Posts

రాగద్వేషాలను అధిగమించకుండా మనుషుల్లో సమిష్టితత్వం పెరగదు

రాగద్వేషాలను అధిగమించకుండా మనుషుల్లో సమిష్టితత్వం పెరగదు                     బాలగోపాల్ మార్క్సిస్టు సిద్ధాంతానికి అదనపు చేర్పుగా ఫ్రాయిడ్ మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాన్ని జోడించాలని ప్రతిపాదించాడు తన 'మనిషి మార్క్సిజం' వ్యాసంలో. మానవ ప్రవృత్తికి బయట ప్రపంచానికి మధ్యనున్న ఘర్షణకు ఫ్రాయిడ్ మనస్తత్వశాస్త్ర సిద్ధాంతంలో కేంద్ర స్థానం ఉంది. మనిషి వ్యక్తిత్వ వికాసానికి వైఫల్యానికి ఈ ఘర్షణే మూలమని ఫ్రాయిడ్ అభిప్రాయం. సమాజిక వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడల్లా మనిషి ప్రవర్తనలో కూడా దానికి తగినట్లుగా మార్పు అనివార్యంగా వస్తుందని , దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించనవసరం లేదని గతితార్కిక భౌతిక వాదం చెప్తుందని, ఇది నిజం కాదని బాలగోపాల్ వాదిస్తాడు. దీన్ని సాహిత్యకారులు తప్పకుండా గుర్తించి ఉంటారని ఆయన భావిస్తాడు. రాగో నవల మీద వ్యాఖ్యానిస్తూ ఈ విషయాలను చెప్తాడు ప్రస్తావించాడు.      రాగో స్త్రీలను స్త్రీల వ్యక్తిత్వాలను కించపరిచే ఆచారాలు పట్ల వ్యతిరేకంగా తమకు అందుబాటులో ఉన్న ఉద్యమాలకు వస్తుంది. ఆ ఉద్యమాలు పరిమితమైనవి. కానీ ఆ ఉద్యమాల లక్ష్...

చరిత్రలో ఆంధ్రులు

చరిత్రలో ఆంధ్రులు         సంస్కృత రచనలు ముఖ్యంగా ఐతరేయ బ్రాహ్మణంలో ( క్రీస్తుపూర్వం 1000 _800) "ఆంధ్రులు " అనే ప్రజల గురించి ప్రస్తావనలు కలిగి ఉన్నా, ఈ ఆంధ్రుల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు మాత్రం మౌర్యుల కాలం నుంచి లభిస్తున్నాయి.         ఉత్తర భారతాన్ని క్రీస్తుపూర్వం 4వ శతాబ్దాంతం నుండి 2వ శతాబ్ద ఆరంభం వరకు పరిపాలించిన మౌర్య రాజవంశం కాలానికే ఆంధ్రుల గురించి చరిత్రలో ఖచ్చితమైన ఆధారాలు లభించాయి. మౌర్య చక్రవర్తి అశోకుడు ( క్రీస్తుపూర్వం 265–238) దక్షిణ భారతంలోని ఆంధ్రుల వద్దకు బౌద్ధ మిషనరీలను పంపించాడు.అశోకుని శిలాశాసనాల్లో (ఖారవేల శాసనం, గిర్నార్ శాసనం, ఆంధ్ర ప్రాంతం పై ఉన్న శాసనాలు) "ఆంధ్ర" అనే పేరుతో ప్రజలు లేదా జనపదాల ప్రస్తావన ఉంది.అశోకుని 13వ శాసనంలో దక్షిణ భారతదేశం వైపు బౌద్ధ మిషనరీలను పంపినట్టు రాశారు.        సుమారు క్రీస్తుశకం 1వ శతాబ్దంలో ఆంధ్ర వంశాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శాతవాహనులు (లేదా శాతకర్ణులు) అధికారం చేపట్టారు. మొదటి ముఖ్య రాజు సిముక శాతవాహనుడు. వారు దాదాపు మొత్తం డెక్కన్ పీఠభూమిని పరిపాలించడమే కా...

అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే జ్ఞానం

అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే జ్ఞానం (పిళ్లా కుమారస్వామి)          బుద్ధుని కాలంలో కాలములనే తెగ ఉండేది.వారితో బుద్ధుడు ఒకసారి సంభాషిస్తారు. ఆ సందర్భంలో బుద్ధుడు వారికి జ్ఞానానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. వాటిని ‘కాలామ సుత్తం’ పేరుతో పీకాక్ క్లాసిక్ వారు డి.చంద్రశేఖర్ రాసిన చిన్నపుస్తకాన్ని ప్రచురించారు. ఈ కాలామ సుత్తం అంగుత్తనికాయంలో ఉంది. బుద్ధుడు కాలాములతో చెప్పిన విషయాలను బౌద్ధంలో జ్ఞానసిద్ధాంతంగా పరిగణిస్తారు.         వైదికమతం వేదాన్ని జ్ఞానానికి ప్రమాణంగా భావిస్తుంది. దేవునిపై వుండే భయభక్తులే జ్ఞానానికి తొలి అడుగని బైబిలు చెపుతుంది. అలాగే అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే సరైన జ్ఞానమని కాలాములతో బుద్ధుడు చెప్పిన ఉపదేశాలే బౌద్ధంలో జ్ఞాన సిద్ధాంతమని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మహాభారతంలో యక్ష ప్రశ్నలున్నాయి. అందులో యక్షుడు ధర్మరాజుతో జ్ఞానమెలా వస్తుందని అడుగుతాడు.పండితుల సాంగత్యంతో జ్ఞానమొస్తుందని ధర్మరాజు చెపుతాడు. దీన్నే ఇప్పటికీ చాలా మంది ఆచరణయోగ్యంగా, సరైందిగా భావిస్తుంటారు. మరికొంత మందైతే ...

జ్ఞాన దీపం

అదిగదిగో ప్రపంచానికి మార్గదర్శకుడు ఒకనాటి రాజకుమారుడు. భువిపై వెలసిన సిద్ధార్థుడు  అతడే బుద్ధుడు ఇవే అతని అడుగు జాడలు స్వర్గ నరకాలను సమంగా చూసినవారు నిర్వాణ మార్గాలను‌ బోధించినవాడు అందరి హృదయాలలో నిలిచినవాడు జ్ఞానానికి శిఖరమతడు అతను మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు మానవాళి చీకట్లను చీల్చి వేయడానికి  ఆకాశాన హరివిల్లు పైన నర్తించే దేవతలు విరిసే పూల రేణువుల జలపాతాల పై తేలియాడే 

రాహుల్ సాంకృత్యాయన్ – బౌద్ధంలో చేసిన కృషి

రాహుల్ సాంకృత్యాయన్ – బౌద్ధంలో చేసిన కృషి        సాంకృత్యాయన్ చేసిన బౌద్ధ సంబంధ కృషి భారతీయ మానవవాద చరిత్రలో అమూల్యమైనదిగా నిలిచింది. 20వ శతాబ్దంలో బౌద్ధ తత్త్వానికి మళ్లీ స్పూర్తినిచ్చిన వ్యక్తిగా ఆయన పేరొందిన రాహుల్ 1893 ఏప్రిల్ 9 న జన్మించాడు.          రాహుల్ సాంకృత్యాయన్ వేదాంతం, హిందూ ధర్మశాస్త్రాలను, క్రైస్తవం,ఇస్లాం, బౌద్ధం వంటి అనేక మతాలను అధ్యయనం చేసినాడు. బుద్ధుని బోధనలు ఆయన్ను విపరీతంగా ప్రభావితం చేశాయి. ఆయనకు బౌద్ధతాత్త్వికత సమాజ మార్పుకు ఆచరణాత్మక సాధనగా ఉపయోగపడుతుందని భావించాడు. దాంతో ఆయన జీవితంలో బౌద్ధం ప్రధాన ఒక కరదీపికగా మారింది.         1920లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో చదువుతున్న సమయంలో ఆయన రుగ్వేదం, ఉపనిషత్తులు, శంకరాచార్య తత్వాన్ని అధ్యయనం చేశారు. తరువాత బౌద్ధ తత్త్వాన్ని అధ్యాయాన్ని చేశారు. బౌద్ధం లోని అనిత్య, దుఃఖం, అనాత్మ వంటి మౌలిక సిద్ధాంతాలు ఆయనను ఆకట్టుకున్నాయి. 1929–30లో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి 'రాహుల్' అనే పేరు పెట్టుకున్నాడు (బుద్ధుని కుమారుని పేరు ఆధారంగా). సాంకృత్యాయన్ ...

