అన్ని ధర్మాలను కొంచెం కొంచెం తమలో కలిపేసుకున్న జైనం



సనాతనధర్మం గా చెప్పుకునే జైనం లక్షల సంవత్సరాలకు ముందే ఉందని చెబుతారు. మహావీరుని కి 24000 సంవత్సరాల ముందు అరిష్టనేమి ఉండేవారని, ఆయన కంటే 50000 సంవత్సరాల ముందు నేమి ఉండేవారని జైన సంప్రదాయం చెబుతుంది.ఇది వాస్తవ దూరంగా ఉంది. జైనులు బట్టలు వేసుకొని ఉండాలా వద్దా అనే సమస్యపై రెండుగా విడిపోయారు.తెల్లని వస్త్రాలు ధరించాలని చెప్పేవారిని శ్వేతాంబరులు అన్నారు.వస్త్రాలు ఏమాత్రం అవసరం లేదని చెప్పే వారిని దిగంబరులు అన్నారు. జైన తీర్థంకరులు లో ఆఖరి వాడు, ప్రసిద్ధుడు మహావీరుడు.ఇతను బుద్ధుని సమకాలికుడు. బుద్ధుని కంటే పెద్దవాడు.
జైనమతంలో  1) 14 పూర్వ గ్రంధాలు 2)11 అంగ గ్రంధాలు ఉన్నాయి.ఈ గ్రంథాలు ఇప్పుడు లభించడం లేదు. అయితే  ఉమా స్వాతి రచన తత్వార్థాధిగమ సూత్ర అనే గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథంగా రెండు శాఖలు అంగీకరించాయి.
       జైనులు 'అనేకాంత వాదం' ను ప్రతిపాదించారు. ఇది ఉపనిషత్తులు ప్రతిపాదించిన శాశ్వత వాదానికి బుద్ధుడు ప్రతిపాదించిన క్షణిక వాదానికి మధ్యస్తంగా ఉంటుంది. శాశ్వతం ఎంత సత్యమో మార్పు అంత సత్యం అన్నారు.
పదార్థాల ఉనికికి ఆధారమైన ద్రవ్యం మాత్రమే శాశ్వతమైనదని పదార్థాల్లో ఉండే గుణాలు లక్షణాలు మార్పుచెందుతూ ఉంటాయని చెప్పారు. దీన్నే ఇంకొంచెం వివరంగా చెప్తే" ఏ పదార్థమైనా భౌతికంగా శాశ్వతంగా ఉంటుంది. అయితే  ఈ పదార్థం ఏ రూపంలో నైనా గుణాన్ని పొందుతుంది. ఉదాహరణకు మట్టి ద్రవ్యంగా శాశ్వతంగా ఉంటుంది.కాని దాని కూజా రూపం ఆకృతి గానీ రంగు గానీ మారుతూ ఉంటాయి". అంటే ద్రవ్యం శాశ్వతం. గుణాలు మారుతూ ఉంటాయి.
   జైనులు ఏ సిద్ధాంతాన్ని గాని దర్శనాన్ని గాని పూర్తి చేయమని చెప్పలేదు. ఇతర మతస్థుల దృక్పథాలను పాక్షికంగా అంగీకరించారు. ప్రతి దాంట్లో నుంచి ఏదో ఒక విధమైన విషయాన్ని గ్రహించి దాన్ని సత్యమని భావించారు
        వీరు భూమి నీరు అగ్ని వాయువు ఇవన్నీ అణు నిర్మాతలన్నారు. ఈ అణువులు తడిగా గాని పొడిగా గాని ఉంటాయన్నారు. వాటి కలయిక వలన పదార్థాలు ఏర్పడతాయి అని చెప్పారు అణువులు పరిమాణాన్ని కలిగి ఉంటాయి అన్నారు
           కర్మ భౌతిక స్వరూపం అని, అది పాపపుణ్యాల రూపంలో ఉంటుందని భావించారు. జిడ్డుగా ఉండే పదార్థానికి ఏ విధంగా మకిలి చేరుతుందో అదేవిధంగా ఆత్మను కర్మ అంటిపెట్టుకొని ఉంటుందన్నారు. వృక్షాలు, జంతువులు ,మనుషులు, పశుపక్షాదులు, పంచభూతాలు వీటన్నిటిలోనూ జీవం
ఉంటుందని భావించారు. వీరు కూడా అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాని ఆచరించడంలో నైతికతను చూపించారు. వీరు చెప్పే విషయాల్లో తర్కానికి ప్రాధాన్యత నిచ్చారు.

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు