మహా మంగళ సుత్తం
మహా మంగళ సుత్తం
1. అసేవనా చ బాలానం పండితానం చ సేవనా పూజా చ పూజనీయానం ఏతం మంగళముత్తమం
మూర్ఖులకు దూరంగా ఉండడం, పండితులతో (wise men) సాన్నిధ్యం కలిగి యుండడం, పూజనీయులను గౌరవించడం-ఇవి (bring great blessing) ఉత్తమ మంగళములు.
3. పటిరూపదేసవాసో చ పుబ్బే చ కతపుజ్ఞతా
అత్త-సమ్మాపణిధి చ ఏతం మంగళముత్తమం
అనుకూల ప్రదేశంలో నివాసం కలిగియుండడం, పూర్వం చేసుకొన్న పుణ్యం, సరియైన ప్రణిధి (aspiration = సంకల్పం) - ఇవి ఉత్తమ మంగళములు.
4. బాహుసచ్చం చ సిప్పం చ వినయో చ సుసిక్కితో సుభాసితా చ యా వాచా ఏతం మంగళముత్తమం
పాండిత్యం (vast learning), పనితనం, క్రమశిక్షణ, మంచిశిక్షణ మంచిమాటలు-ఇవి ఉత్తమ మంగళములు.
5. మాతా పితు ఉపట్ఠానం పుత్తదారస్ప సంగహో అనాకులా చ కమ్మంతా ఏతం మంగళముత్తమం
తల్లిదండ్రులకు సేవ చేయుట, భార్యాబిడ్డలను పోషించుట, స్వచ్ఛమైన పనులు (free from greed, hatred etc.) ఇవి ఉత్తమ మంగళములు.
6. దానం చ ధమ్మచరియా చ శాతకానం చ సంగహో అనవఙ్ఞాని కమ్మాని ఏతం మంగళముత్తమం
దానం (generosity), సద్వర్తన, బంధువులకు సహాయత, అనిందితమైన (blameless) పనులు-ఇవి ఉత్తమ మంగళములు.
7. ఆరతి విరతి పాపా మజ్జపానా చ సంయమో అప్పమాదో చ ధమ్మేసు ఏతం మంగళముత్తమం
పాపకార్యాల పట్ల విముఖత, మద్యపానం చేయకుండుట, కర్తవ్యముల పట్ల జాగరూకత-ఇవియే ఉత్తమ మంగళములు.
8. గారవో చ నివాతో చ సంతుట్టి చ కతజ్ఞతా
కాలేన ధమ్మసవణం ఏతం మంగళముత్తమం
పెద్దల ఎడల గౌరవం-వినయం, లభించినదానిపట్ల సంతుష్టి సహాయపడినవారి పట్ల కృతజ్ఞత, ధమ్మశ్రవణం (listening of the I teachings of Buddha) - ఇవి ఉత్తమ మంగళములు.
9. ఖంతి చ పోవచస్పతా సమణానం చ దస్సనం కాలేన ధమ్మసాకచ్ఛా ఏతం మంగళముత్తమం
ఓరిమి, విధేయత, శ్రమణుల దర్శనం, ధమ్మమీమాంస (చర్చలు). ఇవి ఉత్తమ మంగళములు.
10. తపో చ బ్రహ్మచరియం చ అరియసచ్చాన దస్సనం
నిబ్బానసచ్ఛికిరియా చ ఏతం మంగళముత్తమం
తపస్సు, బ్రహ్మచర్యం, నాలుగు ఆర్యసత్యముల దర్శనం, నిర్వాణ సాక్షాత్కారం (experiencing)-ఇవి ఉత్తమ మంగళములు,
11. పుట్టస్స లోకధమ్మేహి చిత్తం యస్స న కంపతి అసోకం విరజం భేమం ఏతం మంగళముత్తమం
లోకధర్మాలైన కీర్తి ,ప్రశంస,సుఖం లేదా అపకీర్తి, నింద, దుఃఖం తాకిడికి చలించని చిత్తము, శోకానికి వశం కాని చిత్తము, నిర్మల చిత్తము, క్షేమాన్ని (real security = భద్రత) పొందిన చిత్తము - ఇవి ఉత్తమ మంగళములు.
12. ఏతాదిసాని కత్వాన సబ్బత్థమపరాజితా సబ్బత్థ పోత్థం గచ్ఛంతి తం తేసం మంగళముత్తమం'తి
ఇట్టి మంగళాచరణములు కలిగినవారు జీవితంలో ఎక్కడా అపజయం పొందరు. అన్నిచోట్ల భద్రతను కలిగియుందురు. ఈ ఉత్తమ మంగళములు వారికి స్వంతమగును.
(ఆధారం:జయమంగళం,అనువాదం:బోధ చైతన్య)
Comments
Post a Comment