Posts

ప్రాచీన బౌద్ధ కేంద్రాలు

ప్రాచీన కాలంలో, బౌద్ధమతం దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక, సామాజిక, మరియు వాణిజ్య కేంద్రంగా వికసించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల వంటి ప్రాంతాలలో బౌద్ధవీరులు ప్రధానంగా నివసించి, ఈ ప్రాంతాలు బౌద్ధసంస్థలు, విహారాలు, విశ్వవిద్యాలయాలు, మరియు వాణిజ్య కేంద్రాలుగా ఏర్పడాయి. ఈ క్రమంలో, కొన్ని ప్రాంతాలు బౌద్ధతంత్రాల కేంద్రంగా ప్రముఖమైనవి. 1. ధఞకడ/ధరణికోట: ధఞకడ, లేదా ధరణికోట, ప్రకాశం జిల్లా లో ఉన్న ప్రముఖ బౌద్ధ కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో బౌద్ధ మతం క్రీ.పూ. మూడవ శతాబ్దం నుంచే ఉద్భవించింది. మౌర్య చక్రవర్తి అశోకుడు తన కాలంలో ఈ ప్రాంతాన్ని పెంపొందించి, బౌద్ధ ధర్మ ప్రచారం చేయించాడు. ధఞకడలో బౌద్ధ మత శీఘ్రాభివృద్ధికి పునాది వేసిన మహాయాన బౌద్ధం, మాధ్యమిక సంప్రదాయం, మరియు ఉపాంగాలతో కూడి విస్తరించింది. ముఖ్యంగా, నాగార్జునుడు, ఆర్యదేవుడు, భావవివేకుడు వంటి మహనీయులు ఇక్కడ జీవించారు. 2. అమరావతి: అమరావతి స్తూప స్థలం కూడా ఒక ప్రముఖ బౌద్ధ కేంద్రంగా ప్రాముఖ్యత పొందింది. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన విలక్షణమైన స్థలంగా, వివిధ యాత్రికుల కోసం యాత్రాస్థలంగా మారింది. ఈ ప్రాంతం అశోకున...

బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్

పరిచయం కార్ల్ మార్క్స్, బుద్ధుడి మధ్య పోలిక ను ఒక జోక్‌గా తీసుకుంటారు ఎవరైనా వింటూనే. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మార్క్స్ కు బుద్ధునికి మధ్య 2381 సంవత్సరాల తేడా ఉంది. బుద్ధుడు 563 BCలో పుట్టాడు. కార్ల్ మార్క్స్ 1818 ADలో పుట్టాడు. కార్ల్ మార్క్స్ రాజకీయ, ఆర్థిక వ్యవస్థ లకు సంబంధించిన ఒక కొత్త ఆలోచనా విధానానికి ఆర్కిటెక్ట్‌గా పరిగణిస్తారు.బుద్ధుడిని ఒక మత స్థాపకుడిగా మాత్రమే పరిగణిస్తారు. దీనికి రాజకీయాలకుగానీ ఆర్థిక వ్యవస్థకుగానీ సంబంధం లేదని నమ్ముతారు.       "బుద్ధుడా లేక కార్ల్ మార్క్సా?" అనే ఈ శీర్షిక రెండు వ్యక్తుల మధ్య వ్యత్యాసం సూచించడం జరుగుతుందనే విషయం తలచుకుంటే, అది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. మార్క్సిస్ట్‌లు దీనిని ఈజీగా కొట్టిపారేయవచ్చు. మార్క్స్ ను, బుద్ధుడిని ఒకే స్థాయిలో చూడటమనే ఆలోచనను వెటకారంగా తీసుకోవచ్చు. మార్క్స్ చాలా ఆధునికుడు, బుద్ధుడు చాలా పురాతనుడు! బుద్ధుని, మార్క్స్ ను పోలిస్తే బుద్ధుడు ప్రాథమికుడు మాత్రమే అని మార్క్సిస్ట్‌లు అనవచ్చు.        ఇలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ తులనాత్మకత ఉండగలదు? మార్క్సిస్ట్‌ ...

