బౌద్ధ ధర్మాలు
త్రిశరణములు
1. బుద్ధం శరణం గచ్చామి
బుద్ధుని శరణు వేడుచున్నాము
2 ధమ్మం శరణం గచ్ఛామి
బుద్ధ ధర్మాన్ని శరణు వేడుచున్నాము
3. సంఘం శరణం గచ్చామి
బుద్ధ సంఘాన్ని శరణు వేడుచున్నాము.
చతురార్య సత్యములు
1.దుఖం 2. దుఖకారణం 3. దుఖనివారణ
4 దుఖ నివారణ మార్గం
అష్టాంగ మార్గం
1. సమ్యక్ వాక్కు - సరైన మాట
2. సమ్యక్ కర్మాన్తం - సరైన ఆచరణ శీలం
3. సమ్యక్ ఆజీవ - సరైన జీవనోపాధి
4 సమ్యక్ వ్యాయామం - సరైన కృషి
5. సమ్యక్ స్మృతి - సరైన జాగరూకత సమాధి
6. సమ్యక్ సమాధి - సరైన ఏకాగ్రత
7.సమ్యక్ దృష్టి - సరైన అవగాహన ప్రజ్ఞ
8. సమ్యక్ సంకల్పం - సరైన సంకల్పం
పంచశీల
1. పాణాతిపాతా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి
ప్రాణములు తీయను అను నియమాన్ని పాటిస్తాను
2. అదిన్నాదానా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి
చౌర్యానికి పాల్పడను అనే నియమాన్ని పాటిస్తాను
3. కామేసు మిచ్ఛాచారా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి
లైంగిక దురాచారాలకు పాల్పడను అనే నియమాన్ని పాటిస్తాను
4. ముసావాదా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి
అబద్ధములు చెప్పకూడదు అనే నియమాన్ని పాటిస్తాను
5. సురామేరయమజ్జన మాదట్ఠానా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి
మత్తు పదార్థములు, మత్తు పానీయములు త్రాగను అనే నియమాన్ని పాటిస్తాను
బ్రహ్మ విహరాలు
మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష
ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం (కార్యకారణ సిద్ధాంతం)
కారణం లేకుండా కార్యం జరుగదు. కార్యం జరిగినట్లయితే కారణం ఉంటుంది
త్రిపిటకాలు
పిటకము అనగా పాళీ భాషలో గంప అని అర్థం
బుద్ధుని బోధనలు ఒకరి చేతుల నుండి వస్తువులతో నిండియున్న గంప మాదిరిగా ఇంకొకరికి అందించునట్లు బుద్ధుని బోధనలు చేరాలని భావన
1, సుత్త పిటకం - ఉపాసక, ఉపాసికలకు ఆసక్తికరంగా వుంటుంది
2 వినయ పిటకం - భిక్షువుల మరియు భిక్షుణీల ప్రవర్తనా నియమావళి
3 అభిధమ్మ పిటకం - ఉన్నత దార్శనిక విషయాల చర్చ
తధాగతుడు
తాను ఆచరించిన దానిని ఇతరులకు బోధించేవాడు
Comments
Post a Comment