Posts

బుద్ధుడు కనుగొన్న విశ్వ మహాసత్యాలు

*త్రిరత్నాలు అనబడే మూడు విశ్వ మహాసత్యాలు.* *త్రిరత్నాలనగా అనిత్యం, అనాత్మం, దుక్ఖం - దుక్ఖ నిరోధం అని పిలువబడే మూడు విశ్వసత్యాలు. ఈ విశ్వం అంతా యీ మూడింటితో నిండి వున్నది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.* *బుద్ధభగవానులవారు మానవాళికి అందించిన "అనిత్యం" అనే విశ్వసత్యం ప్రకారం, యీ విశ్వంలో శాశ్వతంగా వుండేది ఏదీ లేదు. ప్రతీదీ నిరంతరం మార్పు చెందుతూనే వుంటుంది. ఏదీ నిలకడగా వుండదు. ఇదే అనిత్య మహాసత్యం.* *విశ్వానికి సంబంధించి ఎప్పటికీ తిరుగులేని సత్యం యిది. ఈ అనిత్య సత్యాన్ని బాగా ఎరుక పరుచుకోవడానికీ, అనుభూతం చేసుకోవడానికీ 'కాలం' బాగా ఉపయోగ పడుతుంది. పరిశీలిస్తూ వుంటే గాలి, నీరు, అగ్ని, మట్టి, ఆకాశం అనే మహా ఖాళీ ప్రదేశం.. వీటితో నిండిన జీవులు, నిర్జీవులతో సహా సర్వ ప్రపంచం అంతా నిముష నిముషానికీ ఏదో ఒక మార్పుతో, కదలికలతో, ధ్వనులతో, చైతన్యంతో, మార్పులతో కనిపిస్తుంది. అనుభూతమవుతుంది. మనలోనూ, మన ఎదురుగానూ ప్రతిక్షణం పుడుతూ మారిపోతూ నశించి పోతున్న భావనలు, దృశ్యాలు, శబ్దాలు, వెలుగులు, గాలులు ఒకదాని తరువాత ఒకటి నిరంతరంగా, అప్రతిహతంగా జరిగిపోతూ వుంటాయి. కేవలం భౌతికదృష్టితోనే సాధకు...

ద్వేషం దేనికీ పరిష్కారం కాదు.

ద్వేషం దేనికీ పరిష్కారం కాదు. బుద్ధుడు తన కాలంలోని బ్రాహ్మణులలోని 'బ్రాహ్మణులు ఎక్కువ వారు, తక్కిన వారు తక్కువ వారు, జ్ఞానాన్ని, ముక్తిని పొందటానికి బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉంది' అనే ఆధిక్యతాభావాన్ని తిరస్కరించాడు. మానవ సమానత్వాన్ని ప్రకటించాడు. అంతేగాని ఎవ్వరినీ ద్వేషించలేదు. వేదాలను చదవటంవల్ల, చదివించటం వలన, యజ్ఞ యాగాలవలన దుఃఖవిముక్తి కలుగదని, రాగ, ద్వేష, మోహాలను వదలటం వల్లనే అది సాధ్యమౌతుందని అన్నాడు. బ్రాహ్మణ పదాన్ని బుద్ధుడు జ్ఞానికి పర్యాయంగా ఉపయోగించాడు. పుట్టుక తో ఎవడూ బ్రాహ్మణుడు కాడని చెప్పాడు. వర్ణాశ్రమ ధర్మాలను తిరస్కరించాడు. అతడు జ్ఞానవాది. ఆయన మాటల్లోని సత్యాన్ని గుర్తించిన ఎందరో బ్రాహ్మణులు ఆయన శిష్యులైనారు. తర్వాత అశోకుని కాలం నుండి బౌద్ధానికి ప్రాధాన్యం లభించటం వలన వైదికం వెనకబడి పోయింది. దానిని సహించలేని బ్రాహ్మణులు చివరి మౌర్యరాజును చంపి రాజ్యాన్ని చేజిక్కించుకొన్నారు. అప్పటి నుండి బౌద్ధాన్ని అణిచివేయటం మొదలై ముస్లింల దండయాత్రల అది అనేక విధాలుగా సాగింది. అందులో భాగమే బుద్ధున్ని దశావతారాలలో చేర్చటం. మనుస్మృతిని రాసి శూద్రులను అంటరాని వారిగా, జంతువుల కన్న హీ...

అంబేద్కర్ చెప్పిన సూక్తులు

అంబేద్కర్ చెప్పిన సూక్తులు ◆ People who have not decided their objective they can't get any sucess. When they dont get any success, they can't make any impact in the history of the time.  ◆ ఏ ప్రజలైతే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోరో వారు ఎటువంటి విజయాన్ని పొందలేరు ఎపుడైతే వారు విజయాన్ని పొందలేరో, వారు చరిత్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేరు.                 ◆ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు. ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం. ◆ నా దేశ సమస్యలకు-నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణలు వస్తే ముందు నా జాతి కి ప్రాముఖ్యత ఇస్తాను.కానీ నేను - నా దేశం ఈ రెండింటిలో నా దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ◆దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.ప్రతిపౌరుని నైతికాభివృద్దే దేశాభివృద్ధి. ◆జీవించేందుకు తినాలి.సమాజ సంక్షేమానికై జీవించాలి. ◆నీ కోసం జీవిస్తే.. నీ లోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే... జనం లో నిలిచి పోతావు. ◆ఓటుహక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో, అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ◆ కులం పునాదుల మీద ఒక జాతిని ...

Evils

పది పాపాలు (Evils) *బుద్ధుడు చెప్పాడు.జీవులు చేసే అన్ని కర్మలు పది కారణాల వలన చెడ్డవి అవుతాయి. ఇంక పది కారణాలను పరిహరించడం వలన అవి మంచివి అవుతాయి. శరీరం చేసే మూడు(3) చెడులున్నాయి; నాలుకవి నాలుగు(4), మనస్సువి మూడు(3) చెడులు ఉన్నాయి. శరీరం చేసే మూడు చెడులు : హత్య, దొంగతనం, వ్యభిచారాలు. నాలుక చేసే  నాలుగు చెడులు : అబద్ధాలాడడం, అపవాదులు వేయడం(చాడీలు చెప్పడం), దూషణం, ఎలాంటి ఉపయోగం లేని సంభాషణలు.  మనస్సు  చేసే   చెడులు :  లోభత్వం, ద్వేషం, భ్రమలు కలిగి ఉండటం.  నేను మిమ్మల్ని పది(10) పాపాలకు దూరంగా ఉండమని చెపుతున్నాను. 1 ఏ ప్రాణిని  చంపొద్దు. వాటి ప్రాణం పట్ల గౌరవం చూపించు. 2. దొంగతనం  చేయొద్దు.మీరు దోచుకోవద్దు; కాని ప్రతి ఒక్కరికీ, తన శ్రమకు తగినంత ఫలం పొందేటట్లు  చేయండి. 3.అపరిశుభ్రతకు దూరంగా ఉండండి. పరిశుభ్ర జీవితాన్ని గడపండి. 4. అబద్ధం ఆడొద్దు, సత్యం పలుకు. విచక్షణతో నిర్భయంగా సత్యమే చెప్పు. అదీ ప్రేమైక  హృదయంతో చెప్పు. 5. చెడు వార్తలు పోగుచేయకు. వాటిని తిరిగి చెప్పకు. 6.ఎవరినీ అభిశంసించకు(విమర్శించకు). తోటి వారిలో మంచిని చూడు. వారిని శ...

నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి..!!!

నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి..!!!                    --Dr. Devaraju Maharaju  ———————————————————————   దీపావళి అంటే దీపాల వరుస. చుట్టూ ఉన్న చీకట్లను  పారద్రోలి వెలుగు నింపడానికి సంకేతంగా ఆ పండగ చేస్తున్నామని చెపుతారు. చెడు మీద మంచి సాధించిన విజయం అని కూడా చెపుతారు. అయితే, దాని చుట్టూ అల్లుకున్న పౌరాణిక గాథలు చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడు, నరకాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో సొమ్మసిల్లి పోయాడనీ, పక్కనే ఉన్న సత్యభామ ఉగ్రరూపం దాల్చి, బాణాల వర్షం కురిపించి నరకాసురుణ్ణి సంహరించిందనీ – ఒక పౌరాణిక గాథ ఉంది. మహకాళి రాక్షస సంహారం చేసినందుకు దేవీనవరాత్రులు జరుపుకున్నట్టు – మరో కథనం ఉంది. ఇవి కాక, దశ-హర (దసరా)కు, దీపావళికి దగ్గరి సంబంధం ఉంది. ఆ రెండు పండుగలు వెంటవెంటనే వస్తాయి. రాముడు లంకాధీశుడైన పదితలల రావణుణ్ణి చంపినందువల్ల దసరా జరుపుకుంటున్నామని చెపుతారు. దశ-హరా అంటే పది తలలు నరికేయడం. రావణుడి పది తలలు నరికి సంహరించిన తర్వాత, రాముడు సీతాలక్ష్మణులతో సహా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటున్నామని కథ చెపుతారు. ప...

బౌద్ధం భారత దేశంలో ఎలా నాశనమయింది?

        గౌతమ బుద్దునిగా పేరు గాంచిన బుద్దుని అసలు పేరు సిద్దార్థ్. ఇతను సాధారణ శకం కు పూర్వం 563 లో జన్మించి 483 లో మరణించాడు. అంటే బుద్దుడు మొత్తం 80 ఏళ్ళు జీవించాడు. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి.మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి. సిద్ధార్ధుడు కపిలవస్తు నగరానికి చెందిన లుంబినిలో  జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది.ర్భావతిగానున్న మాయాదేవి ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. ప్రయాణ మార్గ మధ్యంలో లుంబిని అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించింది. అనేక ఆధారాలను బట్టి ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తోంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడ ని నామకరణం చేశారు. సిద్ధార్దుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్ధార్దుడు తన పినతల్లి అయిన మహా ప్రజాపతి( గౌతమి)పెంపకంలో పెరుగుతాడు.  గౌతమి పెంచినందువల్ల   అతన్ని  గౌతముడన్నారు. సిద్దార్డ్ 16 ఏళ్ల వయసు వచ్చే సరికి యశోధర ను...

బౌద్దం_గురించి_ప్రముఖులు

బౌద్దం_గురించి_ప్రముఖులు భారతజాతి ప్రముఖులలో అత్యుత్తముడు బుద్దుడు.                              -- నెహ్రూ ఇతర అన్ని మతాలకన్నా బౌద్దమే మానవాళికి మేలు చేసింది.                            --సర్వేపల్లి రాధాకృష్ణ . మతం అనేది మనిషికి తప్పనిసరి అయితే నేను బౌద్దాన్నే స్వీకరిస్తాను                                    ..బెర్నాండ్ రస్సెల్                                                                             నాకు తెలిసి మానవజాతి చరిత్రలో మహోన్నతుడు బుద్దుడు. వేరెవరైనా ఉంటే చూపండి                           ...