రాహుల్ సాంకృత్యాయన్ – బౌద్ధంలో చేసిన కృషి
రాహుల్ సాంకృత్యాయన్ – బౌద్ధంలో చేసిన కృషి
సాంకృత్యాయన్ చేసిన బౌద్ధ సంబంధ కృషి భారతీయ మానవవాద చరిత్రలో అమూల్యమైనదిగా నిలిచింది. 20వ శతాబ్దంలో బౌద్ధ తత్త్వానికి మళ్లీ స్పూర్తినిచ్చిన వ్యక్తిగా ఆయన పేరొందిన రాహుల్ 1893 ఏప్రిల్ 9 న జన్మించాడు.
రాహుల్ సాంకృత్యాయన్ వేదాంతం, హిందూ ధర్మశాస్త్రాలను, క్రైస్తవం,ఇస్లాం, బౌద్ధం వంటి అనేక మతాలను అధ్యయనం చేసినాడు. బుద్ధుని బోధనలు ఆయన్ను విపరీతంగా ప్రభావితం చేశాయి. ఆయనకు బౌద్ధతాత్త్వికత సమాజ మార్పుకు ఆచరణాత్మక సాధనగా ఉపయోగపడుతుందని భావించాడు. దాంతో ఆయన జీవితంలో బౌద్ధం ప్రధాన ఒక కరదీపికగా మారింది.
1920లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో చదువుతున్న సమయంలో ఆయన రుగ్వేదం, ఉపనిషత్తులు, శంకరాచార్య తత్వాన్ని అధ్యయనం చేశారు. తరువాత బౌద్ధ తత్త్వాన్ని అధ్యాయాన్ని చేశారు. బౌద్ధం లోని అనిత్య, దుఃఖం, అనాత్మ వంటి మౌలిక సిద్ధాంతాలు ఆయనను ఆకట్టుకున్నాయి. 1929–30లో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి 'రాహుల్' అనే పేరు పెట్టుకున్నాడు (బుద్ధుని కుమారుని పేరు ఆధారంగా). సాంకృత్యాయన్ అన్నది వారి కుటుంబ గోత్రనామం. రెండింటిని కలిపి రాహుల్ సాంకృత్యాయన్ అనే పేరు ను స్థిర పరుచుకున్నాడు.
బౌద్ధ గ్రంథాల కోసం రాహుల్ 1930లోలాహోర్, లడఖ్ మీదుగా టిబెట్ లోని లాసా చేరుకున్నారు.
అక్కడ 200 కి పైగా అపురూపమైన టిబెటన్ గ్రంథాలను సేకరించారు.1938 లో మరోసారి పాళీ, సంస్కృత భాషలో ఉన్న బౌద్ధ గ్రంథాలను తీసుకొచ్చారు.ఈ గ్రంథాలను ఆయన నాలందా, నేపాల్, టిబెట్ మొదలైన వెదికాడు. ఆయన్ని "బౌద్ధ గ్రంథాల సేకరణ కర్త"గా పేరొందాడు.
రాహుల్‌జీ "Tibbat Mein Sava Varsh" (టిబెట్‌లో పదకొండు నెలలు) అనే పుస్తకం 1939లో రాశాడు. ఇందులో ఆయన టిబెట్‌లో తన అనుభవాలను, బౌద్ధ ఆరామాల స్థితిగతులను, గ్రంథాల విలువను చర్చించారు. ఆయన 1940లలో భారతదేశంలో బౌద్ధం ను పునఃప్రచారం చేసే కృషికి పూనుకున్నారు.
అతను సనాతన ధర్మం పేరిట జరిగే ఆచార వ్యవహారాలను, కుల వ్యవస్థను, మూఢనమ్మకాలను తీవ్రంగా విమర్శించాడు. ఎలాంటి భావజాల బంధానికి లోనుకాకుండా స్వేచ్ఛగా ఆలోచించడం ఆయన ప్రత్యేకత. తన జీవిత ప్రయాణంలోని వివిధ కోణాలను వివరిస్తూ, మజ్జిమ నికాయ(బుద్దుని ఉపన్యాసాలు)లో బుద్ధుని చెప్పిన దాన్ని ఉటంకిస్తూ, "ఒక పెద్దవాడిలా, నేను మీకు నేర్పించాను , జ్ఞానం తలపై మోయడం కాదు. జ్ఞానం నావ లాగా ఉపయోగం పొడి అవతలి ఒడ్డుకు చేరాలి"అని అన్నాడు.
బౌద్ధమతం భారతదేశంలో క్షీణించి బ్రాహ్మణమతం(హిందూ మతం) అభివృద్ధి చెందిన నేపథ్యంలో, ఆయన తన రచనల ద్వారా బుద్ధుని ధర్మాన్ని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
భారతీయుల ఐక్యత మతాల కలయికపై ఆధారపడి ఉండదన్నారు . కాకిని కడిగి హంసగా మార్చలేము. కమలాన్ని కడిగి రంగు వేయలేరు. మతాల రోగం సహజం. వాటికి మరణం తప్ప చికిత్స లేదన్నాడు.
రాహుల్‌జీ, బుద్ధుని బోధనలలోని సమత,మమత, వివేకం, శ్రమణ సంప్రదాయం సామాజిక సమానత్వానికి, సామాజిక న్యాయానికి మార్గంగా ఉందని భావించారు. బుద్ధుని బోధన బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య భావజాలాన్ని బలపరుస్తుందని గుర్తించారు.
