బౌద్ధ ధర్మ సాహిత్యం_ జాతక కథలు:


జాతక కథలు:

-జాతక కథలను క్రీ.శ. 300 నుంచి క్రీ.శ. 400 మధ్య కాలంలో రచించినట్లు తెలుస్తుంది.
-జాతక కథల్లో చాలా వరకు నీతి కథలే ఉన్నాయి.
-ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, గోలి, నాగార్జునకొండలోని శిల్పఖండాల్లో జాతక కథలు చూడవచ్చు.
-అజంతాలో కొన్ని జాతక కథలు చూడవచ్చు.
-1వ గుహలో మహాజనక జాతకం, 17వ గుహలో మహాహంస, మాతృ పోషక జాతకాల్లోని కొన్ని దృశ్యాలు చెక్కి ఉన్నాయి.
-అమరావతిలో మిత్ర విందకుని కథ, నలగిరిగజ దర్శనం, బుద్ధుడు శ్వేత రూపంలో అవతరించిన కథలు చెక్కి ఉన్నాయి.
-అజంతా గుహల్లోని 1వ గుహలో స్నాన, అంతఃపుర దృశ్యాలు, 16, 17వ గుహల్లో బుద్ధుడి ఉపదేశం, 19వ గుహలో బుద్ధుడి ఎదుట మాతాశిశువులు గల దృశ్యం, 26వ గుహలో బుద్ధుడి మహాపరినిర్యాణం చెక్కి ఉన్నాయి.

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు