బుద్ధిమయం అయింది బౌద్ధం
బుద్ధుని ధర్మం మనుషుల్ని మనిషిగా ఉంచుతుంది.మనిషి ఆనందంగా జీవించా లంటే,విజయవంతంగా ,ఫలవంతగా జీవించాలను కుంటే బుద్ధుని ఉపదేశాలు పాటించడం చాలా అవసరం.సామాన్య ప్రజలు బుద్ధ భగవానుని బోధనలు అర్థం చేసుకోవడం కష్టం.కాబట్టి అవి అర్థం చేసుకొని ఆచరించేవారు బుద్ధ భగవానుని బోధనలు గురించి తెలియజేయాలి. ఇక్కడ భగవాన్ అనేది గౌరవ వాచకం. భగవాన్ బుద్ధ అని గౌరవంగా పిలుస్తారు.
ధర్మం ఈ సమాజాన్ని రక్షిస్తుంది.మనం ధర్మాన్ని రక్షించాలి.
"ఈ లోకంలో దుక్ఖం ఉంది. దానికి కారణం ఉంది.నివారణ ఉంది" అని బుద్ధుడు అంటారు. నూటికి 90 శాతం మంది ఏదో ఒక బాధ తో దుక్ఖిస్తున్నారు.దుక్ఖంతో బాధపడుతున్న వారిని విముక్తులను చేయాలని బౌద్ధం చెబుతుంది.
బౌద్ధ ధర్మానికి హేతువు పునాది.మానవులు ప్రగతి మార్గం లో నడిచేందుకు తగిన ఉత్సాహాన్ని కలిగించే అంశాలు బౌద్ధం లో ఉన్నాయి. బుద్ధుని సూత్రాలు, బోధనలు శాశ్వతంగా నిలిచాయి.2500 సంవత్సరాలకు పైగా బౌద్ధం నిలిచి ఉంది.ప్రపంచ దేశాల మేధావులందరూ బౌద్ధాన్ని అభిమానిస్తూ అనుసరిస్తున్నారు. "బుద్ధిమయం అయింది బౌద్ధం" అని ధమ్మవినయ చెపుతుంది.
బౌద్ధం లో కులమత ప్రస్తావన లేదు. అందరూ సమానమే. లింగ బేధం లేదు. స్త్రీ పురుషులంతా సమానమే. మనిషి మనిషిగా జీవించడానికి సమాజం ఉన్నత మార్గంలో నడవడానికి బౌద్ధమే సరైన విధానం.
బౌద్ధం మూఢ విశ్వాసాలను ఖండిస్తుంది.
స్వర్గం,నరకం,తలరాత సిద్దాంతం,కర్మ సిద్ధాంతాలను తృణీకరిస్తుంది. మనిషి పంచశీల ధర్మాలను ఆచరించడమనేది నేటి సమాజానికి అత్యంత అవసరమైనది.
స్వేచ్ఛ,సమానత్వాలను బౌద్ధం ప్రోత్సాహిస్తుంది. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తుంది. సత్యాన్ని తనకు తానే కనుగొన్నామని ప్రోత్సహిస్తుంది. పూర్వీకులు చెప్పినారని ఎవరో గ్రంథాలలో వ్రాసినారని అదే సత్యంగా నమ్మాల్సిన అవసరం లేదని చెపుతుంది. సత్యాన్ని నువ్వు కనుగొంటే దాన్ని నిర్భయంగా ఇతరులకు చెప్పమని చెపుతుంది.
Comments
Post a Comment