బౌద్ధం అంటే కేవలం మతం కాదని, అది ఒక ఆచరణాత్మక తత్వశాస్త్రమని ఆయన పేర్కొన్నారు. ఇది అణగారిన వర్గాలకు ఒక విముక్తి మార్గం అని గాఢంగా నమ్మారు.
1930ల చివరలో రాహుల్‌జీ మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నారు. బౌద్ధ తాత్వికతను మార్క్సిజాన్ని మానవవాద కోణంలో అనుసంధానం చేశారు. రెండు సిద్ధాంతాలూ మనుషుల దుఃఖాలకు కారణమైన దోపిడీకి వ్యతిరేకంగా ఉండటం ఆయనను ఆకట్టుకుంది.
బౌద్ధ సంబంధ అనేక రచనలు చేశారు సాంకృత్యాయన్.చరిత్రాత్మక ఆధారాలతో బుద్ధుని జీవిత విశ్లేషణను బుద్ధ చరిత(Buddha Charita)లో వివరించాడు.దిగ్దర్శన్ (Darshan-Digdarshan) లో భారతీయ తత్వ చరిత్రలో బౌద్ధ తాత్త్వికత ప్రాముఖ్యత ను విశదీకరించారు. మేరీ జీవన్ యాత్ర లో ("Meri Jeevan Yatra" ) తన జీవితంలో బౌద్ధ తత్త్వ ప్రభావాన్ని విపులంగా చర్చించారు. ఓల్గా సే గంగా లో (From Volga to Ganga)లో భారతదేశ మేధోచరిత్రలో బౌద్ధ ప్రభావాన్ని వివరించారు.
1940లలో రాహుల్‌జీ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. బుద్ధుని అహింస, శాంతి, సామాజిక సమానత్వ బోధనలను ఉద్యమంలోకి తీసుకురావాలని ప్రయత్నించారు. బుద్ధుని సందేశం ఒక స్వతంత్ర, సమానతా ధర్మరాజ్యానికి ఆదర్శంగా ఉంటుందని ఆయన విశ్వాసం.
చరిత్రకారుడిగా, తత్త్వవేత్తగా, యాత్రికుడిగా ఆయన జీవితం భారతదేశ చరిత్ర లో ఒక చెరగని ముద్ర వేసింది. బుద్ధుని ధర్మాన్ని ప్రగతిశీల దృక్పథంలో మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చిన ఆయన జీవితం1963 ఏప్రిల్ 14న అంతిమ శ్వాస విడిచింది. ఆయన పరిశోధనల వెలుగుల దీపం ఈనాటి సమాజానికి కూడా మార్గదర్శకంగా ఉంది.
మూలాధారాలు (References):
1. Sankrityayan, Rahul
Meri Jeevan Yatra (Vol. 1–4), Hindi, Kitab Mahal, Allahabad.
– రాహుల్ స్వీయచరిత్రలో టిబెట్ యాత్రలు, బౌద్ధ ధర్మం పట్ల తాను పొందిన అనుభవాలు విశదీకరించబడ్డాయి.
2. Sankrityayan, Rahul
Tibbat Mein Sava Varsh (टिब्बत में सवा वर्ष), Hindi, 1939, Kitab Mahal.
– టిబెట్‌లో బౌద్ధ గ్రంథాల అన్వేషణలపై ప్రత్యక్ష అనుభవ కథనం.
3. Sankrityayan, Rahul
Buddha Charita – బుద్ధుని జీవిత చరిత్రపై రాసిన రచన.
4. Sankrityayan, Rahul
Darshan-Digdarshan (दर्शन-दीग्दर्शन), Hindi – భారతీయ తత్త్వ చరిత్రలో బౌద్ధ తత్త్వానికి ఇచ్చిన స్థానం.
5. Lokesh Chandra
Materials for a History of Tibetan Literature, International Academy of Indian Culture.
– రాహుల్ సాంకృత్యాయన్ రచించిన గ్రంథాలపై పరిశోధన.
6. D.C. Ahir
The Legacy of Dr. B.R. Ambedkar, B.R. Publishing Corporation.
– రాహుల్ సాంకృత్యాయన్, అంబేద్కర్ బౌద్ధతత్త్వాలపై తులనాత్మక దృష్టి.
7. David N. Lorenzen
Who Invented Hinduism? Essays on Religion in History, Yoda Press, New Delhi.
– శ్రమణ సంప్రదాయం, బౌద్ధం, హిందూ మతాల చరిత్రాత్మక పుంజీకరణ.
8. Om Prakash
Cultural History of India, New Age International Publishers.
– బౌద్ధ ధర్మ పునరుద్ధరణలో 20వ శతాబ్దపు పాత్రలు.
9. Devdutt Pattanaik
The Book of Ram, Penguin India.
(బ్రాహ్మణీయ ధర్మంపై విమర్శలలో బౌద్ధ ప్రభావం)
10. Romila Thapar
Early India: From the Origins to AD 1300, Penguin Books.
– బౌద్ధ ధర్మ ఉన్నతి, క్షీణత, పునరుద్ధరణపై చరిత్రాత్మక విశ్లేషణ.
National Archives of India – Tibetan Manuscripts Collection
Bhandarkar Oriental Research Institute – Pali & Sanskrit Buddhist Texts
Internet Archive – Free PDFs of Sankrityayan's works
Sahapedia.org – Indian Philosophical Traditions
Comments
Post a Comment