భావ వైరుధ్యం ఉన్న వారు కలసి పని చేయడం సాధ్యమే కాదు

బౌద్ధ ఉద్యమంలో... భావ వైరుధ్యం ఉన్న వారు కలసి పని చేయడం సాధ్యమే కాదు, అది ఉద్యమంగా కొనసాగడం అసాధ్యం. ఉద్యమానికి దిశ ఉండాలి. దానికి బుద్ధుని ధమ్మమే మార్గం కావాలి. భావాల్లో స్పష్టత ఉండాలి — అభిప్రాయాల్లో, దృక్పథంలో స్పష్టత. వికాసం కోసం, సమాజ మార్పు కోసం, ఏకత్వానికీ, ఏకాగ్రతకీ అవసరం ఉంది. బౌద్ధ ఉద్యమం అనేది వ్యక్తిగత విముక్తిని కాదు, సామూహిక చైతన్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. అందుకే,  మన మార్గం స్పష్టంగా – ధమ్మానికి అనుగుణంగా, మన లక్ష్యం స్పష్టంగా – దుఃఖ విముక్తి సాధనగా ఉండాలి.
బుద్ధుని బోధనలలోని "అద్దత్తాదాన వేరమణీ" (ఇవ్వబడనిది తీసుకోకూడదు) అనే శీలాన్ని బోధించే మరొక ప్రసిద్ధ జాతక కథ ఉంది — అది కుహక జాతకం (Kuhaka Jātaka – Jātaka No. 89). ధర్మాన్ని పాటించకపోతే ఎవరికైనా నష్టం కలగవచ్చు. మనం నిజాయితీగా ఉండాలి. అవాంఛనీయంగా, బలవంతంగా లేదా మోసం ద్వారా మనకు చెందనివాటిని తీసుకోవడమంటే దొంగతనం. ఇది కేవలం చేతులతో చేసే దొంగతనం మాత్రమే కాదు – మోసం చేయడం, కపటం చేయడం, దురుద్దేశంతో ఉపయోగించుకోవడం అన్నీ కూడా అద్దత్తాదానమే. రాహుల్ అనే విద్యార్థి ఉన్నాడు. అతను చదువులో బాగానే ఉన్నాడు. కానీ పరీక్షల సమయంలో అతని ఫ్రెండ్స్ కొంతమంది చీటింగ్ చేయడాన్ని సహజంగా చూస్తున్నారు. వారు మొబైల్ లో నోట్స్ చూసి, కాపీ కొట్టి ఉత్తీర్ణులవుతున్నారు.  రాహుల్‌కు కూడా ఆ ప్రయత్నం చేయమని చెప్పారు. అతను కొంతసేపు ఆలోచించాడు. అప్పుడు తను చదివిన ఒక జాతక కథ గుర్తొచ్చింది — వెలుకంటక తపస్వి ఎంత సత్యవంతంగా, ధర్మపరంగా జీవించాడో, ఎలా దొంగతనాన్ని నాకొద్దని నిరాకరించాడో గుర్తుకొచ్చింది. రాహుల్ తన మనసులో చెప్పుకున్నాడు: "ఈ మార్కులు నాకు ఇవ్వబడతే నా సొంతం, కానీ మోసం చేసి సంపాదిస్తే అవి నా విజయాన్ని కాక, నా...