బౌద్ధ సూక్తులు




 ఈ ప్రపంచానికి వెలుపల దీనికి ఆధారమైంది, ఆశ్రయం అయింది ,మరొకటి ఏదీ లేదు. ఈ ప్రపంచం సర్వ సమృద్ధం. సర్వ స్వతంత్రం .తనకు తానే ఆధారమైంది. 
                   ___బుద్ధుడు


మనచుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ప్రతిదీ తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. బాలుడు యువకుడు అవుతున్నాడు. యువకుడు వృద్ధుడవుతాడు. ప్రతిదీ ఒక ప్రవాహం. నది  ప్రవహిస్తున్నట్లు ఈ విశ్వం విశాలమవుతుంది.
                  __ బుద్ధుడు

 ప్రతిదీ ఉన్నది ఒక కొస అయితే ప్రతిదీ లేనిది మరొక కొస అవుతుంది .అసలు సత్యం ఏమంటే ఈ రెండు కొసల మధ్యలో ఉంది. 
                       ____బుద్ధుడు

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు