Posts

ఉండవల్లి గుహలు... వాస్తవాలు

Image
    ఉండవల్లి గుహలు...anantapadmanabhudu .. వాస్తవాలు            కృష్ణాజిల్లా విజయవాడ నగరానికి 15కిమీ దూరంలో,గుంటూరుజిల్లా మంగళగిరికి 4 కిమీ దూరంలో,అమరావతికి10 కీమీ దూరంలో గలబౌద్ధగుహలు  కార్లే గుహలను పోలిన ప్రసిద్ధ బౌద్ధ గుహాలరమం. ఆరామం అనేది గాని గుహలు గాని హిందువుల చరిత్ర లో ఎక్కడా కానరాదు.              క్రీ. శ.2-3 శ తాబ్ద కాలంలో ఇక్ష్వా కుల పాలనలో ఈ గుహలను ఏక శిలా పర్వతా న్ని నాలుగు అంతస్తులుగా తొలిచారు.రెండవ అంతస్తు విశాలంగా వుండి ఎత్తయిన పీఠంపై 12 అడుగుల బుద్ధుని మహాపరినిర్వాన శిల్పాన్ని చెక్కారు.తల క్రింద దిండు కుడిచేయి పైన ఏడమచేయి వుంచారు.బుద్ధుడి తలవద్ద కాళ్లదగ్గర విషాడవవనులిన మల్లులు చక్రవర్తులు బిక్షువుల  శిల్పాలు చెక్కబడి వున్నాయి. కానీ  క్రీ. శ.7 వ శతాబ్దిలో రెండవ మాధవవర్మ బుద్ధుడి తలకి కిరీటం మెడలో హారం చేతికి దండకడియాలు సున్నంతో పెట్టి anantapadmanaabhudini చేసి ఈ గుహలను అనంత పద్మనాభ గుహలు గా మార్చి ఇవి హిందూ గుహాలగా నమ్మించాడు. ఇది ఒక గోబెల్స్ ప్రచా...

జాతక కథల నేపథ్యం

Image
                      బుద్ధుని నిర్వాణం (మరణం) తరువాత మగధ రాజధాని రాజగృహలో క్రీ.పూ. 483లో బౌద్ధ బిక్షువులతో మొదటి సంగీతి (సమావేశం) మహాకాశ్యప అధ్యక్షతన జరిపారు. ఈ సమావేశంలో ఆనందుడు, ఉపాలి మొదలైన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు విన్నవారందరూ తాము విన్న వాటిని చెప్పగా వాటినన్నింటిని క్రోడీకరించి రెండు గ్రంధాలుగా తీసుకువచ్చారు. ఆవి (1) సుత్తపిటక (2) వినయపిటక . (తాటాకు గ్రంథాలను ఉంచే పెట్టెను పిటక అని పాళీ భాషలో అంటారు)           వందేళ్ళ తరువాత మళ్లీ రెండవ సంగీతి ఏర్పాటైంది. క్రీ.పూ. 247లో అశోకుని కాలంలో అశోకుడు, మొగ్గలిపుత్తతిస్స మొదలైన వారందరూ పాల్గొన్న మూడవ సంగీతి జరిగింది. ఆ సమావేశంలో  మూడో గ్రంథం 'అభిదమ్మ పిటక' తయారైంది. వినయ, సుత్త, అభిదమ్మ... ఈ మూడింటిని "త్రిపిటకాలు' అంటారు.        బౌద్ధ సాహిత్యం మూడు భాగాలైన త్రిపీటకాలలో ఉంది. మొదటి భాగం సుత్తపిటక. సుత్త అంటే సూత్రాలు.పిటక అంటే పెట్టే లేదా గంప. ఇందులో ఐదు నికాయలు (భాగాలు) ఉన్నాయి. దీనిలో బుద్ధుని ఉ...

వజ్రయానం

Image
                 ఆంధ్రదేశంలో బౌద్దానికి చివరి దశ వజ్రయానం. దీనినే మంత్రయానం , తాంత్రిక బౌద్దం అనీ అంటారు.మహాయాన సిద్దాంతాల విశ్వాసాల సహజపరిణామమే వజ్రయానం.బౌద్దంలో ఉపాసకుల ప్రాబల్యం పెరగడంతోనూ,ఇతర సంప్రదాయ ప్రభావాల వల్ల తాంత్రిక ఆలోచనలు దిగుమతి అయ్యాయని ఎడ్వర్డ్ కాంజే అభిప్రాయం.           వాస్తవానికి 7-12 శతాబ్దాల మధ్య కాలంలో భారతదేశంలో  జైనం, శైవం, వైష్ణవం లలో కూడా తాంత్రిక పూజా విధానాలు ప్రవేశించాయి.             బెంగాల్, అస్సాం ప్రాంతాలు తాంత్రిక విద్యలకు జన్మభూములు.తూర్పు భారతంలో వజ్రయానం అధికమని టిబెటన్ గ్రంధాలు తెలిపాయి. బీహార్లో తాంత్రిక విద్యకు విక్రమశిల విశ్వ విద్యాలయం  పట్టుగొమ్మ అయింది.                     చైత్యకులు బౌద్దంలో ధూపదీప గంధాదులతో పూజా విధానం ప్రవేశపెట్టారు. గణరాజ్య ప్రజల ముద్రల ప్రభావం భక్తి మతం లోని మంత్రాల ప్రభావం వలన మహాయానం అంకురించి పరిణామం చెందింది.దీనికి తోడు పాలకులు వీటికి ఎక్కువగా ఆక...

బౌద్ధ సూక్తులు

Image
 ఈ ప్రపంచానికి వెలుపల దీనికి ఆధారమైంది, ఆశ్రయం అయింది ,మరొకటి ఏదీ లేదు. ఈ ప్రపంచం సర్వ సమృద్ధం. సర్వ స్వతంత్రం .తనకు తానే ఆధారమైంది.                     ___బుద్ధుడు మనచుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ప్రతిదీ తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. బాలుడు యువకుడు అవుతున్నాడు. యువకుడు వృద్ధుడవుతాడు. ప్రతిదీ ఒక ప్రవాహం. నది  ప్రవహిస్తున్నట్లు ఈ విశ్వం విశాలమవుతుంది.                   __ బుద్ధుడు  ప్రతిదీ ఉన్నది ఒక కొస అయితే ప్రతిదీ లేనిది మరొక కొస అవుతుంది .అసలు సత్యం ఏమంటే ఈ రెండు కొసల మధ్యలో ఉంది.                         ____బుద్ధుడు

భారతదేశంలోతొలి మహిళా సంఘం

Image
( బుద్దభూమి మాస పత్రిక నుండి)( buddhist analysis) భారతదేశంలోతొలి మహిళా సంఘం మహిళా సంఘం పెట్టాలంటే మొదట బుద్దుడు వెనకా ముందాడాడు. ఎందుకంటే, వాళ్ళకు గల భౌతిక ఇబ్బందులుఅవరోధాలవుతాయేమోనని! ఆనందుని వాక్బలంతో, వాదనతోమహా ప్రజాపతి గౌతమి సారధ్యంలో భిక్షుణీ సంఘం స్థాపించాడు. అంతకుముందు ఎవరూ చేయలేదా? ప్రయత్నం కూడా చేయలేదా, మహిళలైనా ముందుకు రాలేదా? వేద కాలంలో స్త్రీలు గార్గి పండిత సభలో స్త్రీల తరుపున వాదిస్తుంటే, మహర్షి (యాజ్ఞవల్కుడు) వారించి, అణచివేస్తాడు. మహర్షికి ఇద్దరు భార్యలు. ఒక భార్య స్వతంత్రించి, జ్ఞానార్జనవైపు మొగ్గి,సన్యాసధర్మంస్వీకరించటానికి అనుమతి కోరుతుంది. ఉపనిషత్కా లంలో కూడా స్త్రీ స్వేచ్ఛకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు లేవు. పురాణకాలంలో స్త్రీలకు పాతివ్రత్యాలు అంటగట్టి, వాళ్ల ముఖాన ఆయాచితంగా వివిధ వ్రతాలు, కాలక్షేప విధులు రుద్దారు. బానిసలుగా మార్చారు. దేవుళ్లకు సైతం పెళ్లాలుగామార్చారు. కృష్ణుడు మాత్రం యాదవ స్త్రీలను మధురలోను, బృందావనంలోను, యమునా తీరాన ఆర్గనైజ్ చేశాడు. ఎందుకు? తను వినోదానికి, అల్లరిచిల్లరి చేష్టలకు. ఆరాధన పేరుతో ఆత్మసంతృప్తికి. వాళ్లకు హక్కులు, అర్హతలు పాడు ఏమీ...

