచారు.బుద్ధుడి తలవద్ద కాళ్లదగ్గర విషాడవవనులిన మల్లులు చక్రవర్తులు బిక్షువుల  శిల్పాలు చెక్కబడి వున్నాయి. కానీ  క్రీ. శ.7 వ శతాబ్దిలో రెండవ మాధవవర్మ బుద్ధుడి తలకి కిరీటం మెడలో హారం చేతికి దండకడియాలు సున్నంతో పెట్టి anantapadmanaabhudini చేసి ఈ గుహలను అనంత పద్మనాభ గుహలు గా మార్చి ఇవి హిందూ గుహాలగా నమ్మించాడు. ఇది ఒక గోబెల్స్ ప్రచా...

జాతక కథల నేపథ్యం

Image
                      బుద్ధుని నిర్వాణం (మరణం) తరువాత మగధ రాజధాని రాజగృహలో క్రీ.పూ. 483లో బౌద్ధ బిక్షువులతో మొదటి సంగీతి (సమావేశం) మహాకాశ్యప అధ్యక్షతన జరిపారు. ఈ సమావేశంలో ఆనందుడు, ఉపాలి మొదలైన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు విన్నవారందరూ తాము విన్న వాటిని చెప్పగా వాటినన్నింటిని క్రోడీకరించి రెండు గ్రంధాలుగా తీసుకువచ్చారు. ఆవి (1) సుత్తపిటక (2) వినయపిటక . (తాటాకు గ్రంథాలను ఉంచే పెట్టెను పిటక అని పాళీ భాషలో అంటారు)           వందేళ్ళ తరువాత మళ్లీ రెండవ సంగీతి ఏర్పాటైంది. క్రీ.పూ. 247లో అశోకుని కాలంలో అశోకుడు, మొగ్గలిపుత్తతిస్స మొదలైన వారందరూ పాల్గొన్న మూడవ సంగీతి జరిగింది. ఆ సమావేశంలో  మూడో గ్రంథం 'అభిదమ్మ పిటక' తయారైంది. వినయ, సుత్త, అభిదమ్మ... ఈ మూడింటిని "త్రిపిటకాలు' అంటారు.        బౌద్ధ సాహిత్యం మూడు భాగాలైన త్రిపీటకాలలో ఉంది. మొదటి భాగం సుత్తపిటక. సుత్త అంటే సూత్రాలు.పిటక అంటే పెట్టే లేదా గంప. ఇందులో ఐదు నికాయలు (భాగాలు) ఉన్నాయి. దీనిలో బుద్ధుని ఉ...