సంపద దరిద్రం

సంపదలు లేక పోవటం దరిద్రం కాదు - దాన గుణం లేక పోవటం నిజమైన దరిద్రం. ====================== @ ముఖం అందంగా లేక పోవటం వికారం కాదు - మనసులో కల్మషాలు ఉండటమే అతి పెద్ద వికారం. @ నువ్వు కండలు తిరిగిన గండర గండడుగా వళ్లు పెంచటం గొప్ప కాదు - మనసును దృఢంగా, దుఃఖ రహితంగా ఉంచుకోనటం నిజమైన గొప్ప. @ పది మంది బాగు కోసం ఏమీ చేయకుండా, నువ్వు నూరు సంవత్సరాలు బతకటం గొప్ప కాదు - పది మంది మేలు కోసం నువ్వు ఎంత కాలం బతికినా నిజంగా అది గొప్ప.  @ ఇల్లు పెద్దదిగా ఉండటం గొప్ప కాదు - మనసు పెద్దదిగా ఉండటం నిజమైన గొప్ప. @ పిల్లలకు పెద్ద చదువులు చెప్పించటం గొప్ప కాదు - వారికి చదువులతో పాటు, మంచి బుద్దులు నేర్పటం నిజమైన గొప్ప. @ ఇంట్లో పది మంది పని వాళ్లు ఉండటం గొప్ప కాదు - ఆ పది మంది మనసులో గొప్ప స్థానం పొందటం గొప్ప. @ బైట వారితో కలుపు గోలుగా ఉండటం అత్త గారి గొప్ప కాదు - ఇంట్లో సొంత కోడలితో కలిసి పోవటం నిజమైన గొప్ప. @ తల్లిదండ్రుల ప్రేమ పొందటం గొప్ప కాదు - తల్లిదండ్రులతో పాటు, అత్త మామల ప్రేమను పొందటం నిజమైన గొప్ప. @ నీ ఆస్తులు చూసి, పదవులు చూసి నీకు సత్కారాలు చేయటం గొప్ప కాదు - కేవలం నీ మంచితనం, నీ మానవత్వం చూ...

వైదికం బౌద్ధం

వైదిక ధర్మంలో  ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి. 1) వర్ణ ధర్మాలు,  2) కాల్పనిక సాహిత్యం, 3) అంధ విశ్వాసాలు_ స్వర్గం నరకం, తలరాత సిద్ధాంతం, యజ్ఞం యాగం, మొదలైనవి. 4) హింస.   ఈ నాలుగు అంశాలు లేక పోతే వైదిక ధర్మం మనుగడ లేదు.  బౌద్ద ధర్మంలో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి. 1) మానవీయ ధర్మాలు, 2) చారిత్రక సాహిత్యం, 3) శ్రద్దా విశ్వాసాలు, 4) కరుణ.   ఈ నాలుగు అంశాలు లేకుండా బౌద్ద ధర్మం  లేదు.

అనుభవంతో వచ్చిన సత్యమే జ్ఞానం

అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే జ్ఞానం (పిళ్లా కుమారస్వామి)          బుద్ధుని కాలంలో కాలములనే తెగ ఉండేది.వారితో బుద్ధుడు ఒకసారి సంభాషిస్తారు. ఆ సందర్భంలో బుద్ధుడు వారికి జ్ఞానానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. వాటిని ‘కాలామ సుత్తం’ పేరుతో పీకాక్ క్లాసిక్ వారు డి.చంద్రశేఖర్ రాసిన చిన్నపుస్తకాన్ని ప్రచురించారు. ఈ కాలామ సుత్తం అంగుత్తనికాయంలో ఉంది. బుద్ధుడు కాలాములతో చెప్పిన విషయాలను బౌద్ధంలో జ్ఞానసిద్ధాంతంగా పరిగణిస్తారు.         వైదికమతం వేదాన్ని జ్ఞానానికి ప్రమాణంగా భావిస్తుంది. దేవునిపై వుండే భయభక్తులే జ్ఞానానికి తొలి అడుగని బైబిలు చెపుతుంది. అలాగే అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే సరైన జ్ఞానమని కాలాములతో బుద్ధుడు చెప్పిన ఉపదేశాలే బౌద్ధంలో జ్ఞాన సిద్ధాంతమని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మహాభారతంలో యక్ష ప్రశ్నలున్నాయి. అందులో యక్షుడు ధర్మరాజుతో జ్ఞానమెలా వస్తుందని అడుగుతాడు.పండితుల సాంగత్యంతో జ్ఞానమొస్తుందని ధర్మరాజు చెపుతాడు. దీన్నే ఇప్పటికీ చాలా మంది ఆచరణయోగ్యంగా, సరైందిగా భావిస్తుంటారు. మరికొంత మందైతే ...

మహా మంగళ సుత్తం

మహా మంగళ సుత్తం 1. అసేవనా చ బాలానం పండితానం చ సేవనా పూజా చ పూజనీయానం ఏతం మంగళముత్తమం  మూర్ఖులకు దూరంగా ఉండడం, పండితులతో (wise men) సాన్నిధ్యం కలిగి యుండడం, పూజనీయులను గౌరవించడం-ఇవి (bring great blessing) ఉత్తమ మంగళములు. 3. పటిరూపదేసవాసో చ పుబ్బే చ కతపుజ్ఞతా  అత్త-సమ్మాపణిధి చ ఏతం మంగళముత్తమం అనుకూల ప్రదేశంలో నివాసం కలిగియుండడం, పూర్వం చేసుకొన్న పుణ్యం, సరియైన ప్రణిధి (aspiration = సంకల్పం) - ఇవి ఉత్తమ మంగళములు. 4. బాహుసచ్చం చ సిప్పం చ వినయో చ సుసిక్కితో సుభాసితా చ యా వాచా ఏతం మంగళముత్తమం పాండిత్యం (vast learning), పనితనం, క్రమశిక్షణ, మంచిశిక్షణ మంచిమాటలు-ఇవి ఉత్తమ మంగళములు. 5. మాతా పితు ఉపట్ఠానం పుత్తదారస్ప సంగహో అనాకులా చ కమ్మంతా ఏతం మంగళముత్తమం తల్లిదండ్రులకు సేవ చేయుట, భార్యాబిడ్డలను పోషించుట, స్వచ్ఛమైన పనులు (free from greed, hatred etc.) ఇవి ఉత్తమ మంగళములు. 6. దానం చ ధమ్మచరియా చ శాతకానం చ సంగహో అనవఙ్ఞాని కమ్మాని ఏతం మంగళముత్తమం దానం (generosity), సద్వర్తన, బంధువులకు సహాయత, అనిందితమైన (blameless) పనులు-ఇవి ఉత్తమ మంగళములు. 7. ఆరతి విరతి పాపా మజ్జపానా చ సంయమో అప్పమాదో చ ధమ...

చిరునవ్వుతో గమనించడమే ధ్యానం

చిరునవ్వుతో గమనించడమే ధ్యానం   మనం మన శరీరాన్ని సాక్షిగా గమనించాలి. "సాక్షి" తన "స్వంత" అభిప్రాయానికి ప్రాధాన్యత నివ్వకుండా సత్యంగా అక్కడ జరిగినది జరిగినట్టుగా లేక చూచిన దానిని చూచినట్లుగా చెప్పే అవకాశం ఉంటుంది. బుద్ధుడు ఏది చెప్పినా ప్రకృతి యొక్క ధర్మాన్నే చెబుతాడు. ప్రకృతి ధర్మాలలోని ఒక ధర్మమేమిటంటే మనం మనలోని రాగద్వేషాలను గమనిస్తూ పోతే అవి తగ్గుతూ పోతాయి. అలాగాక అనుభవిస్తూ పోతే అవి పెరుగుతూ పోతాయి. అందువల్లనే రాగ ద్వేషాలను చిరునవ్వుతో సాక్షి లాగా గమనించమన్నాడు.      మనం ధ్యానం చేసే సమయంలో వెన్నుపూసను నిటారుగా చేసికొని, ముఖంలో చిరునవ్వును కలిగి ఉండాలి. ."ఆ చిరునవ్వే" మనలో "సాక్షి భావాన్ని" పెంచటానికి అత్యంత ఆవశ్యకం. అంతేకాదు అది మన "జీవన కళ" కు అంటే ఆనందమయ జీవితానికి కూడా బహుళ ప్రయోజనకారి. బుద్ధుడు మనలో సాక్షీ భావాన్ని ఎలా పెంచుకోవాలో మధ్యమనికాయలో వివరించాడు. 1. సాధకుడు "ధీర్ఘంగా శ్వాస" ను తీసి కొనేటప్పుడు (ఇది ప్రథమ స్థాయి) దీర్ఘంగా శ్వాసను తీసుకొంటున్నట్లు, శ్వాసను వదిలేటప్పుడు కూడా దీర్ఘంగా విడిచిపెడుతు న్నట్లు గమనిస...