బౌద్ధ, జైనధర్మాల శాంతి,అహింసలే భారతదేశ పతనానికి మూలకారణమా?

Image
        pc: manatelangana బౌద్ధ, జైనధర్మాల శాంతి,అహింస, సమానత్వం మొదలైన వాటితో కూడివున్నవిధానమే భారతదేశపు పతనానికి మూలకారణమని హిందూ మతతత్వవాదులు ఆరోపిస్తూంటారు.ఇది వాస్తవమేనా?                 ఇటువంటి ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చరిత్రలో ఏక్కడా కన్పించడం లేదు. బౌద్ధ, జైన ధర్మాల వారి ఉపదేశాలమీద వాటి పరిణామాలమీద హిందూమతవాదులు చేసిన దోషారోపణలకు ధర్మానంద కోశాంబి తమ గ్రంథాలలో సవివరంగా సమాధానాలిచ్చారు. బుద్ధుని మహాపరినిర్వాణం (క్రీస్తుకు పూర్వం 5-12) తరువాత రెండు శతాబ్దాలకు చంద్రగుప్తుడు తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుడు జైన ధర్మం స్వీకరించాడని చెప్పబడుతున్నది. కాని గ్రీకులను యీ దేశం నుంచి తరిమిచేసే సమయంలో ఆయనను అహింసా ధర్మం నిరోధించలేదే? ఆయన పౌత్రుడు అశోకుడు పూర్తిగా బౌద్ధుడయిన తర్వాత కూడా విశాలమైన సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నాడే! మహమ్మద్ ఇబ్నకాసిమ్ క్రీ.శ.712లో సింధు ప్రాంతం మీద దాడి చేసినప్పుడు పశ్చిమ హిందూ దేశంలో బౌద్ధమతం నామరూపాలులేవు గదా? అక్కడ బ్రాహ్మణ వర్గ ఆధిపత్యం వృద్ధి చెందుతూ వుందిగదా? ఆ స్థితిలో వున్నప...

ఏది చర్య ......ఏది ప్రతిచర్య..!?

Image
బుద్ధుడు ఖచ్చితంగా చెపుతాడు.. నిశ్శబ్దంగా కూర్చోవటం నేర్చుకోమని. అంటే ఎప్పుడూ నిశ్శబ్దంగా కూర్చోమని  కాదు. మీరు సోమరితనంగా వుండమని కాదు.  ఆ నిశ్శబ్దం నుండి మొదలయ్యేదే చర్య అంటాడు.  మీకా నిశ్శబ్దం తెలీకపోతే; ఆ ప్రశాంతత.. నిశ్చలత్వం.. తెలీకపోతే;  మీరేమి చేసినా అది ప్రతిచర్య అవుతుంది. ఎవరో మిమ్మల్ని అవమానిస్తారు.                మీకు కోపమొస్తుంది.  ఎవరో మిమ్మల్ని పొగుడుతారు.            మీకు సంతోష మొస్తుంది.  ఎవరో మిమ్మల్ని కించ పరుస్తారు              మీరందుకు కుంగిపోతారు. అంటే ఎవరో స్విచ్ నొక్కుతారు.             మీరందుకు స్పందిస్తారు.   అంటే.. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు.  బాధ పెట్టగలరు.  మీలో ద్వేషాన్ని రగిలించ గలరు. మిమ్మల్ని పిచ్చివారిని కూడా చేయ గలరన్న మాట.  ఇతరులననుసరించి మీరు స్పందిస్తూ వున్నారంటే,   ఇతరులప్రభావంతో మీ ప్రవర్తన వుందనికదా అర్ధం. ఇదంతా మీ చర్య ఎలా అవు...