బౌద్దం_గురించి_ప్రముఖులు



బౌద్దం_గురించి_ప్రముఖులు

భారతజాతి ప్రముఖులలో అత్యుత్తముడు బుద్దుడు.
                             -- నెహ్రూ
ఇతర అన్ని మతాలకన్నా బౌద్దమే మానవాళికి మేలు చేసింది. 
                          --సర్వేపల్లి రాధాకృష్ణ .
మతం అనేది మనిషికి తప్పనిసరి అయితే నేను బౌద్దాన్నే స్వీకరిస్తాను      
                             ..బెర్నాండ్ రస్సెల్
                                                                            నాకు తెలిసి మానవజాతి చరిత్రలో మహోన్నతుడు బుద్దుడు. వేరెవరైనా ఉంటే చూపండి
                                 ‌‌      -వివేకానంద.

సమస్త ప్రజానీకానికి సరిసమానంగా అందజేయగల అత్యుత్తమ సేవ ఏమిటంటే బౌద్దాన్ని వ్యాప్తి చెయ్యడం....
                              -- డా.అంబేద్కర్.

ఆధునిక విజ్ఞాన శాస్త్రం  అంగీకరించగల మతం కేవలం బౌద్దమే.
    ‌౼-ఐన్_స్టీన్.

బౌద్దం మత్తుమందు కాదు .అది మతాలకతీతమైనది.మతాలకే విరుగుడు మందు.
౼౼కార్ల్ మార్క్స్.

బౌద్దాన్ని  తరిమివేసి భారతీయత ఆత్మహత్య చేసుకుంది.
-గురజాడ      

విజ్ఞానపు విలువల్ని, అజ్ఞానపు అనర్ధాల్ని బౌద్ధంవలె ఎలుగెత్తిచాటిన మతం మరొకటి లేదు.  మానసిక సంస్కారపు ఆవశ్యకతకు భూమిక బౌద్ధధమ్మం ఒక్కటే.

- ఈ.జె. మిల్స్   
వేల సంత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు చెప్పిన 'అనిత్య - అనాత్మ' సిద్ధాంతం అక్షరాక్షరం సత్యమని శాస్త్రజ్ఞులు తేల్చిచెప్పారు. దీనినిబట్టి బుద్ధుని అపార మేధాసంపత్తిని, బౌద్ధధమ్మం యొక్క శాస్త్రీయ దృక్పధాన్ని గ్రహించవచ్చు.
                
-డా. రంజన్ రాయ్
మానవ చరిత్రలో మొదటిసారిగా జీవహింస చేయరాదని, ఏ ప్రాణికీ హాని తలపెట్టరాదని, భగవంతుని పేరుతో ప్రార్ధనలూ, బలులూ వృధా అని మొదటగా బోధించినవాడు బుద్ధుడు మాత్రమే.

  -ప్రొఫెసర్ రీజ్ డేవిడ్స్
మనస్సు వ్యక్తీకరించే అత్యంత ఆధునికమైన అంశాలను, మానసిక పరివర్తనతో వివిధ రుగ్మతలను రూపుమాపే పద్ధతులను 2500 సంవత్సరాలకు పూర్వమే బుద్ధుడు ప్రవచించాడు.

-Dr. Rabart H. Dholis



గతిశీలమైన జగత్తులో ఉపనిషత్ వాదులు స్థితిని చూసారు. అస్థితిలో అంతర్గర్భితమైన గతిని బుద్ధుడు చూసాడు. 
        -ఓల్డెన్ బర్గ్ (జర్మన్ తత్వవేత్త)   
                                       
భవిష్యత్ కాలంలో విశ్వజనీనమైన సిద్ధాంతమే విరాజిల్లుతుంది. అది బౌద్ధధమ్మమే. ఇష్టదైవానికి అతీతంగాను, అంధవిశ్వాసాలకి దూరంగాను, భగద్విషయ శాస్త్రాలకి భిన్నంగాను, అర్ధవంతమైన ఐక్యతా భావాలకు వేదికై , భౌతికమైన, ఆధ్యాత్మికమైన అనేక మతానుభవాలకి భూమికై ఉండాలి. ఈ లక్షణాలన్నీ గల మతం (ధమ్మం) బౌద్ధమే.
    -ఆల్బర్ట్ ఐన్ స్టీన్       

                                                                      
భారతీయ మత గ్రంధాల అధ్యయనంలో గౌతమ బుద్ధుని బోధనలు అసాధారణమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ఋగ్వేదంలోని శ్లోకాలలో మానవుల ఆలోచనలు వారినుండి బహిర్గతమై ఊహాజనితమైన దేవలోకం వైపు సాగిపోతాయి. కాని బౌద్ధధమ్మం మనుషుల అన్వేషణను అంతర్ముఖముచేసి, వారిలోని అపూర్వ శక్తిసామర్ధ్యాల్ని గుర్తించేందుకు మార్గదర్శకమైంది. వేదాలలో మనకు కనిపించేవి ప్రార్ధన, స్తుతి, పూజలు మాత్రమే. బౌద్ధధమ్మంలోనే ప్రప్రధమంగా మానవుల మేధస్సుని సానపెట్టే ప్రయత్నం జరిగింది.
            -ఆర్.జె. జాక్షన్                                                                
ఆధునిక శాస్త్రీయ అవసరాలకు సరిపోయే మతమేదైనా ఉందంటే అది బౌద్ధం మాత్రమే.

 -ఆల్బర్ట్ ఐన్ స్టీన్                                                                                                                                                                                        
మానవాళి మనసుల్ని పాలించే బుద్ధభగవానుడే మిక్కిలి శక్తిమంతుడైన పాలకుడు.

 -బెర్ట్రాండ్ రస్సెల్                                                                        
భారతీయ ధార్మిక భావనలో బుద్ధుని ప్రబోధాలు అసామాన్యమైనవి.

-ఆర్. జెజాక్సన్                                                                    
                               

                                                             
మనం ప్రకృతిని అధ్యయనం చేసినప్పుడు రక్తాశ్రువులతో రాసిన మానవ జీవిత పరిణామగాథను పఠించినపుడు జీవనవిధానాన్ని క్రమబద్దం చేసే చట్టాల్ని పరిశీలించినప్పుడు ప్రేమయే దైవమన్న సిద్ధాంతమెంత అభూతకల్పనో అర్ధమౌతుంది. అంతటా.. అనైతికత్వం, మనుగడ ప్రశ్నార్థకం, అభివృద్ధి నిరోధకం, తిను-తినబడు అనే ఆటవిక సూత్రం కనిపిస్తాయి. బౌద్ధధమ్మం దీనికంటే ఎంతో విలక్షణమైనది, ధమ్మబద్ధమైనది.

 -విన్ వుడ్ రీడే

                                    
ఇరవయో శతాబ్ది వరకూ విశ్వానికి అణువులే మూలాధారమని, అవి విచ్చిన్నం కావని, వాటికి వినాశనం లేదని నమ్మబడిన సిద్ధాంతం వమ్మయింది. మిశ్రితమై ఒక రూపుదాల్సినది, చిన్నాభిన్నమై మరో క్రొత్త రూపు దాల్చడం విశ్వంలో ఒక నిరంతర ప్రక్రియ అని ఆధునిక శాస్త్రవేత్తలంతా అంగీకరించారు. వేల సంత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు చెప్పిన 'అనిత్య - అనాత్మ' సిద్ధాంతం అక్షరాక్షరం సత్యమని శాస్త్రజ్ఞులు  తేల్చిచెప్పారు. దీనినిబట్టి బుద్ధుని అపార మేధాసంపత్తిని, బౌద్ధధమ్మం యొక్క శాస్త్రీయ దృక్పధాన్ని గ్రహించవచ్చు.
                
-డా. రంజన్ రాయ్

                                   
బంగారాన్ని కంసాలి ఎట్లా పరీక్షిస్తాడో, ఒక కొత్త మిశ్రమాన్ని కెమిస్టు (chemist) ఏవిధంగా అధ్యయనం చేస్తాడో, ఆ విధంగా మన అనుభవాలను నిశితంగా పరీక్షించుకొని మేధస్సు ద్వారా నిగ్గు తెల్చుకోవడానికి అవకాశమిచ్చే ధమ్మం గౌతమ బుద్ధుడిది.
(మిసిమి - మే, 2004)                                                              
సక్తి ఉండదు. బౌద్ధం ఏవిధమైన ఆచారాలను, మత గ్రంధాలను, బలులను, యజ్ఞ యాగాదులను, ప్రార్ధన-తీర్థప్రసాదాలను నిర్ధేశించదు.

 -ట్రెవెర్లింగ్


                                                                 బుద్ధుడు మొదటి దశలో హేతువుతో పరిశోధన చేసాడు. ఏకాంతం ఆయనకు అనుకూలించింది. రెండవ దశలో దానికి ఏకాగ్రతను జోడించాడు. మూడవ దశలో సమచిత్తుడైనాడు. నాల్గవ దశలో పవిత్రతను, శాంతిని సాధించాడు. ఈ విధంగా సంపూర్ణ జ్ఞానోదయుడైనాడు.

-ఎడ్విన్ ఆర్నాల్డ్                                                           

క్రీ. పూ. 6వ శతాబ్దంలో ఇండియా, చైనాలలో ముగ్గురు ప్రవక్తలు జన్మించారు. వారు దేవుడు ఉన్నాడా, లేడా అనికాక, ఏ స్వప్రయోజనాన్ని ఆశించక ధర్మాన్ని కేవలం ధర్మం కోసమే ఆచరించాలని బోధించారు. ఆ ముగ్గురిలో అత్యంత ప్రముఖుడు గౌతమ బుద్ధుడు.

___సి. ఇ. ఎం. జోడ్

                                                            
నేను 1890 మే 1 వ తేదీన యాదృచ్చికంగా పారిస్ మ్యూజియంను సందర్శించాను. అక్కడ ఆసియా దేవతల సారళ్యతా నిశ్శబ్ధాల మధ్య నిలబడి అవగాహన, కరుణలను పెంపొందించుకోవాలని దుఃఖమయమైన మానవాళికి వెలుగుచూపిన బుద్ధ ప్రతిమను చూసాను. ఎప్పుడైనా ఈ భూమిమీద ఒక దేవుడు నడయాడంటే అతడు ఇతడేనని నాకనిపించింది. ఒక దేవుడికి సాగిలబడి నమస్కరించినట్లుగా ఆ బుద్ధ ప్రతిమ ఎదుట మోకరిల్లాను.
 -అనటోల్ ఫ్రాన్స్  (తన స్వీయ చరిత్రలో)                                                                                   

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు