బౌద్ధ ధర్మ సాహిత్యం_ త్రిపీటకాలు
*బౌద్ధ ధర్మ సాహిత్యం_ త్రిపీటకాలు*
బౌద్ధ ధర్మ సాహిత్యం పాళీ, మాగధి, ప్రాకృత భాషల్లో ఉంది.
-పాళీ భాషలో రాసిన దమ్మ గ్రంథాల్లో ముఖ్యమైనవి త్రిపీటకాలు.
-త్రిపీటక అంటే మూడు గంపలు అని అర్థం. అంటే మూడు భాగాలని అర్థం. అవి...
1. సుత్త 2. వినయ 3. అభిదమ్మ పీటకలు
-పిటక అనగా పెట్టె అని అర్థం. బుద్ధుని మరణానంతరం అతని బోధనలు మూడు పెట్టెలలో సేకరించారు. వీటినే త్రిపీటకాలు అంటారు.
1)సుత్తపిటక
-బుద్ధుని శిష్యుడైన ఆనందుడు సంకలనం చేశాడు.
-బుద్ధుడి బోధనలను వివరిస్తుంది.
-ఈ పీఠికలో ఐదు భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క విభాగాన్ని నికాయ అని పిలుస్తారు. ఈ భాగాల్లో బుద్ధుడి ఉపదేశాలు పరస్పర సంవాద రూపంలో ఉపన్యాస రూపంలో ఉన్నాయి.
1. దీఘ నికాయ
2. మజ్జిమ నికాయ
3. సంయుత్త నికాయ
4. అంగుత్తర నికాయ
5. ఖుద్ధక నికాయ
-అంగుత్తరనికాయలో మొదటిసారిగా 16 మహాజనపదాల గురించి పేర్కొన్నారు.
2. వినయ పిటక
-బుద్ధుడి శిష్యుడైన ఉపాలి సంకలనం చేశాడు.
-బుద్ధుడి సంఘ నియమ నిబంధనలను వివరిస్తుంది.
-ఈ పీఠికలో నాలుగు భాగాలు ఉన్నాయి. క్రమశిక్షణ, నియమాలను ఉల్లంఘించడం వల్ల కలిగే పరిణామాలను ఈ పీఠికలో వివరించారు.
3. అభిదమ్మ పిటక
-బుద్ధుడి దమ్మాలను వివరిస్తుంది.
-ఈ పీటకంలో ఏడు భాగాలు ఉన్నాయి.
-ప్రాచీనకాలంలో చెప్పిన దమ్మాన్ని విపులంగా ఈ పిటకలో పేర్కొన్నారు.
-ఏడు విభాగాలను ప్రథమ బౌద్ధ సంగీతిలో ఒకచోట సంకలనం చేశారు. ఈ విభాగాలు థేరవాద సిద్ధాంతాలను వివరిస్తాయి.
Comments
Post a Comment