Posts

అనుభవంతో వచ్చిన సత్యమే జ్ఞానం

అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే జ్ఞానం (పిళ్లా కుమారస్వామి)          బుద్ధుని కాలంలో కాలములనే తెగ ఉండేది.వారితో బుద్ధుడు ఒకసారి సంభాషిస్తారు. ఆ సందర్భంలో బుద్ధుడు వారికి జ్ఞానానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. వాటిని ‘కాలామ సుత్తం’ పేరుతో పీకాక్ క్లాసిక్ వారు డి.చంద్రశేఖర్ రాసిన చిన్నపుస్తకాన్ని ప్రచురించారు. ఈ కాలామ సుత్తం అంగుత్తనికాయంలో ఉంది. బుద్ధుడు కాలాములతో చెప్పిన విషయాలను బౌద్ధంలో జ్ఞానసిద్ధాంతంగా పరిగణిస్తారు.         వైదికమతం వేదాన్ని జ్ఞానానికి ప్రమాణంగా భావిస్తుంది. దేవునిపై వుండే భయభక్తులే జ్ఞానానికి తొలి అడుగని బైబిలు చెపుతుంది. అలాగే అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే సరైన జ్ఞానమని కాలాములతో బుద్ధుడు చెప్పిన ఉపదేశాలే బౌద్ధంలో జ్ఞాన సిద్ధాంతమని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మహాభారతంలో యక్ష ప్రశ్నలున్నాయి. అందులో యక్షుడు ధర్మరాజుతో జ్ఞానమెలా వస్తుందని అడుగుతాడు.పండితుల సాంగత్యంతో జ్ఞానమొస్తుందని ధర్మరాజు చెపుతాడు. దీన్నే ఇప్పటికీ చాలా మంది ఆచరణయోగ్యంగా, సరైందిగా భావిస్తుంటారు. మరికొంత మందైతే ...

మహా మంగళ సుత్తం

మహా మంగళ సుత్తం 1. అసేవనా చ బాలానం పండితానం చ సేవనా పూజా చ పూజనీయానం ఏతం మంగళముత్తమం  మూర్ఖులకు దూరంగా ఉండడం, పండితులతో (wise men) సాన్నిధ్యం కలిగి యుండడం, పూజనీయులను గౌరవించడం-ఇవి (bring great blessing) ఉత్తమ మంగళములు. 3. పటిరూపదేసవాసో చ పుబ్బే చ కతపుజ్ఞతా  అత్త-సమ్మాపణిధి చ ఏతం మంగళముత్తమం అనుకూల ప్రదేశంలో నివాసం కలిగియుండడం, పూర్వం చేసుకొన్న పుణ్యం, సరియైన ప్రణిధి (aspiration = సంకల్పం) - ఇవి ఉత్తమ మంగళములు. 4. బాహుసచ్చం చ సిప్పం చ వినయో చ సుసిక్కితో సుభాసితా చ యా వాచా ఏతం మంగళముత్తమం పాండిత్యం (vast learning), పనితనం, క్రమశిక్షణ, మంచిశిక్షణ మంచిమాటలు-ఇవి ఉత్తమ మంగళములు. 5. మాతా పితు ఉపట్ఠానం పుత్తదారస్ప సంగహో అనాకులా చ కమ్మంతా ఏతం మంగళముత్తమం తల్లిదండ్రులకు సేవ చేయుట, భార్యాబిడ్డలను పోషించుట, స్వచ్ఛమైన పనులు (free from greed, hatred etc.) ఇవి ఉత్తమ మంగళములు. 6. దానం చ ధమ్మచరియా చ శాతకానం చ సంగహో అనవఙ్ఞాని కమ్మాని ఏతం మంగళముత్తమం దానం (generosity), సద్వర్తన, బంధువులకు సహాయత, అనిందితమైన (blameless) పనులు-ఇవి ఉత్తమ మంగళములు. 7. ఆరతి విరతి పాపా మజ్జపానా చ సంయమో అప్పమాదో చ ధమ...

చిరునవ్వుతో గమనించడమే ధ్యానం

చిరునవ్వుతో గమనించడమే ధ్యానం   మనం మన శరీరాన్ని సాక్షిగా గమనించాలి. "సాక్షి" తన "స్వంత" అభిప్రాయానికి ప్రాధాన్యత నివ్వకుండా సత్యంగా అక్కడ జరిగినది జరిగినట్టుగా లేక చూచిన దానిని చూచినట్లుగా చెప్పే అవకాశం ఉంటుంది. బుద్ధుడు ఏది చెప్పినా ప్రకృతి యొక్క ధర్మాన్నే చెబుతాడు. ప్రకృతి ధర్మాలలోని ఒక ధర్మమేమిటంటే మనం మనలోని రాగద్వేషాలను గమనిస్తూ పోతే అవి తగ్గుతూ పోతాయి. అలాగాక అనుభవిస్తూ పోతే అవి పెరుగుతూ పోతాయి. అందువల్లనే రాగ ద్వేషాలను చిరునవ్వుతో సాక్షి లాగా గమనించమన్నాడు.      మనం ధ్యానం చేసే సమయంలో వెన్నుపూసను నిటారుగా చేసికొని, ముఖంలో చిరునవ్వును కలిగి ఉండాలి. ."ఆ చిరునవ్వే" మనలో "సాక్షి భావాన్ని" పెంచటానికి అత్యంత ఆవశ్యకం. అంతేకాదు అది మన "జీవన కళ" కు అంటే ఆనందమయ జీవితానికి కూడా బహుళ ప్రయోజనకారి. బుద్ధుడు మనలో సాక్షీ భావాన్ని ఎలా పెంచుకోవాలో మధ్యమనికాయలో వివరించాడు. 1. సాధకుడు "ధీర్ఘంగా శ్వాస" ను తీసి కొనేటప్పుడు (ఇది ప్రథమ స్థాయి) దీర్ఘంగా శ్వాసను తీసుకొంటున్నట్లు, శ్వాసను వదిలేటప్పుడు కూడా దీర్ఘంగా విడిచిపెడుతు న్నట్లు గమనిస...
బుద్ధుని  మార్గం  రోజుకో సూక్తి   నీ బాధ కి కారణం ఏదైనా కావచ్చు.  కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే…  కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే. మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడో  వెతికితే దొరికేది కాదు.  అది నీలోనే ఉంటుంది. ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు  ఎందుకంటే నీకెందులోనైతే  ఆనందం కలుగుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు. తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగా చేస్తారు.  వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు. ఒక మనిషి గురించి మరొక మనిషికి  జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు …  చేతితో చేసిన సాయం... మాటతో మనసుకు చేసిన గాయం... ఆనందంగా ఉండేవారు  తమ దగ్గర ఉన్నదానికోసం మాత్రమే ఆలోచిస్తే ...! ఆనందంగా ఉండలేనివారు  తమ దగ్గర లేని వాటిని గురించి ఆలోచిస్తారు. మనసు చెప్పింది మనం వినడం కాదు....  మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి..!!   గతంలో నివసించవద్దు, భవిష్యత్తు గురించి కలలు కనవద్దు, ప్రస్తుత క్షణంపై మనస్సును కేంద్రీకరించండ...

మహాబోధి ఆలయం

Image
                 మహాబోధి విహారం           గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన ప్రధాన నాలుగు క్షేత్రాలలో బుద్దగయ చాలా ముఖ్యమైనది. మిగిలిన మూడు  కుశీనగర్, లుంబినీ,  సారనాథ్ .        బుద్ధగయ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో పాట్నాకు దక్షిణాన 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశం కాదు.ఇది బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. 2600సంవత్సరాల కిందట నేటి బుద్ధగయను ఉరువేల అని పిలిచేవారు. ఇది ఫాల్గు నది ఒడ్డున ఉంది .        బుద్ధుని బోధనలు తెలుసుకొని అశోక చక్రవర్తి అశోక బౌద్ధునిగా మారాడు.చక్రవర్తి అశోకుడు  బుద్ధగయలో 288 BCE లో ఒక స్థూపాన్ని, మహాబోధి విహారాన్ని  నిర్మించాడు. ఈ విహారం కుషానుల కాలంలో క్రీ.శ.2వ శతాబ్దంలో తిరిగి నిర్మించబడింది.  ఒక శిలాఫలకాన్ని నిర్మించారు. మహాబోధి విహారం భారతదేశంలో కనిపించే పురాతన ఇటుక నిర్మాణాలలో ఒకటి. బోధివృక్షం కింద జ్ఞానోదయం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానిక...

లుంబినీ వనం

Image
లుంబినీ వనం            లుంబినీ వనం( nepal) pc Wikipedia             600 BCE నాటికి నేపాల్  దక్షిణ ప్రాంతాలలో చిన్న గణ రాజ్యాలు, వంశాల సమాఖ్యలు ఏర్పడ్డాయి. అలాఏర్పడిన వాటిలో ఒకటి శాక్య రాజ్యం. 250 BC నాటికి ఈ  దక్షిణ ప్రాంతాలు అశోక చక్రవర్తి  ఏలుబడి లో ఉన్న మౌర్య సామ్రాజ్యం ప్రభావంలోకి వచ్చాయి . సాధారణ శకం 4వ శతాబ్దం  నాటికి లిచ్ఛవి వంశస్థులు అధికారంలోకి వచ్చారు. అప్పటికి నేపాల్‌లో ఎక్కువ భాగం గుప్త సామ్రాజ్యం ప్రభావంలోకి  వచ్చింది. నేపాల్ లోని ఖాట్మండు లోయలో ఉన్న వారిని కిరాతులు అన్నారు. పృథ్వీ నారాయణ్ షా అనే  గూర్ఖా రాజు 1769 నాటికి లోయలోని అన్ని రాజ్యాలను (స్వతంత్ర రాష్ట్రంగా ఉన్న కీర్తిపూర్‌తో సహా)  కలిపి ఏకీకృతం చేశాడు.  1923 నాటికి అది ప్రత్యేక దేశంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. హిందువులు ఎక్కువగా ఉన్న నేపాల్ హిందూ దేశం గా ప్రసిద్ధి పొందింది అయితే 2006లో మావోయిస్టు పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అది లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశంగా  మారింది...

Philosophy of Buddhism in the Indian Constitution

*Philosophy of Buddhism in the Indian Constitution* *In the Preamble of the Constitution of India, "Satyameva Jayate" was added as a national sentence based on Buddhism.*  *This sculpture of four lions was built by the great emperor Ashoka in Sarnath.* *Buddha loved a republic. The Buddha founded the monastic community inspired by this republic. Our Indian parliamentary system is also based on the rules introduced by the Buddha in the Bhikshu Sanghas*  *🪷The Bodhi (Ravi) tree printed on the gold medal giving the title of Bharata Ratna is also taken from Buddhism.*  *✍️pilla kumaraswaamy* Philosophy of Buddhism in the Indian Constitution The constitution was framed by the Drafting committee under the chairmanship of Dr. Bheem Rao Ambedkar along with other six members. The Constitution came into existence on 26 January 1950 after it's adopted on 26 November 1949. The document of the constitution lays down the framework defining fundamental political principles, establishes...