బుద్ధుడి బోధనలు:


బుద్ధుడి బోధనలు:

బుద్ధుడు బోధించిన పంచశీల :
1 జీవహింస చేయకపోవడం 

2. దొంగతనము చేయకపోవడం 

3. వ్యభిచరించక పోవడం 

4. అసత్యం చెప్పకపోవడం 

5. మత్తు పదార్థాలను, మద్యాన్ని సేవించకపోవడం. 


బుద్ధుడు నాలుగు సత్యాలను ప్రవచించాడు. వీటినే ఆర్యసత్యాలు అంటారు.
1. మనిషికి దు:ఖం ఉంది.
2 దుఃఖానికి కారణం ఉంది
3. దుఃఖ నివారణ ఉంది.
4 దుఃఖ నివారణ మార్గం ఉంది.

 బుద్ధుడు దుఃఖాలను తొలిగించడానికి అష్టాంగ మార్గాన్ని సూచించాడు.

 అష్టాంగ మార్గం

బుద్ధుడు నీతిని బోధించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకవైపు ప్రపంచ సుఖాల్లో నిమగ్నం కావడం, మరోవైపు మితిమీరిన ఉపవాసాలు చేసి శరీరాన్ని శుష్కించడం రెండూ నిష్ప్రయోజనమే. ఈ రెండు విపరీత ప్రవృత్తులకు మధ్య మార్గం అష్టాంగ మార్గం. దుఃఖానికి అజ్ఞానం కారణం. అజ్ఞానాన్ని తొలిగించేందుకు ఈ మార్గాన్ని అనుసరించాలి.
1. సమ్యక్ దృష్టి 
2. సమ్యక్ సంకల్పం
 3. సమ్యక్ వాక్కు 
4. సమ్యక్ కర్మ
 5. సమ్యక్ జీవనం 
6. సమ్యక్ వ్యాయామం 
7. సమ్యక్ స్మృతి
 8. సమ్యక్ సమాధి

ధర్మ చక్రం లోని 8 ఆకులు అష్టాంగ మార్గానికి ప్రతీకలు

అష్టాంగ మార్గం మూడు విభాగాలు 

1.శీలము (భౌతికమైన చర్యలు),
2. సమాధి(మనస్సును లగ్నం చేయడం, ధ్యానం), 
3.ప్రజ్ఞ (అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)

1.శీలము - మాటల ద్వారా, చేతల ద్వారా చెడును కలుగనీయకుండడం. 
ఇందులో మూడు భాగాలున్నాయి:

"సమ్యక్ వచనం" - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం

"సమ్యక్ కర్మ" - హాని కలిగించే పనులు చేయకుండుట

"సమ్యక్ జీవనం" - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం

2.సమాధి - మనసును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి.

"సమ్యక్ సాధన" - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట

"సమ్యక్ స్మృతి" - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం

"సమ్యక్ సమాధి" - రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం

3.ప్రజ్ఞ - మనసును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.

"సమ్యక్ దృష్టి" - అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం

"సమ్యక్ సంకల్పం" - ఆలోచించే విధానంలో మార్పు

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు