బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్
పరిచయం
కార్ల్ మార్క్స్, బుద్ధుడి మధ్య పోలిక ను ఒక జోక్‌గా తీసుకుంటారు ఎవరైనా వింటూనే. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మార్క్స్ కు బుద్ధునికి మధ్య 2381 సంవత్సరాల తేడా ఉంది. బుద్ధుడు 563 BCలో పుట్టాడు. కార్ల్ మార్క్స్ 1818 ADలో పుట్టాడు. కార్ల్ మార్క్స్ రాజకీయ, ఆర్థిక వ్యవస్థ లకు సంబంధించిన ఒక కొత్త ఆలోచనా విధానానికి ఆర్కిటెక్ట్‌గా పరిగణిస్తారు.బుద్ధుడిని ఒక మత స్థాపకుడిగా మాత్రమే పరిగణిస్తారు. దీనికి రాజకీయాలకుగానీ ఆర్థిక వ్యవస్థకుగానీ సంబంధం లేదని నమ్ముతారు.
"బుద్ధుడా లేక కార్ల్ మార్క్సా?" అనే ఈ శీర్షిక రెండు వ్యక్తుల మధ్య వ్యత్యాసం సూచించడం జరుగుతుందనే విషయం తలచుకుంటే, అది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు.
మార్క్సిస్ట్‌లు దీనిని ఈజీగా కొట్టిపారేయవచ్చు. మార్క్స్ ను, బుద్ధుడిని ఒకే స్థాయిలో చూడటమనే ఆలోచనను వెటకారంగా తీసుకోవచ్చు. మార్క్స్ చాలా ఆధునికుడు, బుద్ధుడు చాలా పురాతనుడు! బుద్ధుని, మార్క్స్ ను పోలిస్తే బుద్ధుడు ప్రాథమికుడు మాత్రమే అని మార్క్సిస్ట్‌లు అనవచ్చు.
ఇలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ తులనాత్మకత ఉండగలదు? మార్క్సిస్ట్ ఒక బుద్ధుడి నుండి ఏమి నేర్చుకోగలరు? బుద్ధుడు మార్క్సిస్ట్‌కు ఏమి నేర్పగలడు? అయినప్పటికీ, ఈ ఇద్దరి మధ్య పోలిక ఆసక్తికరమైనది. బోధకమైనది.
ఇద్దరిని చదివిన తరువాత,రెండు ఆలోచనలను అధ్యయనం చేశాక ఈ పోలిక నా మనస్సులో మెదిలింది. మార్క్సిస్ట్‌లు తమ పిడి వాదాన్ని పక్కనబెట్టి బుద్ధుడిని చదివి, ఆయన దేనికి ప్రతినిధ్యం వహించారో అర్థం చేసుకుంటే, వారు తమ వైఖరిని మార్చుకుంటారని నాకు నమ్మకముంది. అయితే, బుద్ధుడిని వెటకారం చేయడానికి సిద్ధమైన వారు ఆయనను స్వీకరించడానికి సిద్ధపడతారని ఊహించడం చాలా కష్టమే అవుతుంది. అయినప్పటికీ, బుద్ధుడి బోధనల్లో మార్క్సిస్ట్‌లు గమనించదగిన, వారి దృష్టిలో నిలుపుకోదగిన కొన్ని విషయాలు ఉన్నాయని వారు గ్రహిస్తారు.
____ డా. బి.ఆర్. అంబేద్కర్
Comments
Post a Comment