Posts

Philosophy of Buddhism in the Indian Constitution

*Philosophy of Buddhism in the Indian Constitution* *In the Preamble of the Constitution of India, "Satyameva Jayate" was added as a national sentence based on Buddhism.*  *This sculpture of four lions was built by the great emperor Ashoka in Sarnath.* *Buddha loved a republic. The Buddha founded the monastic community inspired by this republic. Our Indian parliamentary system is also based on the rules introduced by the Buddha in the Bhikshu Sanghas*  *🪷The Bodhi (Ravi) tree printed on the gold medal giving the title of Bharata Ratna is also taken from Buddhism.*  *✍️pilla kumaraswaamy* Philosophy of Buddhism in the Indian Constitution The constitution was framed by the Drafting committee under the chairmanship of Dr. Bheem Rao Ambedkar along with other six members. The Constitution came into existence on 26 January 1950 after it's adopted on 26 November 1949. The document of the constitution lays down the framework defining fundamental political principles, establishes...

పర్యావరణ హిత, హరిత దీపావళిని జరుపుకుందామా

*బాణా సంచా కాల్పు వినోదమా, విపత్కరమా ?*   *పర్యావరణ హిత, హరిత దీపావళిని జరుపుకుందామా !*   _పండుగలు సాధించిన ప్రగతికి సంకేతాలు._      _ఆనందంగా సేద తీరే సావకాసాలు._  ఆ ఆనందకర సమయాలు నష్టాలు కలుగకుండా, విషాదం కాకుండా చూడడం మన చేతుల్లోనే వుంది.      మనం ఎంతో ఉత్సాహంగా దీపావళి రోజు కాల్చే బాణాసంచా పేలుడు పదార్ధాలతో తయారవుతాయి. అవి  పొగ, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ అనే గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణం లోకి విడుదల చేసి కాలుష్యా న్ని ఏర్పరుస్తాయి.   బాణాసంచా కాల్పువల్ల జరిగే ఫలితాలను చర్చిద్దాం.  *వినోదం నుంచి విషాదం :*  బాణాసంచా ప్రేలుడు వలన పొగ, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ వంటి విషవాయువులతో కూడిన మేఘం ఏర్పడుతుంది. అది పార్కుల, అడవుల దృశ్య రమణీయతను మసక బారుస్తుంది. బాణాసంచా కాల్చినప్పుడు, పొగ మరియు వాయువులు గాలిలోకి విడుదల అవుతాయి.   అందులో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ ఈ మూడు గ్రీన్హౌస్ వాయువులు దురదృష్టవశాత్తు వాతావరణ మార్పులకు కారణమవుతున్న...

తెలంగాణలో బౌద్ధం

👉తెలంగాణలో బౌద్ధమతం వ్యాప్తి..!!! ——————————————————— ప్రపంచంలోని మత స్థాపకులు, బోధకులు కనిపించే మనిషికన్నా, కనిపించని దేవునికీ, ఇహలోక సులభజీవనం కన్నా, లేని పరలోక సౌఖ్యాలకు ఎక్కువ ప్రాధానమిచ్చారు. ఒక్క గౌతమ బుద్ధుడు మాత్రమే మనిషిని కేంద్రంగా చేసుకొని తన ధర్మాన్ని బోధించాడు. మానవత్వానికి ప్రధాన పీట వేశాడు.సకల జీవకోటి సుఖంగా జీవించుగాక, సర్వ ప్రాణులూ నిర్భీతితో మనుగడ సాగించుగాక, సమస్త ప్రజలూ అన్ని రకాల కష్టాలు, దుఃఖాల నుంచి విముక్తులై ప్రశాంతంగా, ఆనందంగా జీవించుగాక అని కోరింది బౌద్ధం. సుమారు 2560 ఏండ్ల కిందటి ఈ సామ్యవాద భావజాలం, భారతదేశంలో కన్నా విదేశాల్లో బాగా ఉంది. శాంతి, అహింస, ప్రజ్ఞ, కరుణ, శీల, సమత, మైత్రి, సానుభూతులకు వేదిక బౌద్ధం. క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే కుల వ్యవస్థని, అస్పృశ్యతని నిరసించి, సమసమాజ నిర్మాణానికి శాశ్వతమైన పునాదులు వేసిన విప్లవకారుడు బుద్ధుడు. విశ్వంలో ప్రతి ఒక్కరి హృదయంలో ప్రజ్వలించే ధర్మజ్యోతి, ఆసియా జ్యోతి గౌతమ బుద్ధుడు. క్రీ.పూ. 8వ శతాబ్దంలో జన్మించి సుమారు 1000 ఏండ్లపాటు భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన బౌద్ధమతం నేటికీ జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మయన్మార్ దేశాల్లో ...

