భారతదేశంలోతొలి మహిళా సంఘం
( బుద్దభూమి మాస పత్రిక నుండి)( buddhist analysis)
భారతదేశంలోతొలి మహిళా సంఘం
మహిళా సంఘం పెట్టాలంటే మొదట బుద్దుడు వెనకా ముందాడాడు. ఎందుకంటే, వాళ్ళకు గల భౌతిక ఇబ్బందులుఅవరోధాలవుతాయేమోనని! ఆనందుని వాక్బలంతో, వాదనతోమహా ప్రజాపతి గౌతమి సారధ్యంలో భిక్షుణీ సంఘం స్థాపించాడు.
అంతకుముందు ఎవరూ చేయలేదా? ప్రయత్నం కూడా చేయలేదా, మహిళలైనా ముందుకు రాలేదా? వేద కాలంలో స్త్రీలు గార్గి పండిత సభలో స్త్రీల తరుపున వాదిస్తుంటే, మహర్షి
(యాజ్ఞవల్కుడు) వారించి, అణచివేస్తాడు. మహర్షికి ఇద్దరు భార్యలు. ఒక భార్య స్వతంత్రించి, జ్ఞానార్జనవైపు మొగ్గి,సన్యాసధర్మంస్వీకరించటానికి అనుమతి కోరుతుంది. ఉపనిషత్కా లంలో కూడా స్త్రీ స్వేచ్ఛకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు లేవు. పురాణకాలంలో స్త్రీలకు పాతివ్రత్యాలు అంటగట్టి, వాళ్ల ముఖాన ఆయాచితంగా వివిధ వ్రతాలు, కాలక్షేప విధులు రుద్దారు. బానిసలుగా మార్చారు. దేవుళ్లకు సైతం పెళ్లాలుగామార్చారు. కృష్ణుడు మాత్రం యాదవ స్త్రీలను మధురలోను,
బృందావనంలోను, యమునా తీరాన ఆర్గనైజ్ చేశాడు.
ఎందుకు? తను వినోదానికి, అల్లరిచిల్లరి చేష్టలకు. ఆరాధన పేరుతో ఆత్మసంతృప్తికి. వాళ్లకు హక్కులు, అర్హతలు పాడు ఏమీ లేవు. విలువలు కూడా గౌణమే. 'మాతృదేవోభవ' అని
మాట వరకు మొదటి స్థానం ఇచ్చారు. అది వ్యవహారంలో నెరవేరే మార్గం కూడా లేదు.
దత్తాత్రేయులు గాని, వ్యాసుడు గాని, శంకరాచార్యులు గాని ఒక్క స్త్రీని కూడా శిష్యురాలుగా జేర్చుకోలేదు. సరికదా,క్షత్రియ స్త్రీలకు సంతానోత్పత్తి కలిగించడానికి వ్యాసులుపూనుకున్నాడు. ఇది పూర్వీక పెద్దలకు, చిన్నలకు స్త్రీల పట్ల ఏర్పడిన దృక్పథం.
చరిత్రలో స్త్రీలపట్ల ఉద్ధరణ గురించి, సమత్వం గురించి మొట్టమొదటిగా ఆలోచించింది బుద్ధుడే.
స్త్రీలకు ధార్మికంగానూ, సామాజికంగాను
ఒక ఆర్గనైజేషన్ ద్వారా, సామూహికమైన సమతను, అర్హతను చేకూర్చడంతో బుద్ధుడు గొప్ప దార్శనికుడైనాడు.
బౌద్ధ శిక్షణలో అర్హతులు, క్రియాశీలురు,
విదుషీమణులుగా తయారైన మహిళ లెందరో వున్నారు.తదుపరి కేరళలో శ్రీనారాయణగురు ద్వారా స్త్రీలకు ఆధ్యాత్మికంగా స్వేచ్ఛ, అర్హత లభించింది. స్త్రీలు సంఘటితమయ్యే మార్గాలు ఏర్పడ్డాయి. గుళ్ళూ గోపురాలలో ప్రవేశించటానికి, సన్యాస స్వీకరణకు స్వచ్ఛందమైన అధికారం
పొందారు. స్త్రీల విద్యార్జనకు, విద్యాబోధనకు మహారాష్ట్ర పూలే- సావిత్రీబాయి దంపతులు బహుళ ప్రచారం కావించారు.
స్వాతంత్ర్య సమరంలో భాగంగా గాంధీ మహాత్ముడు మహిళా స్వేచ్ఛకు అవరోధమైన బంధనాలను తెగతెంపులు జేశాడు.
ఇదొక మహిళా మహోద్యమంగా భావించాలి.
స్త్రీల సంపూర్ణ వికాసానికి, సమానతా హక్కులకు,
సామాజిక విలువలకు అన్ని రంగాలలో స్వేచ్ఛగా పాలు పంచుకొనుటకు డా||బి. ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ రీత్యా కల్పించిన ప్రజాస్వామ్య సూత్రాలు మహిళాభ్యుదయానికి ఆధునిక యుగంలో మూలస్థంభాలు. బుద్ధునితో మొదలైన మహిళా మహోద్యమం అంబేడ్కర్ తో పరిపూర్ణమైందని అనవచ్చు. ఈనాడు ప్రపంచ ఆర్గనైజేషన్ అయిన ఐక్యరాజ్యసమితి ద్వారా మహిళా దినోత్సవ మేర్పడటం మహా హర్షదాయకం.
-జె.యస్. రఘుపతిరావు
94416 34533
Comments
Post a Comment