Evils


పది పాపాలు (Evils)

*బుద్ధుడు చెప్పాడు.జీవులు చేసే అన్ని కర్మలు పది కారణాల వలన చెడ్డవి అవుతాయి. ఇంక పది కారణాలను పరిహరించడం వలన అవి మంచివి అవుతాయి. శరీరం చేసే మూడు(3) చెడులున్నాయి; నాలుకవి నాలుగు(4), మనస్సువి మూడు(3) చెడులు ఉన్నాయి.

శరీరం చేసే మూడు చెడులు : హత్య, దొంగతనం, వ్యభిచారాలు.
నాలుక చేసే  నాలుగు చెడులు : అబద్ధాలాడడం, అపవాదులు వేయడం(చాడీలు చెప్పడం), దూషణం, ఎలాంటి ఉపయోగం లేని సంభాషణలు.
 మనస్సు  చేసే   చెడులు :  లోభత్వం, ద్వేషం, భ్రమలు కలిగి ఉండటం.

 నేను మిమ్మల్ని పది(10) పాపాలకు దూరంగా ఉండమని చెపుతున్నాను.

1 ఏ ప్రాణిని  చంపొద్దు. వాటి ప్రాణం పట్ల గౌరవం చూపించు.
2. దొంగతనం  చేయొద్దు.మీరు దోచుకోవద్దు; కాని ప్రతి ఒక్కరికీ, తన శ్రమకు తగినంత ఫలం పొందేటట్లు  చేయండి.
3.అపరిశుభ్రతకు దూరంగా ఉండండి. పరిశుభ్ర జీవితాన్ని గడపండి.
4. అబద్ధం ఆడొద్దు, సత్యం పలుకు. విచక్షణతో నిర్భయంగా సత్యమే చెప్పు. అదీ ప్రేమైక  హృదయంతో చెప్పు.
5. చెడు వార్తలు పోగుచేయకు. వాటిని తిరిగి చెప్పకు.
6.ఎవరినీ అభిశంసించకు(విమర్శించకు).
తోటి వారిలో మంచిని చూడు. వారిని శత్రువుల నుంచి నిజాయితీతో కాపాడేందుకు వీలుగా.
7.మర్యాదగా హుందాగా మాట్లాడు.
8.మనుషులను వేరు పరిచే  తప్పుడు మాటలు మాట్లాడుతూ కాలం వృధాచేయకు. కాని అర్థవంతంగా (purpose) మాటాడు. లేదా మౌనంగా ఉండు.
8. లోభగుణం ప్రదర్శించకు.ఉదారంగా, దయతో  ఉండు.
9.ఇతరుల అదృష్టానికి సంతోషించు. అంతేగానీ అసూయపడకు. 
10. అసూయనుంచి నీ హృదయాన్ని ప్రక్షాళన చేయి. 
11.ద్వేషాన్ని పెంచుకోకు. నీ శత్రువుల యెడగూడ. సర్వజీవులను కరుణతో కౌగిలించుకో.
12. నీ మనస్సును అవిద్యనుంచి విముక్తం చేసుకో. సత్యాన్ని సత్యంగా తొందరగా తెలుసుకో. అలా చేయకపోతే, నీవు అనుమానాలకు, భ్రమలకు బలైపోతావు. అనుమానం నిన్ను ఉపేక్షకుని (indifferent) చేస్తుంది. ఇంక భ్రమలు నిన్ను దారి మళ్ళిస్తాయి.అవి సరైన జీవితానికి దారితీసే  మార్గం కనుగొన నీయకుండ చేస్తాయి.

( అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అనువదించి రచించిన "బుద్ధుని ధర్మోపదేశం (The Gospel of Buddha)" నుంచి.)


Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు