వజ్రయానం

 

               ఆంధ్రదేశంలో బౌద్దానికి చివరి దశ వజ్రయానం. దీనినే మంత్రయానం , తాంత్రిక బౌద్దం అనీ అంటారు.మహాయాన సిద్దాంతాల విశ్వాసాల సహజపరిణామమే వజ్రయానం.బౌద్దంలో ఉపాసకుల ప్రాబల్యం పెరగడంతోనూ,ఇతర సంప్రదాయ ప్రభావాల వల్ల తాంత్రిక ఆలోచనలు దిగుమతి అయ్యాయని ఎడ్వర్డ్ కాంజే అభిప్రాయం. 
         వాస్తవానికి 7-12 శతాబ్దాల మధ్య కాలంలో భారతదేశంలో  జైనం, శైవం, వైష్ణవం లలో కూడా తాంత్రిక పూజా విధానాలు ప్రవేశించాయి.
            బెంగాల్, అస్సాం ప్రాంతాలు తాంత్రిక విద్యలకు జన్మభూములు.తూర్పు భారతంలో వజ్రయానం అధికమని టిబెటన్ గ్రంధాలు తెలిపాయి. బీహార్లో తాంత్రిక విద్యకు విక్రమశిల విశ్వ విద్యాలయం  పట్టుగొమ్మ అయింది.
           
        చైత్యకులు బౌద్దంలో ధూపదీప గంధాదులతో పూజా విధానం ప్రవేశపెట్టారు. గణరాజ్య ప్రజల ముద్రల ప్రభావం భక్తి మతం లోని మంత్రాల ప్రభావం వలన మహాయానం అంకురించి పరిణామం చెందింది.దీనికి తోడు పాలకులు వీటికి ఎక్కువగా ఆకర్షితులయ్యారు.
           ధ్యాన బుద్దులయిన పంచవీర బుద్దులు, మంజుశ్రీ, మరీచి,  అవలోకితేశ్వర,రత్నసంభవ లాంటి వజ్రయాన విగ్రహాలు శాలిహుండంలో లభించాయి.
         ఇవన్నీ బ్రాహ్మణ మతం లో కూడా ఉన్నాయి. దీంతో రెండింటికి తేడా లేక పోవడం వల్ల బౌద్ధం క్రమ క్రమంగా పతనమైంది.
          అందుకే అంబేడ్కర్    హేతుబద్ధత గల బౌద్దాన్ని , పంచశీలాచరణ గల బౌద్దాన్ని ఆచరిద్దాం అన్నాడు.

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు