చరిత్రలో ఆంధ్రులు
చరిత్రలో ఆంధ్రులు
సంస్కృత రచనలు ముఖ్యంగా ఐతరేయ బ్రాహ్మణంలో ( క్రీస్తుపూర్వం 1000 _800) "ఆంధ్రులు " అనే ప్రజల గురించి ప్రస్తావనలు కలిగి ఉన్నా, ఈ ఆంధ్రుల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు మాత్రం మౌర్యుల కాలం నుంచి లభిస్తున్నాయి.
ఉత్తర భారతాన్ని క్రీస్తుపూర్వం 4వ శతాబ్దాంతం నుండి 2వ శతాబ్ద ఆరంభం వరకు పరిపాలించిన మౌర్య రాజవంశం కాలానికే ఆంధ్రుల గురించి చరిత్రలో ఖచ్చితమైన ఆధారాలు లభించాయి. మౌర్య చక్రవర్తి అశోకుడు ( క్రీస్తుపూర్వం 265–238) దక్షిణ భారతంలోని ఆంధ్రుల వద్దకు బౌద్ధ మిషనరీలను పంపించాడు.అశోకుని శిలాశాసనాల్లో (ఖారవేల శాసనం, గిర్నార్ శాసనం, ఆంధ్ర ప్రాంతం పై ఉన్న శాసనాలు) "ఆంధ్ర" అనే పేరుతో ప్రజలు లేదా జనపదాల ప్రస్తావన ఉంది.అశోకుని 13వ శాసనంలో దక్షిణ భారతదేశం వైపు బౌద్ధ మిషనరీలను పంపినట్టు రాశారు.
సుమారు క్రీస్తుశకం 1వ శతాబ్దంలో ఆంధ్ర వంశాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శాతవాహనులు (లేదా శాతకర్ణులు) అధికారం చేపట్టారు. మొదటి ముఖ్య రాజు సిముక శాతవాహనుడు.
వారు దాదాపు మొత్తం డెక్కన్ పీఠభూమిని పరిపాలించడమే కాకుండా, రోమ్ నగరంతో వాణిజ్య సంబంధాలను స్థాపించారు. వారు వివిధ మతాలను ఆదరించారు. అలాగే గొప్ప నిర్మాణకారులుగా కూడా ప్రసిద్ధి చెందారు.వారి ప్రధాన నగరమైన అమరావతి. అమరావతి బౌద్ధ మహాచైత్య శిల్పకళా శైలి శాతవాహనుల కాలంలో అభివృద్ధి చెందింది.
ఇది అమరావతి శిల్పశైలికి ప్రారంభం అని భావిస్తారు. అంతకుముందు గాంధార శిల్పకళ ఉండేది. దక్కన్‌లోని అజంతా గుహలలోని ప్రఖ్యాత చిత్రాలలో కొంత భాగాన్ని ఆ కాలంలోని ఆంధ్రుల చిత్రకారులకు సంబంధించినవిగా నిపుణులు చెబుతున్నారు.
బౌద్ధమతం ఆంధ్రుల పాలనలో బాగా వృద్ధి చెందింది. వారి రాజధానిలో ప్రాచీన కాలంలో బౌద్ధ విశ్వవిద్యాలయం బాగా ప్రఖ్యాతి గాంచింది. మహాయాన బౌద్ధమత పితామహుడిగా పరిగణించబడే నాగార్జునుడు (సుమారు క్రీస్తుశకం 150–250) అక్కడే ఆచార్యుడుగా ఉండి బోధించాడు. ఆ విశ్వవిద్యాలయం అవశేషాలు నేటికీ నాగార్జునకొండలో దాని ప్రాచీన కీర్తిని ప్రతిబింబిస్తున్నాయి.
____ పిళ్లా కుమారస్వామి రెడ్డి
9059054756
Reference : britannica.com
Comments
Post a Comment