బౌద్ధమతం ఎందుకు క్షీణించింది

బౌద్ధమతం ఎందుకు క్షీణించింది? . ఆర్కియాలజీ, సాహిత్యాల ఆధారంగా బౌద్ధం భారతదేశ నలుమూలలా బలంగా విస్తరించిందని తెలుస్తుంది. ఆరవశతాబ్దపు చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రాతలలో ఆనాటి బౌద్ధ ఆరామాల విస్తరణ, ఇతర ఆరాధనా పద్దతులతో  తులనాత్మక వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి   • నేటి ఉత్తరప్రదేశ్ లోని కానౌజ్/కన్యాకుబ్జ లో బౌద్ధులు, ఇతర విశ్వాసులు సమాన సంఖ్యలో ఉన్నారు; వెయ్య ఆరామాలు, పదివేల బిక్షుకులు, 200  దేవాలయాలు, కొన్ని వేలమంది దేవభక్తులు ఉన్నారు. • వారణాసిలో ముప్పై ఆరామాలు 3000 మంది భిక్షుకులు, 100  దేవాలయాలు పదివేలమంది భక్తులు ఉన్నారు,  వీరిలో ముఖ్యంగా పశుపతులు, జైనులు ఎక్కువ.  • మగధలో 50 ఆరామాలు, పదివేలమంది భిక్షుకులు ఉన్నారు.  • వైశాలి లో కొన్ని వందల ఆరామాలు ఉన్నాయని కానీ అవన్నీ శిథిలమైపోయాయని, బౌద్ధ భిక్షుకులు కొద్దిమంది మినహా చాలామంది వైశాలిని విడిచివెళ్ళిపోయారని, కొన్ని పదుల దేవ ఆలయాలు ఉన్నట్లు తెలిపాడు. • పుండ్రవర్ధన (బెంగాల్)  లో 3000 భిక్షకులతో ఇరవై ఆరామాలు, కొన్ని వందల ఆలయాలు ముఖ్యంగా జైనులు ఉన్నారు. • సముద్రతీర పట్టణమైన Samatata లో 30 ఆరామాలు...

బుద్ధుడి బోధనలు:

బుద్ధుడి బోధనలు: బుద్ధుడు బోధించిన పంచశీల : 1 జీవహింస చేయకపోవడం  2. దొంగతనము చేయకపోవడం  3. వ్యభిచరించక పోవడం  4. అసత్యం చెప్పకపోవడం  5. మత్తు పదార్థాలను, మద్యాన్ని సేవించకపోవడం.  బుద్ధుడు నాలుగు సత్యాలను ప్రవచించాడు. వీటినే ఆర్యసత్యాలు అంటారు. 1. మనిషికి దు:ఖం ఉంది. 2 దుఃఖానికి కారణం ఉంది 3. దుఃఖ నివారణ ఉంది. 4 దుఃఖ నివారణ మార్గం ఉంది.  బుద్ధుడు దుఃఖాలను తొలిగించడానికి అష్టాంగ మార్గాన్ని సూచించాడు.  అష్టాంగ మార్గం బుద్ధుడు నీతిని బోధించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకవైపు ప్రపంచ సుఖాల్లో నిమగ్నం కావడం, మరోవైపు మితిమీరిన ఉపవాసాలు చేసి శరీరాన్ని శుష్కించడం రెండూ నిష్ప్రయోజనమే. ఈ రెండు విపరీత ప్రవృత్తులకు మధ్య మార్గం అష్టాంగ మార్గం. దుఃఖానికి అజ్ఞానం కారణం. అజ్ఞానాన్ని తొలిగించేందుకు ఈ మార్గాన్ని అనుసరించాలి. 1. సమ్యక్ దృష్టి  2. సమ్యక్ సంకల్పం  3. సమ్యక్ వాక్కు  4. సమ్యక్ కర్మ  5. సమ్యక్ జీవనం  6. సమ్యక్ వ్యాయామం  7. సమ్యక్ స్మృతి  8. సమ్యక్ సమాధి ధర్మ చక్రం లోని 8 ఆకులు అష్టాంగ మార్గానికి ప్రతీకలు అష్టాంగ మార్గం...

బౌద్ధ ధర్మ సాహిత్యం_ జాతక కథలు:

జాతక కథలు: -జాతక కథలను క్రీ.శ. 300 నుంచి క్రీ.శ. 400 మధ్య కాలంలో రచించినట్లు తెలుస్తుంది. -జాతక కథల్లో చాలా వరకు నీతి కథలే ఉన్నాయి. -ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, గోలి, నాగార్జునకొండలోని శిల్పఖండాల్లో జాతక కథలు చూడవచ్చు. -అజంతాలో కొన్ని జాతక కథలు చూడవచ్చు. -1వ గుహలో మహాజనక జాతకం, 17వ గుహలో మహాహంస, మాతృ పోషక జాతకాల్లోని కొన్ని దృశ్యాలు చెక్కి ఉన్నాయి. -అమరావతిలో మిత్ర విందకుని కథ, నలగిరిగజ దర్శనం, బుద్ధుడు శ్వేత రూపంలో అవతరించిన కథలు చెక్కి ఉన్నాయి. -అజంతా గుహల్లోని 1వ గుహలో స్నాన, అంతఃపుర దృశ్యాలు, 16, 17వ గుహల్లో బుద్ధుడి ఉపదేశం, 19వ గుహలో బుద్ధుడి ఎదుట మాతాశిశువులు గల దృశ్యం, 26వ గుహలో బుద్ధుడి మహాపరినిర్యాణం చెక్కి ఉన్నాయి.

బౌద్ధ ధర్మ సాహిత్యం_ త్రిపీటకాలు

*బౌద్ధ ధర్మ సాహిత్యం_ త్రిపీటకాలు* బౌద్ధ ధర్మ సాహిత్యం పాళీ, మాగధి, ప్రాకృత భాషల్లో ఉంది. -పాళీ భాషలో రాసిన దమ్మ గ్రంథాల్లో ముఖ్యమైనవి త్రిపీటకాలు. -త్రిపీటక అంటే మూడు గంపలు అని అర్థం. అంటే మూడు భాగాలని అర్థం. అవి... 1. సుత్త 2. వినయ 3. అభిదమ్మ పీటకలు -పిటక అనగా పెట్టె అని అర్థం. బుద్ధుని మరణానంతరం అతని బోధనలు మూడు పెట్టెలలో సేకరించారు. వీటినే త్రిపీటకాలు అంటారు. 1)సుత్తపిటక -బుద్ధుని శిష్యుడైన ఆనందుడు సంకలనం చేశాడు. -బుద్ధుడి బోధనలను వివరిస్తుంది. -ఈ పీఠికలో ఐదు భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క విభాగాన్ని నికాయ అని పిలుస్తారు. ఈ భాగాల్లో బుద్ధుడి ఉపదేశాలు పరస్పర సంవాద రూపంలో ఉపన్యాస రూపంలో ఉన్నాయి. 1. దీఘ నికాయ  2. మజ్జిమ నికాయ  3. సంయుత్త నికాయ  4. అంగుత్తర నికాయ  5. ఖుద్ధక నికాయ -అంగుత్తరనికాయలో మొదటిసారిగా 16 మహాజనపదాల గురించి పేర్కొన్నారు. 2. వినయ పిటక -బుద్ధుడి శిష్యుడైన ఉపాలి సంకలనం చేశాడు. -బుద్ధుడి సంఘ నియమ నిబంధనలను వివరిస్తుంది. -ఈ పీఠికలో నాలుగు భాగాలు ఉన్నాయి. క్రమశిక్షణ, నియమాలను ఉల్లంఘించడం వల్ల కలిగే పరిణామాలను ఈ పీఠికలో వివరించారు. 3. అభిదమ్మ పిటక -బుద్ధుడి ...